Selling hair: ఊడిపోయిన జుట్టు అమ్ముకుని గిన్నెలు కొనుక్కుంటున్నారా? అయితే ఈ విషయం మీకు తెలియదేమో!

3 months ago 9
ARTICLE AD

Selling hair is inauspicious:  మీ వీధిలో లేదా పరిసరాల్లో జుట్టు కొనే వ్యక్తిని మీరు ఎప్పుడో ఒకప్పుడు చూసే ఉంటారు. వారు జుట్టుకు బదులుగా మీకు పాత్రలు లేదా జీలకర్ర ఇస్తారు. సాధారణంగా వీరు సైకిళ్లపై వస్తుంటారు. మీ కుటుంబంలో ఎవరైనా ఊడిపోయిన జుట్టును సేకరించి అమ్మితే, వారిని హెచ్చరించండి.

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, జుట్టు అమ్మడం అశుభంగా పరిగణిస్తారు ఆధ్యాత్మికవేత్తలు. వాస్తవానికి, ఒక వ్యక్తి యొక్క శక్తి (Aura) వారి జుట్టులో ఉంటుంది. జుట్టు ద్వారా ఎవరినైనా వశీకరణం చేయవచ్చు. ముఖ్యంగా తాంత్రికలు తమ శక్తులను మరింత పెంచుకోవడానికి ఈ జుట్టును కొనుగోలు చేస్తారు. అంతేకాకుండా, వారు జుట్టుతో అనేక రకాల తాంత్రిక శక్తులను కూడా పొందుతారు.

జుట్టు అమ్మడం వల్ల జ్యోతిష్య ప్రభావం

వేద జ్యోతిష్య శాస్త్రంలో జుట్టు చంద్రుడు , శుక్ర గ్రహాలతో సంబంధం కలిగి ఉంటుంది. జాతకంలో చంద్రుడు , శుక్రుడు బలమైన స్థితిలో ఉంటే, జాతకుడికి అదృష్టం కలిసి వస్తుంది. అంతేకాకుండా ఆ జాతకుడి జీవితం సంతోషంగా సాగిపోతుంది. అయితే జుట్టు అమ్మడం వల్ల ఈ రెండు గ్రహాల స్థితి బలహీనపడుతుంది .. జీవితంలో అనేక రకాల సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది.

జుట్టు అమ్మడం గురించి  ఆధ్యాత్మికవేత్తలు ఏమన్నారంటే?

జుట్టు అమ్మడం గురించి  శివమ్ సాధక్ మహారాజ్ మాట్లాడుతూ ఊడిపోయిన జుట్టును అమ్మే మహిళలు, దానిని కొనుగోలు చేసే వ్యక్తి దానిని తాంత్రిక క్రియలలో ఉపయోగించవచ్చని ఆలోచించాలని చెప్పారు. ఆ క్రియల ద్వారా నయం కాని వ్యాధి మీకు సోకే అవకాశం ఉంది. అంతేకాకుండా, మీరు మానసిక   శారీరక ఒత్తిడిని ఎదుర్కోవలసి రావచ్చు. హిందూ వేద సంప్రదాయాలలో జుట్టు అమ్మడం ద్వారా డబ్బు సంపాదించడం నిషేధం.

జుట్టు అమ్మడంపై ముఫ్తీ ఇద్రీస్ ఫలాహి సలహా

హిందూ మతంలోనే కాకుండా ఇస్లాం మతంలో కూడా జుట్టు అమ్మడం హరామ్ (నిషిద్ధం)గా పరిగణిస్తారు.  ముఫ్తీ ఇద్రీస్ ఫలాహి మాట్లాడుతూ, జుట్టును సేకరించి అమ్మే మహిళలు అలా చేయడం మానుకోవాలని చెప్పారు.  తెలియకుండా అలాంటి తప్పు జరిగితే  జుట్టు అమ్మడం ద్వారా వచ్చిన డబ్బును లెక్కించి, అంతే మొత్తాన్ని ఏదైనా పేదవారికి దానం చేయాలి. జుట్టు అమ్మడం వల్ల మీరు మంత్రతంత్రాలకు గురయ్యే అవకాశం ఉంది, ఇది మీ జీవితాన్ని నాశనం చేస్తుందని హెచ్చరించారు.

చాలామంది ఊడిపోయిన జుట్టుని ఓ దగ్గర దాచిఉంచి దాన్ని ఒకేసారి అమ్మేసి గిన్నెలు కొనుక్కుంటారు.. ముఖ్యంగా పల్లెటూర్లలో ఇలాంటివారు ఎక్కువగా కనిపిస్తారు. అయితే మీకు తెలిసిన వాళ్లు, మీ చుట్టుపక్కలవారు ఇలాంటి పని చేస్తే మీరు వారికి అర్థమయ్యేలా చెప్పండి. ఊడిపోయిన జుట్టు అమ్మితే వచ్చే పాత్రల కన్నా...మీ జీవితంలో సంతోషం ఎంతో ముఖ్యం అని వివరించండి అని సలహా ఇస్తున్నారు ఆధ్యాత్మికవేత్తలు

గమనిక: ఇక్కడ అందించిన సమాచారం కేవలం నమ్మకాలపై ఆధారపడి ఉంటుంది. ABPదేశం ఎలాంటి నమ్మకాలను, సమాచారాన్ని ధృవీకరించదని ఇక్కడ చెప్పడం ముఖ్యం. ఏదైనా సమాచారం లేదా నమ్మకాన్ని అమలు చేయడానికి ముందు సంబంధిత నిపుణుడిని సంప్రదించండి.

Read Entire Article