Seethe Ramudi Katnam Serial Today Episode జనార్థన్‌ విద్యాదేవి దగ్గర పడుకోవడంతో మహాలక్ష్మీ డిసప్పాయింట్ అయిపోతుంది. ఏం చేయలేక వెనుదిరుగుతుంది. ఇక తన గదికి వెళ్తూ రామ్ సీతతో తన గురించి మాట్లాడటం విని ఆగుతుంది. సీత రామ్‌కి పాలు ఇస్తూ ఏం ఆలోచిస్తున్నావ్ మామ అంటుంది. మా పిన్ని గురించి అని చెప్తాడు.

సీత: ఆవిడ గురించి ఆలోచించడానికి ఏముంది మామ.
రామ్: అదేంటి సీత తను మా పిన్ని. చనిపోయింది అనుకుంటే ప్రాణాలతో తిరిగి వచ్చింది. ఒక వైపు సంతోషం, ఇంకో వైపు బాధగా ఉంది.
మహాలక్ష్మీ: మనసులో థ్యాంక్స్ రామ్ కనీసం నువ్వు అయినా నా గురించి ఆలోచిస్తున్నావ్.
సీత: బతికినందుకు హ్యాపీ మరీ బాధ ఎందుకు?
రామ్: పిన్ని లేదు అని నాన్న టీచర్‌ని పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు పిన్ని పరిస్థితి ఏంటి.
సీత: ఆ విషయం ఆవిడ ఆలోచించుకుంటుంది నీకు ఎందుకు మామ.
రామ్: నేను ఆవిడ కొడుకుని సీత. తను బాధ పడకుండా చూడాల్సిన బాధ్యత నాకు ఉంది కదా.
మహాలక్ష్మీ: నిజంగా నువ్వు నా కొడుకు అనిపించావ్ రామ్. ఈ అమ్మ బాధ గురించి నిజాయితీగా ఆలోచిస్తున్నావ్ నాకు చాలా హ్యాపీగా ఉంది.
సీత: మహాని చూసి ఈవిడ గారు ఇక్కడే ఉన్నారా చెప్తా నీ సంగతి.
రామ్: పిన్నికి అన్యాయం జరగకూడదు సీత తన స్థాయి హోదా ఎక్కడా తగ్గకూడదు.
సీత: సరే మామ టీచర్‌కి మామయ్యకి పెళ్లి కాలేదు అనుకుందాం ఇంతకు ముందు ఎలా ఉందో ఇప్పుడు అలాగే ఉంది అనుకుందాం. మీ పిన్నికి యాక్సిడెంట్ అవ్వలేదు అనుకుందాం. ఒక వేళ ఎప్పుడైనా మీ అమ్మ సుమతి తిరిగి వచ్చిందే అనుకో అప్పుడు కూడా మీ పిన్ని విషయంలో ఇంతే బాధ పడతావా. మీ అమ్మని పక్కన పెట్టి మీ పిన్నికి న్యాయం జరగాలి అనుకుంటావా.
రామ్: ఎప్పుడైనా నేను మా పిన్ని గురించే ఆలోచిస్తా సీత. మా అమ్మ నన్ను కనొచ్చు కానీ చిన్నప్పటి నుంచి నన్ను మా చెల్లిని పెంచింది మా బాగోగులు చూసింది మా పిన్ని. మా అమ్మ వదిలేసి వెళ్లిన బాధ్యత మా పిన్ని నెరవేర్చింది. ఇటు ఫ్యామిలీని అటు కంపెనీని ఒంటి చేత్తో నడిపించింది. దాని కోసం మా పిన్నికి జీవితాంతం రణపడి ఉంటాం. మా అమ్మ అంటే నాకు ఇష్టం గౌరవం రెండు ఉన్నాయి కానీ పిన్ని అమ్మతో సమానంగా చూస్తా.

మహాలక్ష్మీ చాలా సంతోషంగా వెళ్తే సీత హర్ట్ అయిపోతుంది. విద్యాదేవి సుమతి అని తెలిస్తే తనకు రిస్క్ అని త్వరగా ఈ సమస్యని పరిష్కరించాలని మహాలక్ష్మీ అనుకుంటుంది. మహాలక్ష్మీ అన్నీ ఆలోచిస్తుంటుంది. సీత మాట రామ్ విన్నా సుమతి మాట జనా విన్నా ఇంట్లో తనకు స్థానం లేకుండా పోతుందని అనుకుంటుంది. ఇంతలో విద్యాదేవి వచ్చి రాత్రి జరిగిన దానికి హర్ట్ అయ్యావా అని అడుతుంది. నువ్వు నన్ను ఇంటి నుంచి పంపేయాలి అని చూస్తున్నావ్ అని నేను మాత్రం నిన్ను ఇంట్లో ఉండినిస్తానని కానీ నువ్వు నేనే సుమతి అని చెప్తే నీకు ఈ ఇంట్లో ఒక గది ఇస్తానని టైంకి ఫుడ్ పెడతానని అంటుంది. దాంతో మహాలక్ష్మీ అంత సీన్ లేదు అని నిన్ను విద్యాదేవి అని అనుకొని పెళ్లి చేసుకున్నాడని అంటుంది. సీత తాను ఒకటై మహాలక్ష్మీని ఇంటి నుంచి పంపేస్తానని విద్యాదేవి అంటుంది. ఒకరితో ఒకరు ఛాలెంజ్ చేసుకుంటారు.

మహాలక్ష్మీ పోలీస్‌ త్రిలోక్‌ని కలుస్తుంది. పరిస్థితి మొత్తం తారు మారు అయిపోయిందని చెప్తుంది. సీత లేకుండా చేయాలని అంటుంది. అందుకు మహాలక్ష్మీ తనకు యాక్సిడెంట్ అవ్వడానికి మెకానిక్ కారణం అని అతను పరారీలో ఉన్నాడని అతన్ని పట్టుకోమని చెప్తుంది. అతన్ని అడ్డు పెట్టుకొని సీత అంతు చూస్తా అనుకుంటుంది. ఇక సీత, రామ్, విద్యాదేవి, జనార్థన్‌లు గుడికి వస్తారు. సీత పంతులుతో తన రెండు దీపాలు వెలిగాయాని చెప్తుంది. ఇక పూజ తర్వాత టీచర్ పంతులుతో మాట్లాడాలి అనుకుంటుంది. సీత, రామ్‌లను వేరే గుడికి పంపి తాను పంతులుతో మాట్లాడుతుంది. సీత పెట్టిన దీపం ఆరిపోయిందని చెప్తుంది. తానే సీతకి విషయం తెలిస్తే బాధ పడుతుందని కొండెక్కిన దీపం వెలిగించానని చెప్తుంది. చాలా అరిష్టమని పంతులు అంటాడు. పరిష్కారం అడుగుతుంది. ఇంతలో ఒక వ్యక్తి వచ్చి తన భార్య వెలిగించిన దీపం ఆరిపోయిందని తన భార్యకి గుండె పోటు వచ్చిందని చెప్తాడు. లేటు అయిందని ఇప్పుడే చేయలేం అని పంతులు అంటే ఇంతలో అతనికి తన భార్య చనిపోయిందని ఫోన్ వస్తుంది. టీచర్ చాలా కంగారు పడుతుంది. రామ్ సీతల మధ్య ఇబ్బందులు వచ్చి విడిపోవచ్చని అంటాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.

Also Read: కలవారి కోడలు కనకమహాలక్ష్మీ సీరియల్: ఆ బంధం అబద్ధమా.. నీతో నా జీవితం అబద్ధమా.. ఇలాంటి కష్టం ఏ ఆడపిల్లకీ రాకూడదు!