School Holidays In Andhra Pradesh And Telangana: స్కూల్‌కు వెళ్లే విద్యార్థులకు ఒక్కరోజు అదనపు సెలవు వచ్చినా అది ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. ఫిబ్రవరిలో అదనంగా ఒక రోజు సెలవు ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పటి వరకు శివరాత్రి సందర్భంగా 26న మాత్రమే సెలవు అనుకున్నారు. కానీ ఇప్పుడు 27న కూడా ప్రభుత్వం సెలవు దినంగా ప్రకటించింది. అయితే ఇందులో ట్విస్ట్ కూడా ఉంది.

జనవరి మొదటి నుంచి ఆఖరి వరకు సెలవులు ఎంజాయ్ చేశారు విద్యార్థులు. న్యూఇయర్‌, సంక్రాంతి ఇలా చాలా సెలవులు వచ్చాయి. అయితే ఫిబ్రవరికి వచ్చేసరికి మాత్రం నాలుగు ఆదివారాలు, రెండో శనివారం, శివరాత్రి తప్ప సెలవులు లేవనుకున్నారు. కానీ ఎన్నికల రూపంలో మరో సెలవులు కలిసి వచ్చింది.

ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో పట్టభద్రుల, ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. తెలంగాణలో ఒక గ్రాడ్యుయేట్‌, రెండు టీచర్‌ ఎమ్మెల్సీ స్థానాలకు, ఆంధ్రప్రదేశ్‌లో 2 పట్టభద్రలు ఎమ్మెల్సీ స్థానాలకు, ఒక ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నికలు జరగనున్నాయి.

ఈ ఎన్నికల పోలింగ్ ఫిబ్రవరి 27న అంటే శివరాత్రి తర్వాత రోజు జరగనున్నాయి. అందుకే ఈ ఎన్నికలు జరిగే జిల్లాలకు ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్‌లో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాలు, కృష్ణా, గుంటూరు జిల్లాల పాఠశాలలకు ఈ సెలవు వర్తిస్తుంది.

Also Read: తెలంగాణ టెట్ ఫలితాలు విడుదల, రిజల్ట్స్ కోసం డైరెక్ట్ లింక్ ఇదే

తెలంగాణ రాష్ట్రంలో చూసుకుంటే మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాలకు 27న సెలవు దినంగా ప్రభుత్వం ప్రకటించింది. ఇక్కడ ఓటింగ్‌, విధుల్లో ఉపాధ్యాయులు పాల్గోనున్నారు. ఫిబ్రవరి 3న ఈ ఎమ్మెల్సీ ఎన్నికలకు నోటిఫికేషన్‌ విడుదల అయింది. ఈ పదో తేదీ లోపు అభ్యర్థులు నామినేషన్‌లు వేయాల్సి ఉంటుంది. వచ్చిన నామినేషన్లను 11వ తేదీన పరిశీలిస్తారు. 13వతేదీ వరకు నామినేషన్‌లు వెనక్కి తీసుకనే ఛాన్స్ ఇచ్చారు.

పోటీలో ఉన్న అభ్యర్థులకు శివరాత్రి తర్వాత రోజున అంటే 27న ఉదయం ఎనిమిది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు ఓటింగ్ జరుగుతుంది. మార్చి 3న ఓట్ల లెక్కింపు చేససి విజేతలను ప్రకటిస్తారు.

Also Read: ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో వైసీపీ నేతలు- కూటమికి మేలు చేయడానికా? కీడు చేయడానికా?