Satyabhama Serial Today Episode సంధ్యని ఎవరో రౌడీలు ఏడిపిస్తున్నారని సత్య, నందిని, క్రిష్‌ వెళ్తారు. క్రిష్‌ మెల్లగా డ్రైవింగ్ చేస్తే సత్య ఫాస్ట్‌గా వెళ్లమని అంటే దానికి క్రిష్‌ సంధ్య చెప్పినట్లు నేను అలా మరొకరితో ఫోన్ చేయించా అంటాడు. దానికి నందిని ఇలా ఎందుకు చేశావ్ అన్నయ్య అని అంటే అమ్మ సత్యని ప్రచారానికి వెళ్లకుండా ఆపింది కాబట్టి నేను బయటకు తీసుకొచ్చానని మా బాపు ధర్మంగా యుద్ధం గెలవాలి అని అన్యాయంగా మేం గెలవడం మాకు ఇష్టం లేదని అంటాడు.

ఇక సత్య ఓ చోట ప్రచారం చేస్తుంటే బస్టాండ్‌లో కొందరు అమ్మాయిల్ని ఓ అధికారి పిల్లలు ఏడిపిస్తారు. అందరూ పెద్దింటివాళ్లతో మనకు ఎందుకు అని అనకుండా చూస్తూ ఉండిపోతే సత్య వెళ్లి వాళ్లతతో గొడవ పడతుంది. ఆ అబ్బాయి అతిగా మాట్లాడితే చెప్పుతో కొట్టి అక్కడున్నా అమ్మాయిలకు ధైర్యం చెప్పి వాళ్లతో కూడా కొట్టిస్తుంది. ఓ అబ్బాయి అదంతా వీడియో తీస్తాడు. అక్కడున్న ఓ వ్యక్తి అమ్మాయిలు మా ఓటు మీకే అంటూ ప్రచారం చేస్తారు. ఆ అబ్బాయి వీడియోని సోషల్ మీడియాలో పెడతాడు. అందరూ వీడియో చూసి మహదేవయ్య కోడలు అదరకొట్టిందని అందరూ సత్యని పొగిడి సత్య ఎమ్మెల్యే అయితే బాగుంటుందని అనుకుంటారు. దానికి రుద్ర సత్య కొట్టి ఫేమస్ అయితే మనం మర్డర్ చేద్దామని అప్పుడు సెట్ అయిపోతుందని అంటాడు. ఇక క్రిష్ ఆ వీడియో చూసి ఇప్పుడే మీడియాకి చెప్పి సత్య మీద స్పెషల్ స్టోరీ వేయించి సత్య ఇమేజ్ పెంచాలని అనుకుంటాడు.

ఇక సత్య పుట్టింటి వాళ్లు ఆ వీడియో చూస్తారు. శాంతమ్మ కొడుకుతో ప్రశాంతంగా ప్రచారం చేసుకోకుండా ఈ గొడవలు ఎందుకురా అంటుంది. విశ్వనాథం కూడా చేసింది మంచి పని కానే రౌడీలతో ఎందుకు అంటాడు. ఇక హర్ష మాత్రం అందరూ చెల్లిని పొగుడుతున్నారని చెప్తాడు. జనం గుండెల్లో స్థానం పొందిందని అంటాడు. ఈ ఘటన సత్య జీవితంలో గొప్ప మలుపు అవుతుందని విశాలాక్షి అంటుంది. ఇక సత్య, నందిని ఎప్పటిలా తమ ప్రచారం సాగిస్తారు. హర్ష నందినికి కాల్ చేస్తాడు. సత్య రౌడీలను కొట్టిన వీడియో ఫుల్ వైరల్ అయిందని ఇక సత్యకి తిరుగే లేదని చెప్తాడు. నందిని సంతోషంతో సత్యకి విషయం చెప్తుంది. ఇప్పుడే మనం పోటీలోకి వచ్చాం అని నందిని అంటుంది. ఇద్దరూ సంతోషంగా మాట్లాడుతూ ఉంటే సత్య రోడ్డు మీద సంధ్య సంజయ్ బైక్ మీద వెళ్లడం చూస్తుంది. షాక్ అయిపోతుంది. ప్రచారం ఆపేసి ఇంటికి బయల్దేరుతుంది.

ఆటోలో ఇంటికి వెళ్తూ సంధ్యకి కాల్ చేస్తుంది. దాంతో సంధ్య భయపడి తనని ఇంటి దగ్గర డ్రాఫ్ చేయమని చెప్తుంది. ఇంటికి వచ్చిన సంధ్యకి మరోసారి సత్య కాల్ చేసి నువ్వు సంజయ్ బైక్ మీద వెళ్లడం చూశానని అంటుంది. దాంతో సంధ్య అటుగా వెళ్తుంటే లిఫ్ట్ ఇస్తానని చెప్పాడని చెప్తుంది. దాంతో సత్య పెళ్లి కావాల్సిన దానివి అతనికి కాస్త దూరంగా ఉండు అని చెప్తుంది. ఇక మీడియా సత్య దగ్గరకు వస్తారు. సత్యని మీడియా పొగుడుతుంది. ఇంటర్యూ ఇవ్వమని వాళ్లు అడిగితే వద్దని ఇది నేను ప్రచారం కోసం చేయలేదని చెప్తుంది. ఇంట్లో వాళ్లు చూసి షాక్ అయిపోతారు. సత్య ఇమేజ్ పెరిగిపోతుందని టెన్షన్ పడతారు. ఎవరికి ఎలాంటి అన్యాయం జరిగినా అండగా ఉంటాను ఎదురిస్తానని అని చెప్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.

Also Read: కార్తీకదీపం 2 సీరియల్: రోడ్ల మీద తిరుగుతూ పిచ్చోడిలా ఏడుస్తున్న కార్తీక్.. 2 రోజుల్లో ఆపరేషన్.. శౌర్య బతుకుతుందా!