Satyabhama Serial Today Episode:  అందరూ కలిసి నామినేషన్స్‌ వేయడానికి ఆఫీసు లోపలికి వెళ్తారు. లోపలికి వెళ్లిన మహదేవయ్య సత్యను చూస్తూ నువ్వు నామినేషన్‌ వేయడానికి నీతో పది మంది లేరు కదా అంటాడు. ఒకసారి అటు చూడండి మామయ్య అంటుంది సత్య. అందరూ అటు చూస్తారు ఎవరు వచ్చారని అడుగుతారు.

మహాదేవయ్య: ఇంకెవరు నా చిన్న కొడుకు వచ్చాడు.. అరేయ్‌ చిన్నా నేను గెలవాలని నువ్వు మనఃస్పూర్తిగా సంతకం చేయరా..?

క్రిష్: మనసు చంపుకొని మా బాపుకి సపోర్ట్ గా నిలుస్తున్నాను సత్య నన్ను దయచేసి ఏమీ అనుకోవద్దు (అని మనసులో అనుకుంటాడు. సత్య అన్న మాటలు గుర్తుచేసుకొని క్రిష్ బాధపడతాడు.)

క్రిష్‌ సంతకం పెట్టగానే ఇక నెక్స్ట్‌ సత్య నామినేషన్‌ వేయాలి అని ఆఫీసర్లు చెప్తారు. సత్యకు సపోర్టుగా పది మంది ఉన్నారా..? లేరా అని అందరూ చూస్తుంటారు. సత్యకు పది మంది లేరని అనుకుంటారు. ఇంతలో మహాదేవయ్య, సత్య దగ్గరకు వస్తాడు.

మహాదేవయ్య: నా మీద పంతంతోనే నువ్వు పోటీ చేస్తున్నావని నాకు తెలుసు. నిన్న నరసింహ ఏమన్నాడో చూసావు కదా అలాంటి వాళ్ళు నోరు మూయాలంటే నువ్వు నామినేషన్స్ నుంచి తప్పుకుంటావో లేకపోతే నామినేషన్లు వేస్తావో అది నీ ఇష్టం కోడలా..

అని మహాదేవయ్యా చెప్పగానే.. రుద్రా కూడా సత్యను ఎగతాళి చేస్తాడు.

రుద్ర: నామినేషన్‌ వేయడానికే పది మంది లేరు. ఇక ఎలా గెలుస్తావు. నీ మొగుడు కూడా నీకు సంతకం చేయలేదు..

సత్య: సరే మామయ్య కానీ చిన్న కొడుకు చెప్తే నేను ఏదైనా చేస్తాను. తను నామినేషన్‌ వేయమంటే వేస్తాను. లేదంటే వేయను..

భైరవి: ఇదేదో ఇంటిదగ్గర చెప్తే బాగుండేది కదా అప్పుడే వెనక్కి తగ్గే వాళ్ళం ఇంత జరిగేది కాదు కదా

క్రిష్: ఇంత దూరం వచ్చిన తర్వాత వెనక్కి తగ్గితే ఏదో ఒకటి అవుతుంది. సత్య వెనక్కి తగ్గకూడదు.. సత్య తప్పుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు తప్పుకుంటే మనం తప్పించామని అందరూ అనుకుంటారు.

మహాదేవయ్య: అవునా అయితే సత్య దగ్గర పదిమంది లేరు కదా

సత్య: నా దగ్గర పదిమంది లేరని మీరు అనుకుంటున్నారు ఒకసారి అటు చూడండి నాకు సపోర్ట్ చేయడానికి ఎవరు వచ్చారో..

అని సత్య చెప్పగానే డోర్‌ వైపు చూస్తాడు మహాదేవయ్య. చక్రవర్తి రావడం చూసి మహదేవయ్య షాక్ అవుతాడు. చక్రవర్తికి ఎదురుగా వెళ్తాడు.

మహదేవయ్య: నీ కోడలికి సపోర్ట్ చేయాలని వస్తున్నావా..? నా గురించి నీకు తెలియదా..?

అంటూ మహాదేవయ్య బెదిరిస్తాడు. అయినా చక్రవర్తి భయపడకుండా ఉంటాడు.

చక్రవర్తి: నేను ఇక్కడకు వచ్చింది సత్యకు ఒక మాట చెప్పడానికి.. ఆ మాటేదో చెప్పి వెళ్లిపోతాను.

మహదేవయ్య: అయితే నువ్వు సపోర్టు చేస్తే సత్య గెలుస్తుందా..? అయితే నువ్వు సపోర్టు చేయాల్సిందే..?

అని చెప్తుండగానే చక్రవర్తి లోపలికి వెళ్తాడు. లోపలికి వచ్చిన చక్రవర్తిని అందరూ తిడతారు. సత్యతో మాట్లాడి చక్రవర్తి వెళ్లిపోతాడు. ఇక సత్యకు సపోర్టు చేస్తానన్న సంధ్య ఇంకా రాలేదని విశ్వనాథం ఫోన్‌ చేస్తాడు. సంధ్య తాను రానని మామయ్య మీద అక్క పోటీ చేయడం తనకు ఇష్టం లేదని చెప్తుంది. దీంతో సత్య డైలమాలో పడిపోతుంది. సత్య బాధను చూసిన క్రిష్‌ కూడా ఆలోచిస్తుంటాడు. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!