Satyabhama Serial Today Episode సత్యని కాదని ఇంట్లో సంధ్య పూజ చేస్తుంది. భైరవి, బామ్మ సంతోషపడతారు. సంధ్య బామ్మకి అత్తకి హారతి ఇస్తుంది. సత్య కళ్లకి హారతి పెట్టి కొన్ని కొన్ని మనసుకి నచ్చనివి జరిగితే డైజస్ట్ చేసుకోవడం కష్టం. అయినా తప్పదు నీ అధికారం లాక్కుంటాను అని నీ భయం కదా.. నీ భయాన్ని నిజం చేస్తా... అందరినీ నా వైపు తిప్పుకుంటా.. నిన్ను ఈ ఇంటి కోడలు అనే విషయం కూడా మర్చిపోయేలా చేస్తా ఏం అనుకోకు అక్క ఇదే జరుగుతుంది అని సత్యతో సంధ్య చెప్తుంది.

సత్య: చిక్కుల్లో పడుతున్నావ్ సంధ్య. నా బంగారు తల్లివి కదా అర్థం చేసుకో. అక్క మాట విను.
సంధ్య: నాటకాలు ఆడకు అక్క నేను చచ్చినా నీ మాట వినను.
సత్య: ఎవరిది నాటకమో కాసేపట్లో తెలిసిపోతుంది. అప్పుడు మళ్లీ మాట్లాడుకుందాం.
సంధ్య: ఇంకాసేపట్లో తెలిసిపోతుంది అని ఎందుకు అంది. ఏం తెలుస్తుంది.
మైత్రి: అంకుల్ నేను ఫారెన్ వెళ్తున్నా నాకు ఓ చిన్న సాయం కావాలి. డబ్బులు అడగటం లేదు. మా నాన్న చూసుకునే అనాథ ఆశ్రమాన్ని నేను చూసుకుంటున్నాను. నేను ఫారెన్ వెళ్లే అది చూసుకోవడం కష్టం. అందుకే నేను వచ్చే వరకు దాని బాధ్యత అంకుల్‌కి తీసుకోమని అడగటానికి వచ్చాను.
విశ్వనాథం: ప్రస్తుతం నాకు అంత ఓపిక లేదమ్మా. నా మెంటల్ టెన్షన్స్ నాకు ఉన్నాయి.
మైత్రి: హర్ష నువ్వు సాయం చేయొచ్చు కదా పుణ్యం వస్తుంది.
హర్ష: దాంట్లో ఏముందు మంచి పనే కదా.
మైత్రి: థ్యాంక్యూ. కొన్ని పేపర్ల మీద నువ్వు సంతకం పెట్టాల్సి ఉంటుంది. పేపర్లు రెడీ అవగానే నేను పిలుస్తా ఒక సారి రాగలవా.
నందిని: ఎందుకు ఒప్పుకున్నావ్.
హర్ష: నాకు కొంచెం పుణ్యం కావాలి అంతే.
నందిని: సరే పోనీ కొట్లాట ఎందుకు ఆ దరిద్రం ఎలాగూ ఫారెన్ పోతుంది కదా వచ్చే నష్టం లేదులే.

పంతులు: సంధ్య, సంజయ్ తొలిరేయికి ముహూర్తం పెడుతూ.. అమ్మా రెండు రోజుల తర్వాత మంచి ముహూర్తం ఉంది. ఖాయం చేయమంటారా.
మహదేవయ్య: రెండు దినాలే కదా ఇలా శోభనం అయిన వెంటనే కశ్మీర్‌కి ప్లైట్ ఎక్కుతారు. నీకు ఏం అభ్యంతరం లేదుగా సత్య.
చక్రి: నాకు అభ్యంగారం ఉంది. పంతులు మీరు ఇక బయల్దేరండి.
సంజయ్: సంధ్య డాడీ కాళ్లకి దండం పెడదాం.
చక్రవర్తి: అవసరం లేదు. ఏరా కళ్ల ఎదురుగా కనబడితేనే నీకు డాడీ గుర్తొస్తాడా. వాడికి అసలు బుద్ధి ఉందా అన్నయ్య తండ్రి అనేవాడు ఒకడు ఉన్నాడని గుర్తొందా లేదా. చెప్పకుండా పెళ్లి చేసుకున్నాడు. కనీసం తర్వాత అయినా చెప్పాలికదా.
మహదేవయ్య: వాడి టెన్షన్ వాడికి ఉన్నాయ్. నెత్తి మీద రెండు అక్షింతలు వేసి వెళ్లిపో వాడిని ఏం అనకు.
చక్రి: వీడిని అన్నయ్య దగ్గర వదిలి వెళ్లాను వీడు అన్నయ్యని కూడా మోసం చేశాడు.
సత్య: అన్నయ్యని కూడా అంటే ఇంకెవరిని మోసం చేశాడు చిన్నమామయ్య.
చక్రి: నీ చెల్లిని మోసం చేశాడు.
సంధ్య: ప్రేమించి ఇష్టపడి పెళ్లి చేసుకున్నా సంజయ్ నన్ను మోసం చేయలేదు మామయ్య.
చక్రి: మోసం చేశాడు అది నీకు తెలీడం లేదు.
క్రిష్‌: ప్రేమించి పెళ్లి చేసుకోవడం మోసం ఎలా అవుతుంది బాబాయ్.
చక్రి: ఇంకో అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకుంటా అని మాటిచ్చి సంధ్య మెడలో తాళి కట్టడం మోసం కాదా.
సత్య: గుండెలు బాధుకొని చెప్పాను నువ్వు వినలేదు వాళ్ల నాన్న చెప్తున్నారు ఇప్పటికైనా నమ్ముతావా.
సంజయ్: సంధ్య లేదు నేను నిన్ను సిన్సియర్‌గా లవ్ చేశా.
సంధ్య: అయితే మీ డాడీ అబద్ధం చెప్తున్నారా.
సత్య: అది అలా అడుగు.
మహదేవయ్య: ఎందుకు సంధ్యని రెచ్చగొడుతున్నావ్.
సత్య: నా చెల్లిని మోసం చేస్తే కడుపు మండదా మరి.
సంధ్య: సంజయ్ లవ్ చేసింది ఎవరినో తెలుసా మామయ్య.
చక్రి: తెలుసు ఆమె పేరు రూప. ఫారెన్‌లో ఉంటుంది. అక్కడ చదువుతున్నప్పుడు లవ్ చేశా అని త్వరలో పెళ్లి చేసుకుంటానని వీడే నాతో చెప్పాడు.
సంధ్య: మరి ఎందుకు ఇప్పుడు మాట మార్చుతున్నాడు. సంజయ్ రూప నెంబరు చెప్పు.
చక్రి: అవసరం లేదమ్మా నువ్వు కష్టపడక్కర్లేదు. కాసేపట్లో ఆ అమ్మాయి ఇక్కడికి రాబోతుంది. సంజయ్‌కి పెళ్లి అయిన విషయం రూపే నాకు కాల్ చేసి చెప్పింది.
సత్య: ఇప్పుడు తను వచ్చి తాళి కట్టమని అంటుంది. కట్టనిస్తావా సవతిలా బతుకుతావా.
క్రిష్: బయటకు లాక్కెళ్లి.. నాకు ఏదో తేడా కొడుతుంది. కారణం ఏదైనా మీ ఇద్దరి పెళ్లి చేసింది నేను. ఆమెను నువ్వు నిజంగా పెళ్లి చేసుకుంటా అని మాట ఇచ్చావా. సంధ్యకి అన్యాయం చేస్తే ఎవరు అడుగుతారులే అనుకుంటున్నావా సంధ్యకి నేను ఉన్నాను. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.

Also Read: కార్తీకదీపం 2 సీరియల్: శ్రీధర్‌కి షాక్‌ మీద షాక్‌లు.. పుల్ల పెట్టేసిన మేన కోడలు.. హోమం దగ్గర ఏం గొడవో!