Sankranti 2025 Recipes: నోరూరించే సంక్రాంతి వంటలు - ఒక్కో వంటకు ఒక్కో ప్రత్యేకత

10 months ago 7
ARTICLE AD

Makar Sankranti 2025 | సాంప్రదాయ పిండి వంటలు నోరూరిస్తూ సంక్రాంతి ప్రత్యేకతను తెలియజేస్తుంటాయి. వీటిల్లో రకరకాల స్వీట్లు, హాట్లు కూడా ఉంటాయి. ఒక్కో వంటకు ఒక్కో ప్రత్యేకత. ఈ కాలం పిల్లలు అరిసెలు ఎక్కువగా ఇష్టప డరు. చుప్పులు, జంతికలంటే తెలియదు. కానీ ఒక్కసారి రుచి చూపిస్తే మళ్లీ మళ్లీ కా వాలంటారు. కొందరికి ఇవి ఎలా చేసుకోవా లో... ఇంగ్రీడియన్స్ ఎలా తీసుకోవాలో...  తెలియకపోవచ్చు. పూర్వీకులు నిర్ణయించిన సంప్రదాయ వంటలే అయినప్పటికీ వాటిలో పోషకాలు అత్యధికమని వైద్య నిపుణులు పే ర్కొంటున్నారు.

సంక్రాంతి శీతాకాలంలో వచ్చే అతి పెద్ద పండుగ. ఆరుగాలం శ్రమిం చి పండించిన ధాన్యాన్ని ఇంటికి తెచ్చి నిల్వ లు చేసుకుంటారు. శీతాకాలంలో తీసుకునే ఆహారమే అత్యధిక శక్తినిచ్చేందుకు సహకరి స్తుంది. అందుకే కొత్త బియ్యంతో చేసిన రకరకాల పిండివంటలు సంక్రాంతి సమ యంలో చాలా ఎక్కువగా కనిపిస్తాయి. ఈ వంటకాలు శరీరానికి శక్తినివ్వటంతో పాటు ఉష్ణం పెంపొందించుకునేందుకు దోహదపడ తాయి. సంక్రాంతి సంప్రదాయ పిండివంట ల ప్రాశస్త్యం.. ఏయే వంటకాల్లో ఎలాంటి పోషకాలున్నాయన్న వివరాలు చూద్దాం..

అరిసెలు..

సంక్రాంతి అనగానే ముందుగా గుర్తు కొచ్చేది అరిసెలు. అరిసెలు లేని సంక్రాంతి ని ఊహించుకోవటం కష్టం... అంటే దాని ప్రాధాన్యత తెలుసుకోవచ్చు. బెల్లంతో చేసినఅరిసెలు ఆరోగ్యానికి శ్రేష్టం. వీటి తయారీ లో కొత్త బియ్యపు పిండి, నూనె, బెల్లం, నువ్వులు వాడుతారు. ఇందులో వాడే బెల్లం రక్తాన్ని శుద్ధిచేయటంతోపాటు శరీరంలోని వ్యర్థాలను తొలగిస్తుంది. వీటిలో కార్బోహై డ్రోట్లు అధికంగానుంటాయి. ఐరన్తోపాటు పలు పోషకాలు శరీరానికి లభిస్తాయి. బెల్లం రక్త శుద్ధికి దోహదపడుతుంది.

కొబ్బరి బూరెలు

అరిసెల తరువాత అంతటి మధురమైన రుచిని అందించే వంట కొబ్బరి బూరెలు. దీంట్లో కొత్త బియ్యపు పిండి, కొబ్బరి, నువ్వు లపిండి, బెల్లాన్ని వాడతారు. పాకం పట్టేందు కు కొంతమంది పంచదార వాడతారు. పంచదార అయితే శక్తినందించి వెంటనే వదిలేస్తుంది. అదే బెల్లం అయితే మనిషికి దీర్ఘకాలంపాటు శక్తినిచ్చేందుకు దోహదపడు తుంది. అందుకారణంగా బెల్లాన్ని వినియోగించడమే మంచిది. అరిసెల్లోని పోషకాలతో పాటు కార్బోహైడ్రోట్లు కూడా పుష్కలంగా కొబ్బరి బూరెల్లో లభిస్తాయి.

గారెలు..

వేడి వేడి గారెల్లో నాటుకోడి మాంసం వేసుకుని తింటే ఆ రుచే వేరు. కేవలం రుచి లోనే కాదు... పోషకాలు చాలానే ఉంటాయి. రానురానూ పొట్టు తీసిన మినప్పప్పు గారె లకు వాడుతున్నారు. కానీ మినప పొట్టుతో ఉన్న గారెలే ఆరోగ్యానికి శ్రేష్టం. మినుములో పుష్కలంగా మాంసకృత్తులుంటాయి. మాంస కృత్తులతోపాటు అనేక రకాల ప్రోటీన్లు, పోష కాలు శరీరానికి లభిస్తాయి.

జంతికలు...

తియ్యటి పదార్దాలు తిన్న తరువాత కారంగానుండే పదార్దాలు కోరుకుంటారు. అలాంటి సమయాల్లో గుర్తుకొచ్చేవి జంతిక లు. పండుగల సందర్భంలో సామాన్యుని ఇంటిలో సైతం ఉండే వంటకమిది. బియ్యపు పిండి, శనగపిండి, నువ్వులు ఇం దులో వాడతారు. శనగపిండి, బియ్యపు పిండి కార్బోహైడ్రోట్లను, ప్రోటీన్లను అందిస్తే, నువ్వులు చర్మాన్ని కాంతివంతం చేసేందుకుసహకరిస్తాయి. చిన్నపిల్లలు వీటిని ఎక్కువ తింటారు. వీటిలో వాడే వాము సుఖ విరేచనానికి తోడ్పడి.. . జీర్ణ ప్రక్రియ చురుగ్గానుండేందుకు దోహదపడుతుంది.

కజ్జికాయలు..

పండుగకు ఎన్ని వంటకాలు వండు కున్నా తప్పనిసరిగా కజ్జికాయలు వండు తారు. ఎందుకంటే దీర్ఘకాలం నిల్వ ఉండ టంతోపాటు పిల్లలు వీటిని ఇష్టంగా తింటారు. అందుకే పండుగకు ఏం పిండి వంటలు వండుతున్నారని అడిగితే అరిసెలు, కజ్జికా యలు, జంతికెలు అని చెబుతుంటారు. దీనిలో కొబ్బరి, రవ్వ, పంచదారతోపాటు సుగంధ ద్రవ్యాలైన యాలకులు, జీడిపప్పు, వంటివి వినియోగిస్తారు. మనిషికి కావాల్సిన ప్రోటీన్స్, ఐరన్, ఖనిజ లవణాలు అందు తాయి.

నువ్వుల ఉండలు...

అతి బలవర్ధకమైన ఆహారం నువ్వుల ఉండలు. శీతాకాలంలో శరీరం పొడిబారి పోతూ ఉంటుంది. ఈ సమయంలో నువ్వు లు ఆహారంగా తీసుకోవడం ద్వారా దానిలో నుండే నూనె శరీరాన్ని కాంతివంతంగా నుండేలా దోహదం చేస్తుంది. కిశోర్ బాలికల్లో రక్తహీనత నివారించేందుకు ఉపకరిస్తుం ది. శరీరంలో వేడి పుట్టించేందుకు ఇవి ఎంతగానో దోహదపడతాయి. విటమిన్ ఎ డి, ఇ, కె లభిస్తాయి. హార్మోన్ల స్థాయి పెంపు దల చేసి దేహదారుఢ్యానికి దోహదపడు తుంది.

సున్నుండలు...

బలవర్ధకమైన ఆహారంలో సున్ని ఉం డలు మొదటి స్థానంలో ఉంటాయి. మినప పిండి, నెయ్యి, బెల్లం వాడుతారు. బెల్లం రకాన్ని శుద్ది చేస్తే, సున్ను, నెయ్యి ద్వారా ప్రోటీన్లు పలు రకాల పోషకాలను అంద జేస్తాయి. కొత్త అల్లుళ్లకు ప్రత్యేకంగా సున్ని ఉండలు అడిగి అడిగి మరీ పెడతారు. సుఖ విరేచనమై శరీరం తేలికగా ఉంటుంది. హార్మోన్లను సమతుల్యంగా ఉంచేందుకు సహ కరిస్తుంది. విద్యార్దుల్లో ఏకాగ్రత, జ్ఞాపకశక్తి ని పెంపొందించేందుకు ఎంతో దోహద పడతాయి

Read Entire Article