ఈ సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన సినిమాల్లో 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమాకు ఊహించని రేంజ్ లో ప్రేక్షకాదరణ దక్కుతోంది. విక్టరీ వెంకటేష్ హీరోగా, అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మూడు రోజుల్లోనే 100 కోట్ల క్లబ్ లోకి చేరింది. దిల్ రాజు నిర్మాతగా వ్యవహరించిన 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమాలో ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాలో నటించే అద్భుతమైన ఛాన్స్ ని మరో ఇద్దరు హీరోయిన్లు మిస్ చేసుకున్నారన్న వార్త తాజాగా బయటకు వచ్చింది. మిస్ చేసుకున్నారు అనేకంటే జస్ట్ మిస్ అయ్యింది అని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ ఆఫర్ ఇంకా ఆ హీరోయిన్ల దగ్గరకు వెళ్ళలేదు. తాజాగా ఓ చిట్ చాట్ లో అనిల్ రావిపూడి మాట్లాడుతూ ఈ సినిమాలో ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి బదులు ఏ హీరోయిన్ ని తీసుకుంటారు అనే ప్రశ్నకు మరో ఇద్దరు హీరోయిన్ల పేర్లు చెప్పారు.

ఐశ్వర్య, మీనాక్షి కాకపోతే ఆ ఇద్దరు హీరోయిన్లు...
సాధారణంగా కొన్నిసార్లు హీరో హీరోయిన్లు బిజీగా ఉండడం వల్ల, లేదంటే కంటెంట్ నచ్చకపోవడం వల్ల అవకాశాలను చేజార్చుకుంటారు. కానీ తాజాగా బ్లాక్ బస్టర్ గా నిలిచిన 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమా విషయంలో ఇద్దరు హీరోయిన్ల దగ్గరికి అవకాశం రాకముందే మిస్ అయ్యింది. తాజాగా 'సంక్రాంతికి వస్తున్నాం' టీం చిట్ చాట్ లో భాగంగా పలు ఇంట్రెస్టింగ్ విషయాలను షేర్ చేసుకున్నారు.

ఐశ్వర్య రాజేష్ "సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో నేను, మీనాక్షి కాకపోతే ఇంకెవరిని సెలెక్ట్ చేసుకునేవారు?" అంటూ అనిల్ రావిపూడికి ప్రశ్నలను సంధించింది. వెంటనే అనిల్ రావిపూడి "ఐశ్వర్య రాజేష్ బదులు నిత్యా మీనన్, మీనాక్షి చౌదరి బదులు పూజ హెగ్డే" అంటూ సమాధానం ఇచ్చారు. దీంతో వెంటనే ఐశ్వర్య రాజేష్ స్పందిస్తూ... "నేను ఇంకా మిమ్మల్ని తప్ప ఎవరినీ ఊహించుకోలేము అని చెప్తారేమో అనుకున్నాము" అంటూ పెదవి విరిచింది. అనిల్ రావిపూడి "భాగ్యం పాత్రను ఐశ్వర్య రాజేష్ తప్ప ఇంకెవరూ చేయలేరు. అలాగే పోలీస్ ఆఫీసర్ గా మీనాక్షి చౌదరి అదరగొట్టింది. మీనాక్షిలో ఎంటర్టైన్మెంట్ టైమింగ్ ఉంది" అంటూ కవర్ చేసే ప్రయత్నం చేశారు.

మిస్సయిన సినిమాలు...
ఇక ఈ చిట్ చాట్ లో భాగంగా "ఎవరితో నటించాలని ఉంది?" అనే ప్రశ్నకి ఒక్కొక్కరు ఒక్కోరకంగా సమాధానం చెప్పారు. మీనాక్షి చౌదరి తనకు టాలీవుడ్లో అందరు హీరోలతో చేయాలని ఉందని, ముఖ్యంగా ప్రభాస్ తో నటించాలని ఉందంటూ సమాధానం చెప్పింది. ఐశ్వర్య రాజేష్ ఎన్టీఆర్ తో, అనిల్ రావిపూడి చిరంజీవి తో, బీమ్స్ సిసిరోలియో అందరితోనూ వర్క్ చేయాలని ఉందంటూ చెప్పుకొచ్చారు. అయితే ఆ తర్వాత మిస్సయిన సినిమాల గురించి చిట్ చాట్ సాగింది.

అందులో భాగంగా అనిల్ రావిపూడి ఎన్టీఆర్, అల్లు అర్జున్ లతో సినిమాలు మిస్ అయ్యానని చెప్పుకొచ్చారు. బీమ్స్ సిసిరోలియో అనిల్ రావిపూడితో పటాస్ మూవీ మిస్ అయిందని అన్నారు. ఇక ఐశ్వర్య రాజేష్ గత ఏడాది తను నాలుగు బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ప్రాజెక్ట్ లను వదులుకున్నానని, దానికి కారణం కూడా తానేనని కామెంట్స్ చేసింది. మీనాక్షి చౌదరి పేర్లు చెప్పలేదు కానీ ప్రాజెక్టులు మిస్సయ్యానని ఒప్పుకుంది.

Also Read: నేను ఒక్కడినే వస్తా.. నువ్వు పంచదార పక్కన పెట్టిరా.. అన్నయ్య విష్ణుకు మంచు మనోజ్ సవాల్

విజయ్ తో అనిల్ రావిపూడి సినిమా
వేరే ఇండస్ట్రీలో హీరోలతో తనకు విజయ్ తో వర్క్ చేయాలని ఉందని అనిల్ రావిపూడి అన్నారు. రీసెంట్ గా 'సంక్రాంతికి వస్తున్నాం' మూవీ ఈవెంట్లో విజయ్ చివరి సినిమాకి దర్శకత్వం వహించే ఛాన్స్ ని అనిల్ రావిపూడి వదులుకున్నాడు అని వీటివీ గణేష్ బయట పెట్టిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అనిల్ రావిపూడి మళ్లీ విజయ్ తో కలిసి వర్క్ చేయాలని ఉందని చెప్పడం ఆసక్తికరంగా మారింది. ఇక ఈ చిట్ చాట్ లో ఐశ్వర్య రాజేష్ మాట్లాడుతూ అనిల్ రావిపూడిని మణిరత్నంతో పోల్చింది. ఈ చిట్ చాట్ మొత్తం ఫన్నీగా, సరదాగా సాగింది.

Read Also : Ram Charan: ఇదీ రామ్ చరణ్ గోల్డెన్ హార్ట్... అభిమాని భార్యకు 17 రోజుల పాటు హాస్పిటల్‌లో వీఐపీ ట్రీట్మెంట్