Venkatesh's Sankranthiki Vasthunnam OTT Release On Zee5: టాలీవుడ్ టాప్ హీరో విక్టరీ వెంకటేశ్ (Venkatesh), స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబోలో వచ్చిన 'సంక్రాంతికి వస్తున్నాం' (Sankranthiki Vasthunnam) ఈ సంక్రాంతికి రిలీజై బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను జీ5 సొంతం చేసుకోగా.. థియేట్రికల్ రన్ తర్వాత ఓటీటీలోకి వస్తుందని అంతా భావించినా ముందుగా జీ తెలుగులో ప్రీమియర్ చేయనున్నట్లు వెల్లడించింది. ఓటీటీ రిలీజ్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తుండగా.. తాజాగా ఓటీటీ స్ట్రీమింగ్ తేదీని సైతం జీ5 అధికారికంగా వెల్లడించింది. మార్చి 1న సాయంత్రం అటు జీతెలుగులోనూ ఇటు జీ5 ఓటీటీలోనూ ఒకేసారి అందుబాటులోకి రానున్నట్లు తెలిపింది. దీంతో ఓటీటీ ఆడియన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు.

Also Read: ఈ కాంబో కుకింగ్ షోలో వర్కౌట్ అవుతుందంటారా? - సుమక్క కుకింగ్ షోలో సురేఖవాణి కూతురు సుప్రీత, కమెడియన్ యాదమ్మరాజు