Sanatan Dharma Row: తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ కు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. గతంలో సనాతన ధర్మంపై ఆయన చేసిన వ్యాఖ్యలు దేశ వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. దీంతో పలు హిందూ సంఘాలు, హిందువులు ఆయనపై విరుచుకుపడ్డారు. ఇదే సమయంలో ఆయనపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలంటూ మూడు రిట్ పిటిషన్స్ కూడా దాఖలయ్యాయి. తాజాగా ఈ పిటిషన్లను విచారించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 32 కింద ప్రశ్నించిన ధర్మాసనం, ఈ పిటిషన్లను తోసిపుచ్చింది.

సనాతన ధర్మంపై స్టాలిన్ కామెంట్స్

2023 సెప్టెంబరులో చెన్నైలో జరిగిన ఒక కార్యక్రమంలో అప్పటి క్రీడలు, యువజన వ్యవహారాల మంత్రిగా ఉన్న ఉదయనిధి స్టాలిన్, "సనాతన ధర్మం సామాజిక న్యాయం, సమానత్వానికి విరుద్ధం, మలేరియా, డెంగ్యూ వంటి సనాతన ధర్మాన్ని నిర్మూలించాలని అన్నారు. ఈ వ్యాఖ్యలు దేశ వ్యాప్తంగా తీవ్ర దుమారం రేపాయి. ఉదయనిధి స్టాలిన్‌పై, డీఎంకే పార్టీపై బీజేపీ సహా చాలా పార్టీల నేతలు, హిందూ సంఘాలు తీవ్ర విమర్శలు చేశాయి. ఈ కామెంట్స్ పై దేశ వ్యాప్తంగా కొన్ని పోలీస్ స్టేషన్లలోనూ కేసులు నమోదయ్యాయి. 2023లోనే ఈ వ్యాఖ్యలపై ఉదయనిధి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. ఇక నుంచి ఇలాంటి కామెంట్స్ చేయకూడదని షరతులు విధించింది.

మరోపక్క సనాతన ధర్మంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని, కోట్లాది మంది హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయని ఆరోపిస్తూ స్టాలిన్ పై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని బి.జగన్నాథ్, వినీత్ జిందాల్, సనాతన్ సురక్షా పరిషత్ వేర్వేరుగాసుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ లు దాఖలు చేశారు. స్టాలిన్ కామెంట్స్ పూర్తిగా రాజ్యాంగ విరుద్దమైనవని, ఇందుకు మద్దతు తెలిపిన డీఎంకే ఎంపీ ఏ.రాజాపైనా తగిన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా పిటిషనర్లు కోరారు. అయితే ఈ పిటిషన్లను విచారించేందుకే నేడు సుప్రీం నిరాకరించింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 32 ప్రకారం ఈ రిట్ పిటిషన్లను విచారణకు స్వీకరించడానికి జస్టిస్ బేలా ఎం త్రివేది, జస్టిస్ ప్రసన్న బి వరాలేతో కూడిన ద్విసభ్య ధర్మాసనం తోసిపుచ్చింది.

Supreme Court refuses to entertain petitions seeking criminal action against Tamil Nadu Deputy Chief Minister Udhayanidhi Stalin for his controversial “eradicate Sanatan Dharma" remark in September 2023.

Stalin is already facing multiple FIRs registered against him for his… pic.twitter.com/ItJPOPzXkV

— ANI (@ANI) January 27, 2025

ఇకపోతే ఇదే విషయంపై దేశంలోని పలు ప్రాంతాల్లో తనపై దాఖలైన వివిధ ఎఫ్‌ఐఆర్‌లు, ఫిర్యాదులను ఏకీకృతం చేసేలా ఆదేశాలివ్వాలని కోరుతూ స్టాలిన్ సుప్రీంకోర్టులో పిటిషన్ ఫైల్ చేశారు. ఈ పిటిషన్‌ను పరిశీలించడానికి అంగీకరించిన సుప్రీం.. జస్టిస్ సంజీవ్ ఖన్నా (ప్రస్తుతం సీజేఐ) నేతృత్వంలోని ధర్మాసనం ఈ విషయంలో వివిధ రాష్ట్ర ప్రభుత్వాల నుండి ప్రతిస్పందనలను కోరింది. స్టాలిన్ కు ప్రాణహాని ఉందని, వివిధ ప్రాంతాల్లోని వివిధ పోలీస్ స్టేషన్లు, కోర్టుల ముందు హాజరు కావడానికి చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయని పిటిషన్ వాదించింది.

Also Read : Mona Lisa: పది రోజుల్లో పది కోట్లు సంపాదించిన మోసాలిసా - ఆమె ఏమంటున్నారో తెలుసా?