Sai Durgha Tej's Sambarala Yetigattu Release Date Locked : సుప్రీం హీరో సాయి దుర్గా తేజ్ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ 'సంబరాల ఏటిగట్టు' నుంచి ఎట్టకేలకు అప్డేట్ వచ్చింది. పాన్ ఇండియా స్థాయిలో ఈ మూవీని రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తుండగా... సంక్రాంతి బరిలో నిలవనున్నట్లు మేకర్స్ రిలీజ్ చేశారు.

రిలీజ్ ఎప్పుడంటే?

ఈ మూవీని పాన్ ఇండియా స్థాయిలో జనవరి 12న రిలీజ్ చేయనున్నట్లు అనౌన్స్ చేశారు. ఈ మేరకు స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేయగా... చేతిలో కత్తి ఒంటినిండా రక్తంతో మాస్ రగ్గడ్ లుక్‌లో కనిపించారు సాయి తేజ్. ఇప్పటికే రిలీజ్ చేసిన పోస్టర్స్, గ్లింప్స్ భారీ హైప్ క్రియేట్ చేస్తున్నాయి. 'అసుర ఆగమన' అంటూ హింట్ ఇచ్చారు మేకర్స్.

భూమి కోసం తన వారి కోసం పోరాడే ఓ యోధుడి కథను చూపించనున్నట్లు తెలుస్తోంది. పీరియాడికల్ బ్యాక్ డ్రాప్, మైథలాజికల్ టచ్, మాస్, యాక్షన్ అంశాలు అన్నింటినీ టచ్ చేస్తూ ప్రాజెక్టును రూపొందించారు. షూటింగ్ పూర్తి కాగా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్‌పై ఫోకస్ చేస్తున్నారు.

Also Read : Bigg Boss 10 Promo : ఈసారి ఆటే సవాల్ - దశావతారం గేమ్ స్ట్రాటజీస్... బిగ్ బాస్ సీజన్ 10 ప్రోమో వచ్చేసింది