సమంత రూత్ ప్రభు (Samantha Ruth Prabhu) జీవితంలో 2026 ఎప్పటికీ ఎంతో మధుర జ్ఞాపకం. వెరీ వెరీ మెమరబుల్ అని చెప్పాలి. వృత్తిపరంగా 'మా ఇంటి బంగారం'తో భారీ బాక్స్ ఆఫీస్ విజయాన్ని అందుకున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఆ సినిమా 100 కోట్ల రూపాయల వసూళ్లను సాధించింది. విమర్శకులతో పాటు ప్రేక్షకుల ప్రశంసలు కూడా అందుకుంది. వ్యక్తిగత జీవితంలోకి వస్తే... ప్రెగ్నెంట్ అయ్యారు. త్వరలో తల్లి కాబోతున్నారు. ప్రస్తుతం ప్రెగ్నెన్సీ ఫీలింగ్ ఎంజాయ్ చేస్తున్నారు. త్వరలో మదర్‌హుడ్‌లోకి అడుగు పెట్టనున్నారు. ఓ బాలీవుడ్ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రెగ్నెన్సీ గురించి సమంత ఓపెన్ అయ్యారు.

ఈ క్షణాల కోసం ఎంతో ఎదురు చూశా!
Samantha Ruth Prabhu About Her Pregnancy: ప్రెగ్నెంట్ కావడం గురించి సమంత మనసు విప్పి మాట్లాడారు. 'మా ఇంటి బంగారం' విజయంతో పాటు మదర్ అవుతున్నానేది ఎంతో సంతోషాన్ని కలిగించిందని ఆమె చెప్పారు. ముఖ్యంగా గర్భం దాల్చడం గురించి మాట్లాడుతూ... "నేను ఈ క్షణం కోసం చాలా కాలంగా ఎదురు చూస్తున్నాను. తల్లి కావాలనే ఎప్పట్నుంచో కోరుకుంటున్నా. అది నా చిరకాల కోరిక. తల్లిగా చేయబోయే ప్రయాణానికి నా శక్తినంతటినీ ధారపోస్తా'' అని భావోద్వేగానికి లోనయ్యారు.

Also Read: Hema Buys Mercedes Benz GLS 450D - హేమ గ్యారేజ్‌లో బెంజ్ జీఎల్ఎస్ 450D... కారు ఫీచర్స్ తెలుసా? రేటు కోటిన్నర కంటే ఎక్కువ

మాతృత్వం అనేది కేవలం మహిళలలో కలిగే శారీరక మార్పు మాత్రమే కాదని... అది తన ఆలోచనా విధానాన్ని పూర్తిగా మార్చిందని, తనకు ఒక కొత్త రకమైన బలాన్ని ఇవ్వడంతో పాటు జీవితం పట్ల స్పష్టమైన అవగాహనను, ఉద్దేశాన్ని కలిగించిందని సమంత రూత్ ప్రభు తెలిపారు.

వ్యక్తిగానూ ఎంతో పరిణితి చెందాను - సమంత
దర్శకుడు రాజ్ నిడిమోరు (Raj Nidimoru)తో వివాహమైన తర్వాత జీవితం, కొత్తగా మొదలైన అధ్యాయం గురించి సమంత మాట్లాడుతూ... ''జీవితంలో ఎదురయ్యే ప్రతి మార్పును స్వీకరిస్తాను. ఇప్పుడు నేను నటిగా మాత్రమే కాదు... వ్యక్తిగానూ పరిణతి చెందాను. ప్రేక్షకులు నేను సాధించిన విజయాలు, అవార్డులు ద్వారా కాకుండా... ప్రయోగాలు చేయడానికి వెనకాడని ధైర్యవంతురాలిగా నన్ను గుర్తు పెట్టుకోవాలని ఆశిస్తున్నా'' అని చెప్పారు.

Also Read: Allu Arjun Basil Joseph Movie - బసిల్ జోసెఫ్‌తో అల్లు అర్జున్ సినిమా కన్ఫర్మ్... హింట్ ఇచ్చిన దర్శకుడు

Samantha Ruth Prabhu Upcoming Projects After Maa Inti Bangaram: డిసెంబర్ 2026లో సమంతకు డెలివరీ కానుందని తెలిసింది. 'మా ఇంటి బంగారం' విజయం తర్వాత చిత్రీకరణలకు దూరంగా ఉండబోతున్నట్లు, ప్రెగ్నెన్సీ లీవ్ తీసుకోబోతున్నట్లు సమంత తెలిపారు. బిడ్డకు జన్మ ఇచ్చిన తర్వాత 'మా ఇంటి బంగారం 2' చేయనున్నారు. మధ్యలో సోనీలివ్ ఓటీటీ కోసం ఓ టాక్ షో హోస్ట్ చేయనున్నారు.

Also Read: Jr NTR Political Buzz - ఎన్టీఆర్‌కు సంబంధం లేదు - 'ఊరూ వాడ' వెనుక ఫుల్ కహానీ