Saddula Bathukamma Wishes 2026: సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు! ఈ పాటలతో మీ ఆత్మీయులకు పంపండి!

2 weeks ago 2
ARTICLE AD

Happy Bathukamma 2026 Wishes: అక్టోబర్ 11 పితృ అమావాస్య  రోజు ఎంగిలిపూల బతుకమ్మతో ప్రారంభమైన సంబురాలు అక్టోబర్ 18 దుర్గాష్టమి రోజు సద్దుల బతుకమ్మతో ముగుస్తాయి. తొమ్మిది రోజుల పాటూ రోజుకో బతుకమ్మను పూజించి రోజుకో నైవేద్యాన్ని సమర్పిస్తారు. ఊరూవాడా ఆటపాటలతో సందడిగా ఉంటుంది.

కరవుకాటకాలు,అంటు వ్యాధుల నుంచి రక్షించమ్మా అంటూ గౌరమ్మను పూజిస్తారు. ప్రకృతిలో దొరికే రంగురంగుల పూలను తీసుకొచ్చి శివలింగం ఆకారంలో పేర్చి..పైన పసుపుతో గౌరమ్మను ఉంచి బతుకునివ్వమ్మా అని ఆడిపాడతారు. ఈ వేడుకలు కేవలం తెలంగాణలోనే కాదు ఇతర దేశాల్లో స్థిరపడిన తెలంగాణవాసులు కూడా తప్పనిసరిగా జరుపుకుంటారు.

ఈ ఏడాది అక్టోబర్ 18న సద్దుల బతుకమ్మ తో వేడుకలు ముగుస్తాయి. ఈ సందర్భంగా బతుకమ్మ పాటల లిరిక్స్ తో మీ బంధుమిత్రులకు శుభాకాంక్షలు తెలియజేయండి

తెలంగాణ ఆడబిడ్డలందరకీ సద్దుల బతుకమ్మ  శుభాకాంక్షలు

బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో
బంగారు బతుకమ్మ ఉయ్యాలో
సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు

తంగేడు పూల సందమామ
మల్లెన్నడు వస్తావు సందమామ..
గునుగు పూల సందమామ
బతుకమ్మ పోతుంది సందమామ..
మీకు మీ కుటుంబ సభ్యులకు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు

ఏమేమి పువ్వోప్పునే గౌరమ్మ ఏమేమి కాయప్పునే
ఉమ్మెత్త పువ్వొప్పునే గౌరమ్మ ఉమ్మెత్త కాయప్పునే
సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు

రామరామ నంది ఉయ్యాలో రాగమేత్తరాదు ఉయ్యాలో
నెత్తిమీద సూర్యుడా ఉయ్యాలో నేలవన్నేకాడ ఉయ్యాలో
తెలంగాణ ఆటపాటల పండుగ బతుకమ్మ శుభాకాంక్షలు

కుంకుమలో పుట్టే గౌరమ్మ కుంకుమలో పెరిగే గౌరమ్మ
పసుపులో పుట్టే గౌరమ్మ పసుపులో పెరిగే గౌరమ్మ
మీ అందరికీ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు

చిత్తూ చిత్తుల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ
బంగారు బొమ్మ దొరికేనమ్మో ఈ వాడలోన
బతుకమ్మ మీకుటుంబంలో సంతోషం నింపాలి
సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు

బంగారు గుండ్లుపేరు గౌరమ్మ
బండ్లతో బయలెల్దురూ గౌరమ్మ
బండ్లతో బయలెల్దురూ గౌరమ్మ
బండ్లతో బయలెల్దురూ గౌరమ్మ
తెలంగాణ ఆడబిడ్డలకు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు

బతుకమ్మ నిమజ్జనం వెనుకున్న ఆంతర్యం ఇదే!

చినుకు చినుకు వాన ఉయ్యాలో  చిత్తడివాన ఉయ్యాల
పోదాము చిత్తారి ఉయ్యాలో మూడు బాటల కాడికి ఉయ్యాలో
బాలలు బతుకమ్మ ఉయ్యాలో పండుగా నడిగిరి ఉయ్యాలో
మీకు మీ కుటుంబ సభ్యులకు సద్దుల బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు

తెలంగాణ  ఆడబిడ్డల ఆత్మగౌరవాన్ని చూపే పూల వేడుక
బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు

అవధుల్లేని ఆనందంతో జరుపుకునే సద్దుల బతుకమ్మ
మీ ఇంట ఆనందాన్ని నింపాలి
సద్దుల బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు

కొత్తఅందాన్ని తీసుకొచ్చే పూల పండుగ
బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు

తంగేడు, గుమ్మడి, గునుగుపూల రంగులతో మీ జీవితం వర్ణశోభితంగా ఉండాలి
మీకు మీ కుటుంబ సభ్యులకు సద్దుల బతుకమ్మ  శుభాకాంక్షలు

Navratri vs Durga Puja: నవరాత్రి 9 రోజులు, దుర్గా పూజ 5 రోజులు ఎందుకు? ఈ రెండింటి మధ్య వ్యత్యాసం ఏంటి?

తెలంగాణ సంస్కృతికి, ఆడబిడ్డల ఆత్మగౌరవానికి నిలువెత్తు నిదర్శనమైన ఈ పూల పండుగ మీ కుటుంబంలో సిరిసంపదలు నింపాలి
సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు

అందర్నీ ఒకే వేదికపైకి తీసుకొచ్చే బతుకమ్మ పండుగ
మీ కుటుంబంలో సంతోషాన్ని నింపాలని కోరుకుంటూ
సద్దుల బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు

రంగు పూల జాతర..ఆడబిడ్డల సంబురం
ఆ గౌరమ్మ మీ ఇంట నింపాలి సంతోషం
సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు

పూల పరిమళాలు మీ జీవితంలో సంతోషాన్ని నింపాలి
గౌరమ్మ ఆశీస్సులు మీపై, మీ కుటుంబ సభ్యులపై ఎల్లప్పుడూ ఉండాలి
సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు

Dasara 2026: పెళ్లికాని అమ్మాయిలు దుర్గాదేవికి సింధూరం సమర్పించవచ్చా? నియమాలు తెలుసుకోండి

Read Entire Article