RS Praveen Kumar: తప్పులు చేసి కులాన్ని అడ్డం పెట్టుకోవచ్చా ?

9 months ago 6
ARTICLE AD

PV Suneel kumar And RS Praveen Kumar:
కోడు గుడ్డు మీద ఈకలు పీకొద్దు..!
ఏంటిప్పుడు షడన్ గా దీని గురించి ఎందుకు  అనుకుంటున్నారా.. ?
ఎందుకంటే నిన్నటి నుంచి తెలుగు రాష్ట్రాల్లో ఇదొక ట్రెండింగ్. వాస్తవానికి ఇదొక సెన్సిటివ్, పర్సనల్ ఇష్యూ అని భావించాని దీని గురించి ఇష్యూ చేయొద్దు అనుకున్నాను. అందుకే ఒక రోజు ఆలస్యం కూడా అయింది. అయితే దీని మీద రకరకాల వ్యాఖ్యానాలు, చర్చలు జరుగుతున్నందున డిస్కషన్ చేయక తప్పడం లేదు.

మళ్లీ కోడుగుడ్డు దగ్గరకు వద్దాం.. పాత తెలుగు నుడికారం గురించి చెప్పడం కాదు.. ఎక్కడిది ఈ మాట అంటే మాజీ ఐపీఎస్ అధికారి, ప్రస్తుత తెలంగాణ రాజకీయ నేత, బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, ఆంధ్రా డీజీ పీవీ సునీల్ కుమార్ కుమార్ సస్పెన్షన్ విషయంలో చేసిన వ్యాఖ్యలివి. సునీల్ కుమార్ కు మద్దతుగా ఆయన మాట్లాడటం ఇదే మొదటి సారి కాదు. ఇంతకు ముందు కూడా సపోర్ట్ చేశారు. ఒకప్పటి తన సీనియర్ కు మద్దతుగా ప్రవీణ్ కుమార్ మాట్లాడటం తప్పు కాదు. ఆయన పాయింట్ ఆయన చెప్పొచ్చు. అయితే... ఆర్ఎస్పీ వ్యాఖ్యలు ఇంకో చర్చకు దారితీశాయి. తీవ్ర ఆరోపణలు ఉన్న వ్యక్తికి సపోర్ట్ చేయడం, ఐపీఎస్ సర్వీసు రూల్స్ ను అతిక్రమించినా సపోర్ట్ చేయడంతో పాటు.. పక్క రాష్ట్ర వ్యవహారాల్లో వేరే పార్టీ రాజకీయ నాయకులు జోక్యం అవసరమా అనే వరకూ వ్యాఖ్యానాలు, దళిత్ విక్టిమ్ కార్డు, కులాన్ని ఇమ్యూనిటీగా వాడుకుంటున్నారనే వరకూ వ్యాఖ్యానాలు వెళ్లాయి.  ( ఎందుకంటే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కేవలం మాజీ ఐపీఎస్ కాదు.. బీఆర్ఎస్ లో ముఖ్యనేత )  జస్ట్ జరుగుతున్న విషయాన్ని అనలైజ్ చేద్దాం.. ఆయన వ్యాఖ్యలు కరెక్టో కాదో మీరే కామెంట్లో చెప్పండి

సీనియర్ ఐపీఎస్ అధికారి, సీఐడీ మాజీ చీఫ్ సునీల్ కుమార్ ను కూటమి ప్రభుత్వం సస్పెండ్ చేయడం మొత్తం వివాదానికి కారణం. అయితే సునీల్ కుమార్ పై ఈ ప్రభుత్వం కోపం ఇప్పటిది కాదు. కిందటి జగన్ ప్రభుత్వంలో సునీల్ కుమార్ తన పరిధి దాటి వ్యవహరించారని టీడీపీ నేతలు అప్పట్లో బహిరంగంగా ఆరోపించారు. ఆయన నేతృత్వంలోని సీఐడీ దాదాపుగా జగన్ కు ప్రైవేట్ ఆర్మీ లాగా మారిపోయిందని అనేక సార్లు అనేక మంది నేతలు ఆరోపించారు. అప్పట్లో జరిగిన అరెస్టులు, ఎంపీ రఘురామకృష్ణ రాజును కస్టోడియల్ టార్చర్ చేశారనే ఆరోపణలతో ఆయన వివాదాస్పదుడిగా ముద్ర పడ్డారు.  ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక విషయాలపై ఐపీఎస్ సునీల్ కుమార్ కు ప్రభుత్వం మెమోలు ఇచ్చింది. అప్పుడు కూడా ఆర్ఎస్పీ సునీల్ కుమార్ కు మద్దతిచ్చారు. ఇక ఇప్పుడు సస్పెన్షన్ కు దారి తీసిన పరిస్థితి ఏంటంటే అయితే 2019 -24మధ్య సునీల్ కుమార్ ఆరుసార్లు విదేశీ పర్యటన చేశారు. ఇందులో మూడుసార్లు ప్రభుత్వ అనుమతి తీసుకున్నారు. కానీ చెప్పిన చోటకు కాకుండా వేరే దేశానికి వెళ్లారు. జార్జియా వెళుతున్నా అని అబుదాబికి, అమెరికా వెళుతున్నా అని యు.కె కు వెళ్లారు. మరో మూడుసార్లు ఎలాంటి అనుమతి తీసుకోకుండానే UAE, U.S, స్వీడన్ దేశాలకు వెళ్లొచ్చారు. ఇదే కారణంతో ఆయనను సస్పెండ్ చేశారు. ఇది కాకుండా వేరే ఆరోపణలు, కేసులు కూడా ఉన్నాయి.

అయితే RSP ఈ సస్పెన్షన్ వచ్చిన వెంటనే ఓ పెద్ద ట్వీట్ చేశారు.దీనిపైనే టీడీపీ శ్రేణులు భగ్గుమంటున్నాయి. ప్రవీణ్ కుమార్ ఓ రాజకీయ నేత కాబట్టి దీనిని రాజకీయ ఆరోపణగానూ.. టీడీపీ వాళ్ల రెస్పాన్స్  ఓ రిటార్ట్ లానూ చూసుకున్నా.. ప్రవీణ్ కుమార్ మాట్లాడిన వాటిలో చాలా విషయాలున్నాయి వాటిపైన కూడా చర్చ జరుగుతోంది. పీవీ సునీల్ సస్పెన్షన్ ను ఆయన ఖండించారు. అంతవరకూ ఆయన అభిప్రాయం ఓకే. ఆ తర్వాత విదేశాలకు వెళ్లారని సస్పెండ్ చేయడం కోడిగుడ్డు మీద ఈకలు పీకడమే.. Utter Nonsense  అంటూ కూడా రాశారు. ఇదే పాయింట్ ఆఫ్ డిస్కషన్. ఆలిండియా సర్వీసు నిబంధనల ప్రకారం.. AIS అధికారులు విదేశీ పర్యటనలు చేస్తే కచ్చితంగా ఆ విషయాన్ని ప్రభుత్వానికి చెప్పాలి. ఇది జూనియర్లు కూడా పాటిస్తారు. మరి  అంతటి సీనియర్లు అయిన సునీల్, ప్రవీణ్ కుమార్ కు ఆ విషయం తెలీకుండా ఉండదు. ఒకవేళ తెలిసినా సునీల్ కుమార్ ఒక్కరే కాదు.. దాదాపు చాలా మంది ఐఏఎస్, ఐపీఎస్ లు ఇలా చేస్తున్నారు ఇది పట్టించుకోవలసిన విషయం కాదు అన్నది RSP ఉద్దేశ్యం ఏమో..
అయితే ఇక్కడ ఇంకో ప్రశ్న ఉంది. ఆయన చెప్పకుండా విదేశాలకు వెళ్లినా కూడా జస్ట్ వయలేషన్ అనుకోవచ్చు. మరి ఒక దేశం అని చెప్పి మరో దేశం పోవలసిన అవసరం ఏమొచ్చింది. అలా మూడుసార్లు అబద్దాలు ఎందుకు చెప్పారు...? ప్రభుత్వ జీవో ప్రకారం అయితే అంతే ఉంది. అది కాదు అంటే సునీల్ కుమార్ కానీ... లేదా ఆయన్ను సపోర్టు చేస్తున్న ప్రవీణ్ కుమార్ కానీ సమాధానం చెప్పాలి. వాళ్లింకా చెప్పలేదు.

ఇక రెండో విషయం డిప్లమోటిక్ పాస్ పోర్ట్. జనరల్ గా అది కేంద్రమంత్రులు, ముఖ్యమంత్రులు, ఇతర రాజ్యాంగ హోదాల్లో ఉన్న వారికి ఉంటుంది. అది లేదు అని చెప్పడం వెనుక ఉద్దేశ్యం కేవలం ఆక్రోశం మాత్రమేనా లేక అలా ఉండాలని కోరుకుంటున్నారా..

దావోస్ కు తండ్రీ-  కొడుకులు ప్రభుత్వ డబ్బుతో వెళ్లారు.. ఆయన సొంత డబ్బులతో వెళ్లాడు అని చెప్పడం ద్వారా ప్రవీణ్ కుమార్ దీనిని పూర్తిగా పొలిటికల్ విషయంగా మార్చారు. నిజంగా సర్వీసు రూల్స్ కు సంబంధించి తన మాజీ సీనియర్ కు సపోర్టు చేయాలనుకుంటే అక్కడికే పరిమితం అయి ఉండేది. దావోస్  అనేది అధికార పర్యటన. అంటే చంద్రబాబు- లోకేష్  అయినా రేవంత్ రెడ్డి  లేదా అంతకు ముందు కేటీఆర్, జగన్ అయినా ప్రభుత్వ నిధులతోనే కదా వెళతారు. మరి ఈ కామెంట్ కు అర్థం ఏంటి

ఎస్సీ ఎస్టీలు... విమానాలు ఎక్కొద్దా.. ? నేను మొదట్లో వీడియో చేయొద్దనుకోవడానికి కారణం ఈ పాయింటే. ఈ సెన్సిబుల్ ఇష్యూను.. స్పిన్ చేస్తుండటం. ఎంతో అనుభవం, పరిణితి, ప్రజ్ఞ ఉన్న ప్రవీణ్ కుమార్ సగటు రాజకీయ నాయకులులాగా ఇక్కడ ఈ అస్త్రాన్ని ప్రయోగించారు. ఇంతకు ముందు కూడా ఇలాగే అన్నారు. దీనిపైన టీడీపీ వాళ్లు చేస్తున్నటు వంటి కౌంటర్లు ఏంటంటే.. కిందటి ప్రభుత్వంలో దళిత డాక్టర్ ను రోడ్డుపైన అవమానించినప్పుడు.. ఓ ఎమ్మెల్సీ దళిత డ్రైవర్ ను డోర్ డెలివరీ చేసినప్పుడు... ఓ దళిత యువకుడుని పోలీసులు కొట్టి చంపారని ఆరోపణలు వచ్చినప్పుడు.. ఇంకో దళిత యువకుడిపై యూరిన్ పోసి శిరోముండనం చేసినప్పుడు ఎందుకు మాట్లాడ లేదు అని.. సామాన్య దళితుల పట్ల సానుభూతి చూపాల్సిన ఆర్ఎస్పీ తీవ్రమైన ఆరోపణలున్న ఓ సీనియర్ అధికారికి ఎందుకు వంత పాడుతున్నాడు అని వాళ్లు ప్రశ్నిస్తున్నారు. ఇవన్నీ రాజకీయ ఆరోపణలు అని పక్కన పెట్టినా.. సునీల్ కుమార్ పై ప్రభుత్వం మోపిన అభియోగానికి దళిత్ కార్డ్ కు  ఏంటి సంబంధం. ఈ విషయాన్ని ప్రస్తావించడం ద్వారా ఆయన ఓ తేనెతుట్టెను కదిపారు. ప్రవీణ్ కుమార్ చేసిన ట్వీట్ పై వస్తున్న స్పందన చూస్తుంటేనే ఆ విషయం అర్థమవుతోంది. చాలా మంది దళితులు.. దళితుడు అనే కారణంగానే ఆయనపై వివక్ష చూపారని సునీల్ కు సపోర్ట్ చేస్తుంటే.. ఎక్కువమంది.. తప్పు చేసినప్పుడు క్యాస్ట్ కార్డు వాడటం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఎలాంటి ఆరోపణలూ లేని.. కేవలం మాస్క్ అడిగిన ఓ డాక్టర్ ను ఏకంగా పిచ్చోడు అనే ముద్ర వేసినప్పుడు రాని సానుభూతి.. సీఐడీ చీఫ్ గా నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారని.. చాలా మందిని వేధించారని... నిబంధనలు అతిక్రమించారని.. ఇప్పుడు అనుమతులు లేకుండా విదేశీ పర్యటనలు చేశారని.. ఇలా అనేక ఆరోపణలు ఉన్న ఆయన పట్ల చూపడం ఏంటనే ప్రశ్న వస్తోంది. ఈ కార్డును అమాయకులు, వివక్షకు గురవుతున్నవారు, అన్యాయానికి, దోపిడికి గురైన వారి కోసం కదా వాడాల్సింది అంటున్నారు. పైగా దానిని వాడటం వల్ల తప్పు చేసిన ప్రతొక్కరూ ఆ కార్డ్ వాడుకుంటున్నారు అనే ఓ భావన కలిగేందుకు ప్రవీణ్ కుమారే ఆస్కారం ఇచ్చారు.

ఇక RSP చేసిన మరో ఆరోపణ సునీల్ కుమార్ సీనియార్టీలో రెండో స్థానంలో ఉన్నారు. డీజీపీ కావలసిన వ్యక్తి.. దానిని అడ్డుకునేందుకే ఇలా చేశారు అన్నారు. ఇందులో కూడా వాస్తవం లేదు. పీవీ సునీల్ కుమార్ 1994 బ్యాచ్ అధికారి. ఆయన కంటే ముందు 1990 నుంచి 1994 వరకూ ఇంకా 8 మంది సీనియర్లు ఉన్నారు. సీనియార్టీని పరిగణనలోకి తీసుకోకుండా ఎవరినైనా ఎంపిక చేసుకునే అవకాశం ఉంది. అది ప్రభుత్వ ఛాయిస్. కానీ మొదటి నుంచి పీవీ సునీల్ అంటే  అంతగా ఇష్టపడని ఈ ప్రభుత్వం ఆయన్ను ఎందుకు తీసుకుంటుంది. ఈ ప్రభుత్వమే ఇంకో 4ఏళ్లు ఉండే అవకాశం ఉంది. అప్పటికి ఆయన రిటైర్ కూడా అవుతారు.

ఇవన్నీ కాకుండా అసలు ఇందులో ఏదైనా రాజకీయకోణం ఉందా అన్న అనుమానం కూడా ఉంది. తెలుగుదేశం తిరిగి తెలంగాణలో యాక్టివేట్ అవుతుందనే వార్తలు వస్తున్నాయి. తెలుగుదేశాన్ని అవుట్ రైట్ గా వ్యతిరేకించే బీఆర్ఎస్ రేవంత్ ను టీడీపీతో ముడిపెట్టి, లేదా నేరుగానో ఈ మధ్యకాలంలో ఆ పార్టీ మీద ఆరోపణలు చేస్తూనే ఉంది. ఆ కోణంలో బీఆర్ఎస్ నేత ప్రవీణ్ వ్యాఖ్యలు చేశారా అన్నది కూడా చూడాలి.  కానీ తెలుగు తమ్ముళ్లు మాత్రం.. సునీల్ కుమార్ సస్పెన్షన్ రాజకీయ నిర్ణయం కాదు.. ప్రభుత్వ అంతర్గత వ్యవహారం. ఆంధ్ర ప్రభుత్వ నిర్ణయాలపై తెలంగాణ వాళ్లు ఎందుకు స్పందించాలి. ఇంతకు ముందు ఎప్పుడూ అటు వైపు నుంచి అలా మాట్లాడలేదు కదా.. అంటున్నారు.

ఇలా ఈ ఒక్క ట్వీట్ తో చాలా ప్రవీణ్ కుమార్ చాలా విషయాలు కదిలించారు.  ఆయన ట్వీట్ కింద వస్తున్న స్పందన కూడా చాలా నెగటివ్ గా ఉంటోంది. సరే అవన్నీ తెలుగుదేశం అనుకూలురు చేస్తున్నారు అనుకున్నా... చాలా మంది ప్రస్తావిస్తున్న అంశాలు మాత్రం చర్చించ తగినవే. అందుకే ఆ అంశాలను మాత్రమే ఇక్కడ ఉంచాం. .!

Read Entire Article