Sumanth Prabhas's Love Romantic Drama Romanchakam OTT Release Date Locked : టాలీవుడ్ యంగ్ హీరో సుమంత్ ప్రభాస్, అనంతిక సానిల్ కుమార్ జంటగా నటించిన రీసెంట్ లవ్ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ రోమాంచకం (Romanchakam). సెప్టెంబర్ 3న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మిక్స్‌డ్ టాక్ సొంతం చేసుకుంది. దాదాపు నెల రోజుల్లోపే ఓటీటీలోకి వచ్చేందుకు రెడీ అవుతోంది.

ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?

ఈ మూవీ డిజిటల్ రైట్స్ ఇంటర్నేషనల్ ఓటీటీ నెట్ ఫ్లిక్స్ (Netflix) సొంతం చేసుకోగా అక్టోబర్ 1 (గురువారం) నుంచి స్ట్రీమింగ్ కానుంది. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం, హింధీ భాషల్లో అందుబాటులోకి రానుంది. ఈ మేరకు అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చేసింది. ఈ మూవీకి వేణుగోపాల్ రెడ్డి దర్శకత్వం వహించగా... స్టార్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా సమర్పణలో నిర్మించారు. తన సొంత నిర్మాణ సంస్థ భద్రకాళి పిక్చర్స్ బ్యానర్‌పై ప్రణయ్ రెడ్డి వంగా రూపొందించారు.

సుమంత్ ప్రభాస్, అనంతికలతో పాటు ఉపేంద్ర లిమాయే, వెంకటేశ్ కాకుమాను, నరేంద్ర రవి, మహి సాయి సోహాన్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. వాసుకి వైభవ్ మ్యూజిక్ అందించారు.

Also Read : Crime Thriller OTT : 18 ఏళ్ల తర్వాత హిట్ జోడీ - 'కొత్త బంగారు లోకం' బాలు, స్వప్న క్రైమ్ థ్రిల్లర్ సిరీస్... ఎందులో స్ట్రీమింగ్ అంటే?