Mallika Sherawat Cars: బాలీవుడ్‌లో హీరోలు ఖరీదైన కార్లు కొనడం మామూలే. కానీ, హీరోయిన్‌ దగ్గర స్టార్‌ హీరోల దగ్గరే లేని స్థాయి కార్ల కలెక్షన్‌ ఉంటే?. అచ్చంగా అలాంటి అరుదైన ఉదాహరణే మాజీ హీరోయిన్‌ మల్లికా శెరావత్‌. ప్రస్తుతం అమెరికాలోని లాస్‌ ఏంజిల్స్‌లో నివసిస్తున్న ఆమె, సోషల్‌ మీడియాలో తరచూ తన ఖరీదైన కార్లతో ఫోటోలు, వీడియోలు షేర్‌ చేస్తుంటుంది. ఆమె గ్యారేజ్‌లో ఉన్న కార్ల జాబితా చూస్తే... స్పీడ్‌, లగ్జరీకి ఆమె ఎంత పెద్ద ఫ్యాన్‌ అనేది అర్థమవుతుంది.

Lamborghini Aventador SV Roadster

మల్లికా శెరావత్‌ కార్లలో అత్యంత ఐకానిక్‌ మోడల్‌ Lamborghini Aventador SV Roadster. ఇది ఇప్పటివరకు తయారైన Aventadorల్లో అత్యంత పవర్‌ఫుల్‌, అగ్రెసివ్‌ మోడల్‌గా పేరు తెచ్చుకుంది.
ఈ సూపర్‌కార్‌లో 6.5 లీటర్‌ V12 పెట్రోల్‌ ఇంజిన్‌ ఉంది. ఇది 730hp శక్తి, 690Nm టార్క్‌ ఉత్పత్తి చేస్తుంది. 7-స్పీడ్‌ సెమీ ఆటోమేటిక్‌ గేర్‌బాక్స్‌, ఆల్‌ వీల్‌ డ్రైవ్‌ సిస్టమ్‌ ఇందులో ప్రత్యేక ఆకర్షణ.
0 నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని కేవలం 2.8 సెకన్లలో అందుకుంటుంది. గరిష్ట వేగం గంటకు 350 కిలోమీటర్లు. ప్రపంచవ్యాప్తంగా కేవలం 350 యూనిట్లు మాత్రమే తయారయ్యాయి. ఈ కారును ఆమె విదేశాల్లో సొంతం చేసుకుంది.

Ferrari 812 Superfast

మల్లిక గ్యారేజ్‌లో మరో అద్భుతమైన కారు Ferrari 812 Superfast. ఇది 2017 నుంచి 2024 మధ్య తయారైంది.
ఈ కారులోని 6.5 లీటర్‌ నేచురల్‌ ఆస్పిరేటెడ్‌ V12 ఇంజిన్‌ అప్పట్లో ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన NA ఇంజిన్‌గా గుర్తింపు పొందింది. ఇది 800hp, 718Nm టార్క్‌ ఇస్తుంది.
0 నుంచి 100 కిలోమీటర్ల వేగం 2.9 సెకన్లు, గరిష్ట వేగం గంటకు 340 కిలోమీటర్లు. రియర్‌ వీల్‌ స్టీరింగ్‌, అడ్వాన్స్‌డ్‌ ట్రాక్షన్‌ కంట్రోల్‌ వంటి టెక్నాలజీ ఈ కారును మరింత ప్రత్యేకంగా నిలబెడుతుంది.

McLaren 720S

మల్లిక సోషల్‌ మీడియా హ్యాండిల్స్‌లో ఎక్కువగా కనిపించిన మరో కారు McLaren 720S. ఆరెంజ్‌ కలర్‌లో ఉన్న ఈ సూపర్‌కార్‌ ఆమెకు బాగా ఫేవరెట్‌ అని ఫోటోలు చూస్తే అర్థమవుతుంది.
ఈ కారులో 4.0 లీటర్‌ ట్విన్‌ టర్బో V8 ఇంజిన్‌ ఉంది. ఇది 720hp, 770Nm టార్క్‌ ఉత్పత్తి చేస్తుంది.
0 నుంచి 100 కిలోమీటర్ల వేగం 2.8 సెకన్లు, గరిష్ట వేగం గంటకు 341 కిలోమీటర్లు. కార్బన్‌ ఫైబర్‌ బాడీ, స్పోర్ట్‌, ట్రాక్‌ మోడ్‌లు దీని బలాలు.

Rolls Royce Dawn

స్పీడ్‌ మాత్రమే కాదు, లగ్జరీ కూడా మల్లిక స్టైల్‌. ఆమె Rolls Royce Dawnతో కూడా ఫోటోలు షేర్‌ చేసింది.
ఈ కన్వర్టబుల్‌ కారులో 6.6 లీటర్‌ ట్విన్‌ టర్బో V12 ఇంజిన్‌ ఉంది. ఇది 556hp, 820Nm టార్క్‌ ఇస్తుంది. కంప్లీట్‌ లగ్జరీకి ఇది సింబల్‌గా చెప్పొచ్చు.

ఇతర కార్లు

ఇవే కాకుండా, ఆమెను Ferrari 458 Italia, Lamborghini Huracan వంటి కార్లతో కూడా చూశారు. ఇవి ఆమె సొంతమా కాదా అన్నది స్పష్టంగా తెలియకపోయినా, ఒక విషయం మాత్రం క్లియర్‌... స్పీడ్‌, లగ్జరీ అంటే మల్లికా శెరావత్‌కు ప్రత్యేకమైన క్రేజ్‌ ఉంది!.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.