Ind Vs Aus 5th Test Live Updtates: ఆస్ట్రేలియాతో జరుగుతున్న ఐదోటెస్టు ఆసక్తికరంగా సాగుతోంది. శనివారం రెండో రోజు 15 వికెట్లు పడంతో ఒక్కసారిగా ఉత్కంఠ నెలకొంది. రెండో ఇన్నింగ్స్ మొదలు పెట్టిన భారత్ ఆట ముగిసే సమయానికి 32 ఓవర్లలో 6 వికెట్లకు 141 పరుగులు చేసింది. రిషభ్ పంత్ స్టన్నింగ్ ఫిఫ్టీ (33 బంతుల్లో 61, 6 ఫోర్లు, 4 సిక్సర్లు)తో ఆకట్టుకున్నాడు. నిజానికి తన బ్యాటింగ్ శైలితో మ్యాచ్ స్వరూపాన్ని మార్చేశాడు. టీ20 తరహాలో ఎదురుదాడికి దిగాడు. దీంతో రెండో ఇన్నింగ్స్ లో కీలకమైన ఆధిక్యాన్ని భారత్ కొనసాగించింది.ఇక ఆసీస్ బౌలర్లలో స్కాట్ బోలాండ్ నాలుగు వికెట్లతో అద్భుతంగా రాణించాడు. భారత టాపార్డర్ వెన్ను విరిచాడు. మిగతా బౌలర్లలో కమిన్స్ , వెబ్ స్టర్ కు ఒక వికెట్ దక్కింది.

Stumps on Day 2 in Sydney.#TeamIndia move to 141/6 in the 2nd innings, lead by 145 runs.

Ravindra Jadeja & Washington Sundar at the crease 🤝

Scorecard - https://t.co/NFmndHLfxu #AUSvIND pic.twitter.com/4fUHE16iJq

— BCCI (@BCCI) January 4, 2025

పంత్ మెరుపు దాడి..
సిడ్నీ తొలి ఇన్నింగ్స్ లో 40 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచిన పంత్.. రెండో ఇన్నింగ్స్ లోనూ ఆపద్భాందవుడయ్యాడు. 78/4తో కష్టాల్లో నిలిచిన జట్టును ఆదుకున్నాడు. అతని చలవతోనే భారత స్కోరు వేగంగా 120 మార్కుల స్కోరు దాటింది. ఎదుర్కొన్న తొలి బంతినే సిక్సర్ గా మలిచిన పంత్.. ఆ తర్వాత రెచ్చిపోయాడు. 6 ఫోర్లు, 4 సిక్సర్లతో సత్తా చాటాడు. ముఖ్యంగా మిషెల్ స్టార్క్ బౌలింగ్ లో వరుసగా రెండు కళ్లు చెదిరే సిక్సర్లను బాదాడు. దీంతో తను కేవలం 29 బంతుల్లోనే అర్థ సెంచరీ చేసుకున్నాడు. తను ఉన్నంత వరకు ఆసీస్ కెప్టెన్ పాట్ కమిన్స్ కు ఏం చేయాలో తోచలేదు. చివరికి తనే బ్యాటింగ్ కు దిగి పంత్ ను ఔట్ చేశాడు. స్కోరు వేగాన్ని పెంచే క్రమంలో పంత్ ఔటయ్యాడు. నిజానికి గత బీజీటీలో అద్భుతంగా ఆడిన పంత్.. ఈసారి టచ్ మిస్సయ్యాడు. ఇక ఐదో టెస్టులో తన మార్కు ఆటతీరు చూపించిన పంత్.. రెండో ఇన్నింగ్స్ లో చెలరేగిపోయాడు. టీమ్ మేనేజ్మెంట్ కూడా స్వేచ్ఛ ఇవ్వడంతో పంత్ తను ఎంత ప్రమాదకారో నిరూపించాడు. ఎడాపెడా బౌండరీలతో రెచ్చిపోయి బౌలర్లను ఒత్తిడిలోకి నెట్టాడు. ఈక్రమంలో ఐదో వికెట్ జడేజాతో కలిసి అమూల్యమైన 46 పరుగుల భాగస్వామ్యాన్ని పంత్ నమోదు చేశాడు. కేవలం 42 బంతుల్లోనే ఈ పార్ట్నర్ షిప్ రావడం గమనార్హం.

కోహ్లీ మళ్లీ విఫలం..
మరోవైపు ఈ మ్యాచ్ లో బ్యాటర్లు మళ్లీ విఫలమయ్యారు. యశస్వి జైస్వాల్ (22) శుభారంభాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయాడు. విరాట్ కోహ్లీ (4) మళ్లీ ఆఫ్ స్టంప్ బలహీనతకు ఔటయ్యాడు. ఈ సిరీస్ అంతా తను ఒకే రకంగా ఔటవడం గమనార్హం. శుభమాన్ గిల్ (13), నితీశ్ కుమార్ రెడ్డి (4) విఫలమయ్యారు. దీంతో భారీ ఆధిక్యంపై కన్నేసిన భారత్, ప్రస్తుతానికి వెనక్కి తగ్గింది. చివర్లో రవీంద్ర జడేజా (39 బంతుల్లో 8 బ్యాటింగ్, 1 ఫోరు) ఓపికగా ఆడాడు. వాషింగ్టన్ సుందర్ (6 బ్యాటింగ్) తో కలిసి మరో వికెట్ పడకుండా రోజును ముగించారు. ప్రస్తుతం టీమిండియా చేతిలో 145 పరుగుల ఆధిక్యం ఉంది.

మ్యాచ్ కు మరో మూడు రోజులు ఉండటంతో ఈ మ్యాచ్ లో దాదాపు గా ఫలితం ఆదివారమే తేలనుంది. ఇక స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా గాయంపై ప్రస్తుతానికి ఎలాంటి స్పష్టత రాలేదు. ఆస్పత్రి నుంచి తను డ్రెస్సింగ్ రూంకి మ్యాచ్ జరుగుతున్నప్పుడే చేరుకోవడం సానుకూలాంశం. ఇక మూడో రోజున వీలైనంత ఎక్కువ సేపు బ్యాటింగ్ చేసి ప్రత్యర్థి ముందు భారీ టార్గెట్ నిర్దేశిస్తేనే భారత్ విజయం సాధిస్తే అవకాశం ఉంటుంది. తద్వారా అటు బీజీటీతోపాటు, ఇటు ప్రపంచ టెస్టు చాంపియన్ షిప్ ఫైనల్ రేసులో నిలవొచ్చు.

Also Read: <a title="Breaking News: బుమ్రాకు గాయం.. మైదానం వీడి వెళ్లిపోయిన స్టార్ పేసర్" href="https://telugu.abplive.com/sports/cricket/indian-pacer-jasrpti-burmah-gets-injury-scare-as-he-left-scg-in-the-middle-of-5th-test-vs-australia-192915" target="_blank" rel="nofollow noopener">Breaking News: బుమ్రాకు గాయం.. మైదానం వీడి వెళ్లిపోయిన స్టార్ పేసర్