Right to Die with Dignity: భారతదేశంలో తొలిసారిగా మహారాష్ట్ర ప్రభుత్వం ఓ వినూత్నమైన ఆదేశాలను జారీ చేసింది. ఇక నుంచి మహారాష్ట్రలో గౌరవంగా చనిపోవాలనుకుంటే దానికి అనుమతి ఇస్తారు. అయితే కొన్ని షరతులు వర్తిస్తాయి. సుప్రీంకోర్టు జారీ చేసిన ఉత్తర్వుల మేరకు మహారాష్ట్ర ప్రభుత్వం తొలిసారిగా ఇలాంటి జీవోను ఇచ్చింది.

సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం మహారాష్ట్ర ఉత్తర్వులు

ప్రాణాంతక వ్యాధులతో బాధపడుతున్న వారికి గౌరవంగా ప్రాణం తీసివేసే కారుణ్య మరణ విధానానికి సుప్రీం కోట్లు చాలా ఏళ్ల క్రితమే అనుమతించింది. పరోక్ష కారుణ్య మరణాలు, వాటి కోసం పరిగణించే లివింగ్ విల్ అనుమతించదగినవే అని తెలిపింది. ఈ మేరకు కొన్ని కఠిన మార్గదర్శకాలను జారీ చేసింది. చట్టాన్ని తీసుకొచ్చేంత వరకు ఈ మార్గదర్శకాలు అమల్లో ఉంటాయని తెలిపింది. ఇప్పుడు మహారాష్ట్ర ప్రభుత్వం నోటిఫై చేసింది.

Also Read : Adult content creator : సాఫ్ట్‌వేర్ ఉద్యోగం కన్నా అడల్ట్ కంటెంట్ క్రియేటర్‌గా మారడం బెటర్ - Phd వదిలేసి ఈ అందగత్తె చేస్తున్నది అదే !

కోలుకోలేని పరిస్థితి ఉంటే కారుణ్య మరణం

రోగి పరిస్థితి అత్యంత విషమంగా ఉండి, వ్యాధి పూర్తిగా నయం కాదని చట్టబద్ధమైన మెడికల్ బోర్డు ప్రకటించిన తర్వాతే లైఫ్ సపోర్ట్ తొలగిస్తారు. రోగులు తమకు ఇవ్వాల్సిన చికిత్సపై ముందుగానే సూచనలు జారీచేసే పత్రాన్ని సజీవ వీలునామా అంటారు. దీనికి రోగుల కుటుంబ సభ్యుల నుంచి కూడా అనుమతి ఉండాలి. చట్టాలు చేయని రాష్ట్రాల్లో కారుణ్య మరణం కోసం రోగి కుటుంబ సభ్యులు హైకోర్టును ఆశ్రయిస్తే.. కారుణ్య మరణం అవసరమా, లేదా అని నిర్ణయించేందుకు ఆ న్యాయస్థానం మెడికల్ బోర్డును ఏర్పాటు చేస్తుంది. ఇప్పటి వరకూ ఏ రాష్ట్రంలోనూ సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం జీవో జారీ చేయలేదు.

Also Read : VRS For Wife: విధి అంటే ఇదేనేమో! - అనారోగ్యంతో ఉన్న భార్యను చూసుకునేందుకు వీఆర్ఎస్ తీసుకున్నాడు, ఇంతలోనే!

చాలాకాలం నుంచి విజ్ఞప్తులు

ప్రాణాంతక వ్యాధులతో జీవచ్ఛవాలుగా బతుకుతున్న రోగులకు కారుణ్య మరణాలను ప్రసాదించాలనే చర్చ ఎప్పటి నుంచో సాగుతోంది. మహారాష్ట్ర ప్రభుత్వం తొలి సారి ధైర్యం చేసి ఇలాంటి ఉత్తర్వులు జారీ చేసింది. మరి మిగతా రాష్ట్రాలు కూడా పాటిస్తాయేమో చూడాల్సి ఉంది.

దేశంలో అనేక మంది బ్రెయిన్ డెడ్ అయి, కోమాలో ఉంటున్నారు. ఇంకా కొన్ని వేల మంది ఆస్పత్రి మంచానికే పరిమితమై ఉంటారు. వీరిలో చాలా మంది ఇలాంటి దుర్భరమైన జీవితం కంటే.. కారుణ్య మరణం మంచిదని అనుకుంటూ ఉంటారు. కుటుంబసభ్యులు కూడా వారి బాధను చూడలేకపోతున్నామని .. కోలుకునే అవకాశం లేనప్పుడు కారణ్య మరణానికైనా అవకాశం ఇవ్వాలని కోరుతూంటారు. అయితే అలాంటి వాటికి చట్టపరంగా అవక్శం లేదు. మొదటి సారి మహారాష్ట్ర ప్రభుత్వం చట్టాన్ని తీసుకు వచ్చింది.