TDP cadre angey at Revanth: హైదరాబాద్ తెలంగాణకు అడ్వాంటేజ్ అయితే.. ఏపీకి అమరావతి లయబులిటీ అని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్యూలో వ్యాఖ్యానించారు. ఏపీలో ఉన్న పోటీ వాతావరణంపై మాట్లాడుతూ ఆయనీ వ్యాఖ్యలు చేశారు. అలాగే చంద్రబాబు చాలా సీనియర్ అన్న అర్థంలో వ్యాఖ్యలు చేశారు. అలాగే నారా లోకేష్ చాలా జూనియర్ అని... తన వయసు కూడా తనకు అడ్వాంటేజ్ అని రేవంత్ రెడ్డి ఇంటర్యూలో చెప్పారు. రేవంత్ ఇంటర్యూలోని మిగతా అంశాలు పెద్దగా వైరల్ కాలేదు కానీ ఈ క్లిప్ మాత్రం వైరల్ అయింది.

అమరావతి లయబలిటీ అనడాన్ని విస్తృతంగా ప్రచారం చేస్తున్న వైఎస్ఆర్‌సీపీ

అమరావతి విషయంలో ఎప్పటికప్పుడు పూర్తి స్థాయిలో వ్యతిరేకంగా ఉండే వైసీపీ ఈ అవకాశాన్ని అంది పుచ్చుకుంది. అమరావతి ఏపీకి లయబలిటీ అని రేవంత్ కూడా చెప్పారని ప్రచారం చేస్తున్నారు. అదే సమయంలో చంద్రబాబు వయసు అయిపోయిందని.. లోకేష్ మరీ జూనియర్ అని కూడా చెబుతున్నారు. వైఎస్ఆర్‌సీపీ సోషల్ మీడియా కార్యకర్తలందరూ ఈ వీడియోను వైరల్ చేస్తున్నారు.

ఏంటి రేవంత్ రెడ్డి గారు ఇలా అంటున్నారు.

హైదరాబాద్ నాకు ఆస్తి అయితే అమరావతి వాళ్లకు గుదిబండ

హైదరాబాద్ క్లైమేట్ నాకు అడ్వాంటేజ్ అమరావతికి అదే పెద్ద శాపం. చంద్రబాబు ముసలివాడు అయిపోయారు.

లోకేష్ మరి పిల్లవాడు నేను మధ్యలో ఉన్నాను pic.twitter.com/IK2gQ5uNXm

— SKH🌱🌾💫 (@SHSK299) August 31, 2025

అసంతృప్తి వ్యక్తం చేస్తున్నటీడీపీ క్యాడర్

అమరావతి విషయంలో రేవంత రెడ్డి వ్యాఖ్యలు చేయడాన్ని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. కారణం ఏదైనా రేవంత్ రెడ్డి అంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కాస్త అభిమానం చూపిస్తారు. సోషల్ మీడియాలో తెలంగాణలో ఏ లీడర్ కు మద్దతు పలకాల్సిన ప్రస్తావన వస్తే ఖచ్చితంగా రేవంత్ కే మద్దతు పలికేవారు. అలాంటిది ఇప్పుడు ఆయన అమరావతిపై అవసరం లేకపోయినా వ్యాఖ్యలు చేయడం, చంద్రబాబు , లోకేష్ పై నా వ్యాఖ్యలు చేయడం జీర్ణించుకోలేకపోతున్నారు.

ఆ హైదరాబాద్ ని మీకు అసెట్ గా చేసి ఇచ్చిందే బాబు గారు రేవంత్ గారు!! మీరు పోటీ పడేది బీహార్ అస్సాం రాష్ట్రాలతో మాత్రమే.

చంద్రబాబు గారు అధికారం లో ఉంటే ఆయన రేస్ గుర్రం! వయసు ఒక నంబర్ మాత్రమే ఆయనకి.

pic.twitter.com/MY5LsWCKjf

— SBS (@SBSUSA007) August 31, 2025

రేవంత్ మాట వరుసకు అన్నారా? సీరియస్ అన్నారా ?

అమరావతికి వాతావరణం అనుకూలం కాదని రేవంంతత్ అన్నారు. అమరావతికి తుపాన్లు వస్తాయి హైదరాబాద్ కు రావని రేవంత్ ఉద్దేశం కావొచ్చన్న అభిప్రాయం వినిపిస్తోంది. అయితే తాపునులు వచ్చే ప్రాంతాలలో నగరాలు అభివృద్ధి చెందవా అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఈ వివాదం ఇంతటితో ఆగిపోతుందా.. ఆయా పార్టీల నేతలు కూడా జోక్యం చేసుకుని పెద్దది చేసుకుంటారా అన్నది ఇప్పుడు రాజకీయవర్గాలకూ ఆసక్తికరంగా మారిన అంశం.