Revanth counter to Kavita: చెత్తగాళ్ల వెనుక నేనెందుకుంటా - యాసిడ్ దాడులు చేసుకుంటున్నారు - బీఆర్ఎస్ పరిణామాలపై రేవంత్ కౌంటర్

3 months ago 3
ARTICLE AD

CM Revanth On BRS: చెత్తగాళ్ల వెనుక తానెందుకు ఉంటానని  తనకు అంత సమయం లేదని సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ పరిణామాలపై వ్యాఖ్యానించారు.  ఒకరిపై ఒకరు యాసిడ్ దాడులు చేసుకుంటున్నారన్నారని విమర్శించారు. హైదరాబాద్ లో ఓ కార్యక్రమంలో మాట్లాడిన రేవంత్ సూటిగానే బీఆర్ఎస్ అధినేత ఫ్యామిలీలో ఏర్పడిన వివాదం విమర్శలు గుప్పించారు.  కాంగ్రెస్ పార్టీని బతకనివ్వబోమని ఆనాడు   అక్రమ కేసులు పెట్టి జైల్లో పెట్టారని గుర్తు చేసుకున్నారు.  ఇవాళ వాళ్ళేతన్నుకుని చస్తున్నారు.. ఒకరినొకరు కడుపులో కత్తులు పెట్టుకుని కౌగిలించుకుంటున్నారని అన్నారు. ఎవరూ అక్కర్లేదు వాళ్లను వాళ్ళే పొడుచుకుంటారన్నారని తేల్చేశారు.

అవినీతి సొమ్ము పంపకాల్లో తేడా వచ్చి కుటుంబంలో తగాదాలు పెట్టుకుంటున్నారని ఆరోపించారు. పాపం ఊరికే పోదన్నారు. ఆ పాపాలు వెంటాడుతూనే ఉంటాయి.. ఖచ్చితంగా అనుభవించాల్సిందేనని స్పష్టం చేశారు. ఒకరివెనక ఒకరు ఉన్నారని కొందరు మాట్లాడుతున్నారు ..అంత చెత్తగాళ్ళ వెనక నేనెందుకు ఉంటాననని ప్రశ్నించారు. నేను నాయకుడిని.. ఉంటే ముందుంటా… నా వాళ్లకు తోడుగా ఉంటానని ప్రకటించారు. వాళ్ళ కుటుంబంలో వాళ్లు వాళ్లు కత్తులతో పొడుచుకుని హరీష్, సంతోష్ వెనక రేవంత్ రెడ్డి ఉన్నారని ఒకరంటే… లేదు లేదు కవిత వెనకాల రేవంత్ రెడ్డి ఉన్నారని ఇంకొకరంటున్నారని విమర్శలు గుప్పించారు.

మీరంతా దిక్కుమాలినవారని తెలంగాణ ప్రజలు బండకేసి కొట్టారని..  అన్నం తినేవారు ఎవరైనా మీ వెనక ఉంటారా అని ప్రశ్నించారు. దయచేసి మీ కుటుంబ పంచాయతీలోకో.. మీ కుల పంచాయతీలోకో  మమ్మల్ని లాగవద్దని హెచ్చరించారు.  మాకు ఎలాంటి ఆసక్తి లేదని స్పష్టం చేశారు. మిమ్మల్ని ఎప్పుడో ప్రజలు తిరస్కరించారన్నారు. మీది కాలం చెల్లిన నోటు లాంటిది ఆ పార్టీ అని కాలగర్భంలో కలిసిపోతుందని స్పష్టం చేశారు. ప్రకృతి ఉంటుంది.. ప్రకృతి శిక్షిస్తుందని స్పష్టం చేశారు.

Read Entire Article