Republic Day 2025: ఓటీటీలో ఉన్న రిపబ్లిక్ డే స్పెషల్ మూవీస్... ఈ కొత్త దేశభక్తి సినిమాలను అస్సలు మిస్ కావొద్దు
10 months ago 8
ARTICLE AD
మరికొన్ని గంటలో ఇండియాలో రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ షురూ కాబోతున్నాయి. ఈ నేపథ్యంలోనే దేశవ్యాప్తంగా ప్రజలు దేశభక్తిలో మునిగిపోయారు. సాధారణంగా వీక్ డేస్ లో రిపబ్లిక్ డే వచ్చిందంటే జెండా ఎగరవేసి, జై కొట్టి సంతోషంగా జరుపుకుంటారు. అయితే ఈ వారం రిపబ్లిక్ డే ఆదివారం వచ్చింది. ఈ వీకెండ్ రిపబ్లిక్ డేని ఇంట్లోనే కూర్చుని కొత్త సినిమాలతో, అది కూడా దేశభక్తి సినిమాలను చూసి సెలబ్రేట్ చేసుకోవాలి అనుకునేవారు ఓటీటీలో ఉన్న ఈ సినిమాలను చూసి ఎంజాయ్ చేయండి.
రజాకార్
అనసూయ భరద్వాజ్, ఇంద్రజ, వేదిక, బాబి సింహ తదితరులు పోషించిన పీరియాడికల్ యాక్షన్ డ్రామా 'రజాకార్'. తెలంగాణలో స్వాతంత్ర దినోత్సవం కంటే ముందు జరిగిన రజాకార్ల అక్రమాలు దౌర్జన్యాలపై తెరకెక్కింది ఈ మూవీ. యాటా సత్యనారాయణ దర్శకత్వం వహించిన ఈ మూవీ ప్రస్తుతం ఆహా ఓటీటీలో అందుబాటులో ఉంది. ఈ మూవీకి ఐఎండిబిలో 7.9 రేటింగ్ వచ్చింది. పైగా ఈ ఫ్రైడేనే ఓటీటీలో రిలీజ్ అయింది ఈ మూవీ.
అమరన్
శివ కార్తికేయన్, సాయి పల్లవి జంటగా నటించిన ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా 'అమరన్'. ఈ సినిమాలో దేశభక్తి కూడా మిళితమై ఉంటుంది. దివంగత మేజర్ ముకుంద వరదరాజన్ బయోగ్రఫీగా రూపొందిన ఈ మూవీ గత ఏడాది దీపావళి కానుకగా రిలీజై, బిగ్గెస్ట్ హిట్టుగా నిలిచిన సంగతి తెలిసిందే. రాజ్ కుమార్ పెరియాసామి దర్శకత్వం వహించిన ఈ మూవీ నెట్ ఫ్లిక్స్ లో తెలుగుతో పాటు తమిళ, మలయాళ, హిందీ భాషల్లో అందుబాటులో ఉంది. ఈ మూవీకి ఐఎండిబిలో 8.2 రేటింగ్ ఉండడం విశేషం. ఇక ఈ రెండు మాత్రమే కాదు ఓటీటీలో మరికొన్ని ఇంట్రెస్టింగ్ దేశభక్తి సినిమాలు కూడా స్ట్రీమింగ్ అవుతున్నాయి.  భారతీయుడు 2, ఖడ్గం, సుభాష్ చంద్రబోస్ లాంటి ఎవర్ గ్రీన్ సినిమాలను కూడా ఈ వీకెండ్ చూడవచ్చు.
Also Read: మాదంతా క్లీన్... కలెక్షన్లు ఎక్కువ చేసి చూపించడం తప్పే - దిల్ రాజు సెన్సేషనల్ కామెంట్స్
జీ5 ఓటీటీలో ఏయే దేశభక్తి సినిమాలు ఉన్నాయి?
స్వాతంత్ర్య వీర్ సావర్కర్ - హిందీ సినిమా
సామ్ బహదూర్ - హిందీ సినిమా
ఉరి: సర్జికల్ స్ట్రైక్ - హిందీ సినిమా
అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఏయే దేశభక్తి సినిమాలు ఏం ఉన్నాయి?
బోర్డర్ - హిందీ సినిమా
రాజీ - ఆలియా భట్ ప్రధాన పాత్రలో నటించిన స్పై థ్రిల్లర్
మైదాన్ - అజయ్ దేవగణ్ ప్రధాన పాత్రలో నటించిన బయోపిక్
చందూ ఛాంపియన్ - హిందీ సినిమా
'జీ 5'లోనూ... ఇంకా సోనీ లివ్ ఓటీటీలో ఏయే సినిమాలు ఉన్నాయి?
జై భీమ్ - సూర్య ప్రధాన పాత్రలో నటించిన సినిమా. తమిళంతో పాటు తెలుగులోనూ ఈ సినిమాలో అందుబాటులో ఉంది.
రాకెట్ బాయ్స్ - సోనీ లివ్ ఓటీటీలో ఈ సినిమాలో స్ట్రీమింగ్ అవుతోంది.
ఫ్రీడం ఎట్ మిడ్ నైట్ - సోనీ లివ్
పర్మాను: ది స్టోరీ ఆఫ్ పోఖ్రాన్ - జీ 5
Read Entire Article