Raw Garlic : ఖాళీ కడుపుతో వెల్లుల్లి తింటే బరువు తగ్గుతారా? ఈ అలవాటు లాభమా? నష్టమా?

3 months ago 15
ARTICLE AD

Raw Garlic on an Empty Stomach : వెల్లుల్లి వంటలకు మంచి రుచిని ఇవ్వడమే కాకుండా.. ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఈ విషయం చాలామందికి తెలుసు. దీనిని తీసుకుంటే రోగనిరోధక శక్తి పెరుగుతుందని, బీపీ తగ్గుతుందని, కొలెస్ట్రాల్ కంట్రోల్ అవుతుందని నమ్ముతారు. దీనిలో భాగంగా ప్రతిరోజూ ఉదయం ఖాళీ కడుపుతో వెల్లుల్లి తినడం అలవాటు చేసుకుంటారు. కానీ ఈ అలవాటు ఎంతవరకు మంచిది? ఎవరికి సేఫ్ కాదో, నిపుణుల సూచనలు ఏంటో చూసేద్దాం.

ఉదయం ఖాళీ కడుపుతో పచ్చి వెల్లుల్లి రెబ్బలు తినడం శరీరానికి మంచిదే. కానీ ఈ అలవాటును ఎక్కువ కాలం కొనసాగించడం ఆరోగ్యానికి చాలా హానికరమని చెప్తున్నారు. సరైన మోతాదులో తీసుకుంటే వెల్లుల్లి ఔషధంలా పనిచేస్తుంది. కానీ అదే అతిగా లేదా తప్పు సమయంలో తీసుకుంటే శరీరానికి ఇబ్బందులు వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు.

ఖాళీ కడుపుతో తినడం వల్ల కలిగే నష్టాలివే..

ఖాళీ కడుపుతో వెల్లుల్లి తినడం వల్ల గ్యాస్ట్రిక్ జ్యూసులు ఎక్కువగా ఉత్పత్తి అవుతాయి. దీని కారణంగా కడుపులో మంట, యాసిడ్ రిఫ్లక్స్, గ్యాస్, ఉబ్బరం వంటి సమస్యలు రావచ్చు. ముఖ్యంగా గ్యాస్ట్రిటిక్, అల్సర్ ఉన్నవారికి ఇది మరింత ప్రమాదకరమని చెప్తున్నారు. వెల్లుల్లికి సహజంగా రక్తాన్ని పలుచన చేసే గుణం ఉంటుంది. అందుకే బీపీ మందులు, బ్లడ్ థిన్నర్స్ వాడేవారు తినకపోవడమే మంచిది. లేదంటే కళ్లు తిరగడం, అలసట, నీరసం వంటి సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు.

నోటి దుర్వాసన

ఉదయం పూట వెల్లుల్లి తినడం వల్ల తీవ్రమైన నోటి వాసన రావచ్చు. అంతేకాకుండా కొందరికి వాంతులు రావడం, విరేచనాలు, కడుపు అసౌకర్యం వంటి ఇబ్బందులు వస్తాయి. ఎందుకంటే ప్రతి శరీరం ఒకేలా స్పందించదు. కొందరికి వెల్లుల్లి అలర్జీ ఉండవచ్చు. అలాంటివారు తీసుకుంటే చర్మంపై దురద, తలనొప్పి, శ్వాస సమస్యలు కూడా రావచ్చు.

నిపుణుల సూచన ఏమిటంటే…

నిపుణుల ప్రకారం వెల్లుల్లిని ఖాళీ కడుపుతో కాకుండా భోజనంతో కలిసి తీసుకోవడం మంచిది. రోజుకు 1–2 రెబ్బలకంటే ఎక్కువ తీసుకోవద్దు. దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు కచ్చితంగా వెల్లుల్లి తీసుకునే ముందు డాక్టర్ల సలహా తీసుకోవాలి.

గమనిక: ఈ కథనంలో అందించిన సమాచారం నిపుణులు పంచుకున్నారు. ఇది సాధారణ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది. వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే, ఎల్లప్పుడూ మీ వైద్యుడు లేదా ఇతర అర్హత కలిగిన ఆరోగ్య సంరక్షణ ప్రదాత సలహా తీసుకోండి.

Read Entire Article