Bank Officials Seized Actor Ravi Mohan House: కోలీవుడ్ స్టార్ రవి మోహన్ మరోసారి వార్తల్లో నిలిచారు. ఆయనకు బ్యాంక్ అధికారులు షాక్ ఇచ్చారు. చెన్నైలోని ఇంజంబక్కంలో ఆయన ఉంటున్న ఇంటిని వేలం వేసేందుకు రెడీ అయ్యారు. ఇంటికి సంబంధించిన లోన్స్ చెల్లించకపోవడంతో పలుమార్లు నోటీసులు ఇచ్చినా రియాక్ట్ కాకపోవడంతో ఇంటికి నోటీసులు అంటించినట్లు కోలీవుడ్ మీడియాలో కథనాలు వచ్చాయి. ప్రస్తుతం ఈ టాపిక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

రూ.7.60 కోట్లకు పైగా...

చెన్నైలోని ఇంటి కోసం రవి మోహన్ ఓ ప్రైవేట్ బ్యాంక్ నుంచి అధిక మొత్తంలో లోన్ తీసుకున్నారు. అయితే, నెలవారీ వాయిదాలు చెల్లించకపోవడంతో దాదాపు రూ.7.60 కోట్లకు పైగా బకాయిలు ఉన్నట్లు నోటీసుల్లో పేర్కొన్నారు. గతంలో ఎన్నో రిమైండర్ లేఖలు పంపినా హీరో రియాక్ట్ కాలేదని... అందుకే ఇంటి డోర్‌కు నోటీసులు అంటించి వెళ్లినట్లు తెలుస్తోంది. త్వరలోనే ఇంటిని వేలం వేసేందుకు బ్యాంక్ అధికారులు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. దీనిపై అభిమానులు ఆందోళన చెందుతున్నారు.

ఇదే రవి మోహన్‌పై రీసెంట్‌గా 'టచ్ గోల్డ్ యూనివర్సల్' అనే నిర్మాణ సంస్థ మూవీస్ విషయంలో ఆరోపణలు చేసింది. తమ ప్రొడక్షన్ హౌస్‌లో రెండు సినిమాలు చేసేందుకు రూ.6 కోట్లు అడ్వాన్స్ తీసుకున్నారని... కానీ ఆ సినిమాల్లో నటించకుండానే ఇతర ప్రాజెక్టులు యాక్సెప్ట్ చేశారంటూ ఆరోపించారు. దీంతో హీరో ఇంటిని జప్తు చేయాలని సదరు నిర్మాణ సంస్థ అభ్యర్థించిందని కోలీవుడ్ మీడియా వెల్లడించింది.

Also Read: పవన్ 'OG' సెలబ్రేషన్స్ - ఈలలు, కేకలతో మెగా హీరోల సందడి... సాయిదుర్గా తేజ్ To అకీరా వరకూ...

సొంత నిర్మాణ సంస్థ ప్రారంభం

ఇటీవలే రవి మోహన్ తన సొంత నిర్మాణ సంస్థ 'రవిమోహన్ స్టూడియోస్'ను ప్రారంభించి 'ఆర్డినరీ మ్యాన్' అనే చిత్రానికి దర్శకత్వం వహించి నిర్మిస్తున్నారు. దీంతో పాటు 'కరతే బాబు', 'జెనీ' వంటి చిత్రాల్లోనూ నటించారు. తన భార్య ఆర్తి రవితో విడాకుల వ్యవహారంతో రవి మోహన్ వరుసగా వార్తల్లో నిలిచారు. ఆయన సింగర్ కెనీషాతో రిలేషన్ షిప్‌లో ఉన్నారనే ప్రచారం సాగుతోంది. తన ప్రమేయం లేకుండానే డివోర్స్ అనౌన్స్ చేశారంటూ ఆయన భార్య ఆర్తి రవి చెప్పారు. ఈ వ్యవహారం కోర్టులో ఉంది. అయితే, వరుస వివాదాలు, కెరీర్, వ్యక్తిగత సమస్యలతో ఆయన కెరీర్‌పై ఎలాంటి ప్రభావం చూపుతుందో అని అభిమానులు ఆందోళన చెందుతున్నారు.