Rave Party In East Godavari District: తూ.గో జిల్లాలో (Eastgodavari District) రేవ్ పార్టీ కలకలం రేపింది. కోరుకొండ మండలం బూరుగుపూడి గేట్ సమీపంలోని కల్యాణ మండపంలో సోమవారం తెల్లవారుజామున రేవ్ పార్టీ జరుగుతుందన్న సమాచారంతో పోలీస్ ప్రత్యేక సిబ్బంది దాడి చేశారు. ఐదుగురు అమ్మాయిలతో సహా 14 మంది పురుషులను అదుపులోకి తీసుకున్నారు. న్యూ ఇయర్ సందర్భంగా రేవ్ పార్టీ ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. నిందితులు ఓ ఫెర్టిలైజర్ కంపెనీకి చెందినవారిగా పోలీసులు గుర్తించారు. వీరి గుంటూరు పరిసర ప్రాంతాల నుంచి వచ్చినట్లు సమాచారం. కాగా, సదరు ఫంక్షన్ హాల్ యజమాని పరారీలో ఉండగా అతని కుమారున్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీనిపై పూర్తిస్థాయిలో విచారణ చేస్తున్నారు.

Also Read: Pawankalyan: నాగబాబుకు మంత్రి పదవి - డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఏమన్నారంటే?

రేవ్ పార్టీ కలకలం తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ మండలం బూరుగుపూడి గేట్ వద్ద ఉన్న నాగసాయి ఫంక్షన్ హాల్‌లో రేవ్ పార్టీ ఐదుగురు అమ్మాయిలతో పాటు మరో 10 మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు యువతులు గుంటూరుకు చెందినవారు కాగా, యువకులు రాజమండ్రికి చెందినవారుగా గుర్తింపు పరారీలో ఫంక్షన్ హాల్ యజమాని యజమాని కుమారుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు