Rashmika Vs Sudheer Babu: గర్ల్ ఫ్రెండ్ vs జటాధర... బిజినెస్‌లో ఎవరిది అప్పర్ హ్యాండ్? ఏ మూవీ క్రేజ్ ఎక్కువ??
1 month ago 2
ARTICLE AD
నవంబర్ మొదటి వారంలో థియేటర్లలోకి ఐదారు సినిమాలు వస్తున్నాయి. అందులో పెద్ద సినిమాలు ఏవి? అని చూస్తే... నేషనల్ క్రష్ రష్మికా మందన్నా 'ది గర్ల్ ఫ్రెండ్', నవ దళపతి సుధీర్ బాబు 'జటాధర' ఉన్నాయ్. ఈ రెండూ పాన్ ఇండియా రిలీజ్ అవుతున్న సినిమాలు. మరి ఈ రెండిటిలో ఏ సినిమాకు ఎక్కువ క్రేజ్ ఉంది? ప్రీ రిలీజ్ బిజినెస్ పరంగా ఎవరిది అప్పర్ హ్యాండ్? అనేది చూస్తే...
'జటాధర' కంటే గర్ల్ ఫ్రెండ్ బిజినెస్ ఎక్కువ!
హారర్, డివోషనల్ టచ్ ఉన్న థ్రిల్లర్ సినిమాలకు మార్కెట్టులో క్రేజ్ ఉండటం కామన్. కానీ, 'జటాధర' కంటే బ్యూటిఫుల్ లవ్ స్టోరీగా తెరకెక్కిన 'ది గర్ల్ ఫ్రెండ్'కు బిజినెస్ & ట్రేడ్ వర్గాల్లో మంచి క్రేజ్ ఏర్పడింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో సుధీర్ బాబు సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ జస్ట్ ఆరు కోట్ల రూపాయలు మాత్రమే. ఆ అమౌంట్ ఒక్క నైజాం రైట్స్ ద్వారా రష్మిక సినిమాకు వచ్చాయి.
ఏపీ, తెలంగాణలో 'జటాధర' ప్రీ రిలీజ్ బిజినెస్ రూ. 6 కోట్లు అయితే... 'ది గర్ల్ ఫ్రెండ్' బిజినెస్ 13 కోట్లు కంటే ఎక్కువ. థియేటర్స్ పరంగానూ సుధీర్ బాబు 'జటాధర' కంటే రష్మిక 'ది గర్ల్ ఫ్రెండ్' సినిమాకు ఎక్కువ దక్కుతాయని చెప్పవచ్చు. వరల్డ్ వైడ్ ప్రీ రిలీజ్ బిజినెస్ విషయంలో 'ది గర్ల్ ఫ్రెండ్' ఆల్మోస్ట్ 20 కోట్ల మార్క్ టచ్ చేసింది. హిందీ మార్కెట్ చూసినా 'జటాధర'కు అంత రాలేదని టాక్.
Also Read: 'గర్ల్ ఫ్రెండ్' ట్విట్టర్ రివ్యూ: హార్డ్ హిట్టింగ్ క్లైమాక్స్ సూపర్ హిట్టు... మరి సినిమా? రష్మిక పెర్ఫార్మన్స్??
డిజిటల్ స్ట్రీమింగ్, శాటిలైట్ (టీవీ) రైట్స్ విషయంలోనూ రష్మికది పై చేయిగా కనబడుతోంది. నాన్ థియేట్రికల్ రైట్స్ ద్వారా 'ది గర్ల్ ఫ్రెండ్'కు రూ. 21 కోట్లు వచ్చాయి. 'జటాధర' నాన్ థియేట్రికల్ బిజినెస్ ఎంత? అనేది ఆ టీం బయట పెట్టడం లేదు.
Also Read: ఆ సూపర్ స్టారూ వద్దు... ఈ కింగూ వద్దు... రెండు సినిమాలు రిజెక్ట్ చేసిన బాలకృష్ణ
తెలుగు రాష్ట్రాల్లో రష్మిక 'ది గర్ల్ ఫ్రెండ్'కు ఎక్కువ క్రేజ్ నెలకొంది. సుధీర్ బాబు హీరోగా నటించినప్పటికీ, ప్యాక్డ్ బాడీతో ఆయన కష్టపడినప్పటికీ 'ది గర్ల్ ఫ్రెండ్'కు ఆశించిన స్థాయిలో బజ్ రావడం లేదు. రష్మిక ముందు 'జటాధర' వెలవెలబోతోంది. హేషామ్ అబ్దుల్ వాహేబ్ సాంగ్స్ 'ది గర్ల్ ఫ్రెండ్'కి ప్లస్ అయ్యాయి. 'జటాధర'కు డివోషనల్ టచ్ ఉన్నప్పటికీ క్యాష్ చేసుకోవడంలో, ప్రేక్షకులలో బజ్ క్రియేట్ చేయడంలో ఆ సినిమా వెనుకబడింది.
Read Entire Article