Director Shankar Changed Game Changer Story : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కెరీర్‌లోనే డిజాస్టర్‌గా నిలిచింది గేమ్ ఛేంజర్. స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ పొలిటికల్ యాక్షన్ డ్రామా అనుకున్నంత సక్సెస్ కాలేకపోయింది. ఈ మూవీకి ప్రముఖ తమిళ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజు స్టోరీ అందించారు. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆయన... 'గేమ్ ఛేంజర్' స్టోరీ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు షేర్ చెప్పారు. తాను రాసిన కథకు తీసిన కథకు తేడా ఉందని వెల్లడించారు.

అసలు స్టోరీ ఏంటంటే?

తాను రాసిన 'గేమ్ ఛేంజర్' కథలో ఓ గ్యాంగ్ స్టర్ స్టోరీ కూడా ఇన్వాల్వ్ అయి ఉంటుందని తెలిపారు కార్తీక్ సుబ్బరాజు. 'నేను గేమ్ ఛేంజర్ కథ రాస్తే అది శంకర్‌కు నచ్చి స్క్రీన్‌ప్లే నన్ను రాయమని అడిగారు. కానీ, ఆ టైంలో నేను 'మహాన్' ప్రీ ప్రొడక్షన్ పనులతో బిజీగా ఉండడంతో కేవలం స్టోరీ మాత్రమే అందించాను. నేను ఇచ్చిన కథ ఓ ఐఏఎస్ ఆఫీసర్ చుట్టూ సాగుతుంది. వ్యవస్థలో మార్పు తీసుకు వచ్చేందుకు ఓ అధికారి ఎలా ప్రయత్నించాడనేదే ఇందులో ప్రధానాంశం.

కఠినమైన రాజకీయ వాతావరణాన్ని ఎదుర్కొనే ఒక ఎన్నికల అధికారి కథ 'న్యూటన్' అనే హిందీ మూవీ నుంచి నా అసలు కథ కొంత స్ఫూర్తి పొందింది. రియాలిటీకి దగ్గరగా ఉండేలా నేను కథ రాశాను. ఈ కథకు రాజకీయ నేపథ్యం ఉన్నప్పటికీ, ఆయన ఆ అంశాన్ని యాక్షన్, ఒక స్థానిక గ్యాంగ్‌స్టర్ ట్రాక్‌తో కలిపి ఒక కథనాన్ని ఊహించుకున్నారు.' అని అన్నారు.

Also Read : Friday OTT Movies : శుక్రవారం ఒక్క రోజే 17 సినిమాలు స్ట్రీమింగ్ - ఓటీటీల్లో ఈ మూవీస్ డోంట్ మిస్

'గ్యాంగ్ స్టర్ కోణం'

కథనంలో మరింత యాక్షన్‌ను జోడించాలని, మధురైకి చెందిన ఒక గ్యాంగ్‌స్టర్ పాత్ర ద్వారా దానికి స్పష్టమైన తమిళ నేపథ్యాన్ని ఇవ్వాలని కోరుకున్నట్లు కార్తీక్ సుబ్బరాజు తెలిపారు. 'రామ్ చరణ్ వంటి స్టార్ హీరో, శంకర్ లాంటి స్టార్ డైరెక్టర్ భారీ బడ్జెట్‌తో మూవీ చేస్తున్నప్పుడు స్టోరీ స్వరూపం పూర్తిగా మారిపోయిందని నాకు అర్థమైంది.

'గేమ్ ఛేంజర్' సినిమా చూసిన తర్వాత మార్పుల పరిధిని నేను అర్థం చేసుకున్నా. నా అసలు ఆలోచనకు, తుది రూపానికి మధ్య తేడాలు ఉన్నప్పటికీ, శంకర్ వంటి గొప్ప చిత్ర నిర్మాత తన కథను ముందుకు తీసుకెళ్లినందుకు సంతోషంగా ఉంది.' అని అన్నారు.

ఈ మూవీలో రామ్ చరణ్ ఓ ఐఏఎస్ అధికారి. ఆయన సరసన కియారా అద్వానీ హీరోయిన్‌గా నటించారు. అలాగే, అంజలి, శ్రీకాంత్, ఎస్ జే సూర్య, సునీల్, సముద్రఖని, బ్రహ్మానందం తదితరులు కీలకపాత్రలు పోషించారు. తమన్ మ్యూజిక్ అందించగా... శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు నిర్మించారు.

Also Read : Gondhal Telugu Trailer Review : ఒక్క రాత్రిలో నవ వధువు ఊహించని వ్యూహం? - తెలుగులో వచ్చేస్తోన్న ఆస్కార్ ఎంట్రీ 'గోంధళ్'... ట్రైలర్ చూశారా?

NOTE : మరిన్ని సినిమా వార్తలు, గాసిప్స్, ఓటీటీ అప్డేట్స్, వెబ్ సిరీస్‌లు, టాలీవుడ్, బాలీవుడ్ హీరోయిన్స్ లేటెస్ట్ సోషల్ మీడియా అప్డేట్స్, టీవీ సీరియల్స్ లేటెస్ట్ ఎపిసోడ్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.