Rajendra Prasad Robinhood Interview: యంగ్ హీరో నితిన్, డ్యాన్సింగ్ బ్యూటీ శ్రీలీల హీరో హీరోయిన్లుగా రూపుదిద్దుకుంటోన్న హైలీ యాంటిసిపేటెడ్ హీస్ట్ కామెడీ ఎంటర్‌టైనర్ చిత్రం ‘రాబిన్‌హుడ్’. నితిన్‌తో ఇంతకు ముందు ‘భీష్మ’ వంటి బ్లాక్‌బస్టర్ చిత్రాన్ని తెరకెక్కించిన వెంకీ కుడుముల దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ చిత్రంలో నట కిరీటి రాజేంద్రప్రసాద్ ఓ కీలక పాత్రలో నటించారు. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై మంచి క్రేజ్‌ని పెంచేసింది. మార్చి 28న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతోన్న ఈ చిత్ర ప్రమోషన్స్‌ విషయంలో మేకర్స్ స్పీడ్ పెంచారు. ఈ నేపధ్యంలో నటకిరీటి రాజేంద్రప్రసాద్, మీడియాకు చిత్ర విశేషాలను తెలియజేశారు. ఆయన మాట్లాడుతూ..

‘‘నేను సినిమా ఇండస్ట్రీకి వచ్చి 48 ఏళ్లు అయ్యింది. ‘రాబిన్‌హుడ్’ సినిమా చేశాక యాక్టర్‌గా నామీద నాకు కాన్ఫిడెన్స్ లెవల్ పెరిగిందని చెప్పగలను. ఈ సినిమా చూసిన అందరికీ నేను హీరోగా చేసిన ఎంటర్‌టైనింగ్ సినిమాలు, ఆనాటి రోజులు గుర్తుకు వస్తాయి. ఇందులో నా పాత్ర చాలా ఎంటర్‌టైనింగ్‌గా ఉంటుంది. దర్శకుడు వెంకీ అద్భుతంగా ఈ సినిమాను రాశాడు, అలాగే తీశాడు. నేను హీరోగా నటించిన పాత రోజులను మళ్లీ నాకు గుర్తు చేసిందీ చిత్రం. ఈ సినిమాలో నేను చేసిన పాత్ర పట్ల చాలా హ్యాపీగా వున్నాను. హీరో నితిన్ నా దగ్గర పని చేయడానికి వస్తాడు. మా కాంబినేషన్ హిలేరియస్‌గా ఉంటుంది. ఇందులో మేమిద్దం ఒకరి టైమింగ్‌ని మరొకరు ఫాలో అవ్వాల్సి ఉంటుంది. మేమిద్దరం వెన్నెల కిశోర్‌కి దొరక కూడదు. సినిమా చూస్తున్న ప్రతి ఒక్కరికీ భలే గమ్మత్తుగా అనిపిస్తుంది. ఇలాంటి ఎంటర్‌టైనర్ సినిమా చేసి చాలా కాలమైంది. ‘రాబిన్‌హుడ్’ సినిమా ప్ర్రేక్షకులకు ఒక ఫీస్ట్‌లా ఉంటుంది. ‘జులాయి’ సినిమా నుంచి ఎన్నో వంద కోట్లు దాటిన కమర్షియల్ సినిమాలలో చేశా. ‘రాబిన్‌హుడ్‌’తో స్టేచర్ కూడా మారబోతోంది.

ఈ మధ్య కాలంలో వన్ ఆఫ్ ది బెస్ట్ క్యారెక్టర్ ‘రాబిన్‌హుడ్’ సినిమాలో చేశాను. డైరెక్టర్ వెంకీ చాలా స్పెషల్‌గా నా పాత్రని డిజైన్ చేశారు. అతను ముందు ముందు చాలా పెద్ద డైరెక్టర్ అవుతాడు. వర్క్ చేస్తూ, చాలా ఎంజాయ్ చేశాను. త్రివిక్రమ్ దగ్గర వెంకీ అసిస్టెంట్‌గా చేశారు. ఆయన లక్షణాలన్నీ వెంకీకి వచ్చాయి. డైలాగ్‌లో మంచి పంచ్ వుంటుంది. అలాగే అతను కథ చెప్పినప్పుడు చాలా ఎంజాయ్ చేశాను. ఇటీవల నేను చేసిన ‘జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి, నాన్నకు ప్రేమతో, శ్రీమంతుడు, ఎఫ్2’ చిత్రాలను, అందులో నేను చేసిన పాత్రలను ఎలా అయితే గుర్తుపెట్టుకున్నారో, ఈ ‘రాబిన్‌హుడ్’లో చేసిన పాత్ర కూడా అలాగే గుర్తుపెట్టుకునే పాత్ర అవుతుంది. నటుడిగా ఈ జీవితాన్ని నాకు దేవుడు, ప్రేక్షకులు ఇచ్చిన గొప్ప అవకాశంగా భావిస్తున్నాను. నేను హీరోగా చేసిన ప్రతి చిత్రం దేనికదే భిన్నంగా వుంటుంది. ఎన్నో వైవిధ్యభరితమైన పాత్రల్లో నటించాను. ఒకే ఏడాది నేను హీరోగా చేసిన దాదాపు 12 సినిమాలు రిలీజైన రోజులున్నాయి. నాటి ప్రధాని పీవీ నరసింహారావు దగ్గర నుంచి ఇప్పటికీ చాలా మంది ప్రేక్షకులు జీవితంలో ఒత్తిడి, నిరాశలో వున్నప్పుడు సరదాగా నవ్వుకోవడానికి, మనసు తేలిక చేసుకోవడానికి నా సినిమాలు చూస్తుంటామని చెప్పడం ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. ఇప్పటికీ దర్శకులు నా కోసం ప్రత్యేకంగా పాత్రలు రాస్తున్నారంటే అది నాకు దేవుడు ఇచ్చిన అదృష్టం.

Also Read: బ్రేకింగ్ న్యూస్... సూసైడ్ అటెంప్ట్ చేసిన సింగర్ కల్పనా రాఘవేందర్

హీరోయిన్ శ్రీలీల కూడా ఇందులో చాలా మెచ్యూర్డ్ యాక్టర్‌గా నటించింది. ఆమె బిహేవియర్ నాకు ఎంతగానో నచ్చింది. తనకి సెక్యురిటీ ఇచ్చే బాధ్యత మాకు వస్తుంది. చాలా సరదాగా వుంటాయి ఆ సన్నివేశాలు. మైత్రీ మూవీ మేకర్స్‌తో నా అనుబంధం ‘శ్రీమంతుడు’తో మొదలైంది. సినిమా అంటే చాలా ప్యాషన్ వున్న నిర్మాతలు వారు. అలాంటి వారితో కలిసి పని చేయడం గ్రేట్ ఎక్స్‌పీరియెన్స్. ప్రస్తుతం చాలా సినిమాలు చేస్తున్నాను. అందులో ఏడు రన్నింగ్‌లో ఉన్నాయి. నాకు దర్శకులతో చాలా కంఫర్టబుల్‌గా ఉంటుంది. కొత్త, పాత అనే తేడాలుండవు. దర్శకులందరూ నాతో వర్క్ చేయడానికి చాలా ఇష్టపడతారు. వారికి ఎలాంటి భయం లేకుండా చేయడానికి నేనే సెట్స్‌లో తెగ అల్లరి చేస్తుంటాను. దీంతో అందరూ నార్మల్ అయిపోతారు. అప్పుడు నాతో వర్క్ చేయడం వారందరికీ ఈజీ అవుతుంది’’ అని నటకిరీటీ చెప్పుకొచ్చారు.

Also Read: కోలీవుడ్ హీరో కార్తీకి గాయాలు... 'సర్దార్ 2' సెట్స్‌లో మరోసారి ప్రమాదం