Rajamouli Remuneration For Varanasi Movie : యావత్ సినీ ప్రపంచం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోన్న పాన్ వరల్డ్ సూపర్ అడ్వెంచరస్ థ్రిల్లర్ 'వారణాసి'. దర్శక ధీరుడు రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబోలో రాబోతోన్న ఈ విజువల్ వండర్‌ గురించి రీసెంట్‌గా హాలీవుడ్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇంట్రెస్టింగ్ విషయాలు షేర్ చేసుకుంది మూవీ టీం. మొదటి నుంచి ఈ సినిమా బడ్జెట్, డైరెక్టర్, నటీనటుల రెమ్యునరేషన్‌పై హైప్ క్రియేట్ అవుతున్న సంగతి తెలిసిందే. తాజాగా వీరి రెమ్యునరేషన్స్‌పై మరో క్రేజీ బజ్ వైరల్ అవుతోంది.

రాజమౌళి రెమ్యునరేషన్ ఎంతంటే?

గత ప్రాజెక్టుల పరంగా చూస్తే రాజమౌళి ఏ సినిమా చేసిన ఫ్యామిలీ అంతా వర్క్ చేస్తుంది. ఈ క్రమంలో రెమ్యునరేషన్ ప్యాకేజీ కిందే తీసుకుంటారు. నెలకు ఇంతని జీతంతో పాటు మూవీ రిలీజ్ తర్వాత వచ్చే లాభాల్లో 50 శాతం వాటా తీసుకోవడం ఆయనకు అలవాటు. అయితే, 'వారణాసి' సినిమా కోసం మాత్రం పద్ధతి కొంచెం మార్చారట జక్కన్న. ఈ మూవీ రెమ్యునరేషన్ కింద మొత్తం ఓవర్సీస్ రైట్స్ తీసుకున్నారనే టాక్ వినిపిస్తోంది. వీటి విలువ దాదాపు రూ.160 కోట్లకు పైమాటే ఉంటుందని ఆయన టీంతో పాటు సినీ వర్గాలు చెబుతున్న మాట. మరి దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది.

Also Read : బన్నీ మూవీలో నేషనల్ క్రష్! - సైన్స్ ఫిక్షన్ ప్రాజెక్టులో ఆమె రోల్ ఏంటో తెలుసా?