'సంక్రాంతికి వస్తున్నాం' సినిమా పబ్లిసిటీలో భాగంగా దర్శకుడు అనిల్ రావిపూడి చాలా స్కిట్స్ చేశారు. హీరోయిన్లు ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరితో కలిసి స్పెషల్ వీడియోస్ చేశారు. ఆయన పబ్లిసిటీ చూసి టాలీవుడ్ సెలబ్రిటీలు అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అనిల్ రావిపూడి అంత కాదు గాని... 'విక్రమార్కుడు' విడుదలైన టైంలో దర్శక ధీరుడు రాజమౌళి (SS Rajamouli) కూడా యాక్టింగ్ చేశారు. అందులో స్టార్ యాంకర్ రష్మీ గౌతమ్ (Rashmi Gautam) ఆయనకు ప్రపోజ్ చేశారు. ఇప్పుడు ఆ వీడియో వైరల్ అవుతోంది.

రాజమౌళి గారు... రష్మితో మీరెప్పుడు నటించారు!?
రాజమౌళి ఈతరం ప్రేక్షకులకు 'ఈగ', 'బాహుబలి', 'ఆర్ఆర్ఆర్: రౌద్రం రణం రుధిరం' సినిమాల దర్శకుడిగా ఎక్కువ తెలుసు. ముఖ్యంగా సోషల్ మీడియా యువతకు ఈ సినిమాలు బాగా పరిచయం.‌ కానీ వీటికి ముందు ఆయన 'స్టూడెంట్ నంబర్ వన్', 'విక్రమార్కుడు', 'మగధీర', 'మర్యాద రామన్న' వంటి సినిమాలు కూడా తీశారు. ముఖ్యంగా 'విక్రమార్కుడు' సినిమా విడుదల సమయంలో ఆయన ఒక టీవీ సిరీయల్‌లో యాక్ట్ చేశారు.

రష్మీ గౌతమ్ స్టార్ యాంకర్ కాకముందు, సినిమాల్లో కొన్ని క్యారెక్టర్లు చేసిన సంగతి తెలిసిందే. అప్పట్లో ఆవిడ ఒక 'యువ' సీరియల్ కూడా చేశారు. అందులో దర్శక ధీరుడు రాజమౌళి అతిథి పాత్ర చేశారు. రియల్ లైఫ్ క్యారెక్టర్ చేశారు. రాజమౌళి మీద మనసు పారేసుకునే అమ్మాయిగా, ఆయనకు ప్రపోజ్ చేసే యువతిగా రష్మీ గౌతమ్ మీద సీన్లు తీశారు. ఇప్పుడు వైరల్ అవుతున్నది అదే. ఇది చూసిన ఈతరం నెటిజనులు 'రాజమౌళి గారూ... మీరెప్పుడు రష్మీతో నటించారు. ఆవిడ మీకు ఎప్పుడు లైన్ వేసింది?' అని సరదాగా కామెంట్ చేస్తున్నారు. అదీ సంగతి. రష్మి గౌతమ్ 'జింతాత జింతాత' పాటకు స్టెప్పులు వేసిన ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Also Read: మెగాస్టార్ సినిమాకు భారీ రెమ్యూనరేషన్ తీసుకుంటున్న అనిల్ రావిపూడి... బిగ్ లీగ్‌లో చేరినట్టేనా?

Whatttt!!! Rajamouli and rashmi ideppudu jarigindi 😭 pic.twitter.com/nHM2LwyuCI

— EpicCommentsTelugu (@EpicCmntsTelugu) February 18, 2025

మహేష్ బాబు సినిమా చిత్రీకరణలో రాజమౌళి!
రష్మితో రాజమౌళి వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయింది. అయితే ఇప్పుడు దీనిని పట్టించుకునే పరిస్థితుల్లో ఆయన లేరు. సూపర్ స్టార్ మహేష్ బాబు కథానాయకుడిగా దర్శకత్వం వహిస్తున్న పాన్ వరల్డ్ సినిమా చిత్రీకరణలో బిజీగా ఉన్నారు.

మహేష్ బాబు, రాజమౌళి కలయికలో రూపొందుతున్న సినిమా‌‌ షూట్ గత కొన్ని రోజులగా హైదరాబాద్ నగరంలో జరుగుతోంది. మధ్యలో తమ్ముడు సిద్ధార్థ్ పెళ్లి కోసం ప్రియాంక చోప్రా కొన్ని రోజులు చిత్రీకరణకు బ్రేక్ ఇచ్చారు. మహేష్ రాజమౌళి మాత్రం రెస్ట్ తీసుకోలేదు. వరుసగా సినిమా చిత్రీకరణ చేస్తూనే ఉన్నారు.

Also Read: సందీప్ కిషన్ 'మజాకా' ఓటీటీ డీల్ క్లోజ్... థియేటర్లలో విడుదలైన నాలుగు వారాలకు ఆ డిజిటల్ ప్లాట్‌ఫార్మ్‌లో స్ట్రీమింగ్?

'బాహుబలి', 'ఆర్ఆర్ఆర్" రౌద్రం రణం రుధిరం' సినిమాలకు అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలు లభించిన నేపథ్యంలో అన్ని వర్గాల, అన్ని దేశాల ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకొని రాజమౌళి ఈ సినిమా తెరకెక్కిస్తున్నారు. దుర్గా ఆర్ట్స్ పతాకం మీద కెఎల్ నారాయణ ఈ సినిమా ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఇందులో ప్రియాంక చోప్రా విలన్ రోల్ చేస్తున్నారని, మహేష్ సరసన మరొక హీరోయిన్ సందడి చేస్తారని తెలిసింది.