Sangeeth Shobhan's Raakaasa TV Premiere Details : టాలీవుడ్ యంగ్ హీరో సంగీత్ శోభన్, నయన్ సారిక జంటగా నటించిన హారర్ ఫాంటసీ రాకాస. మెగా డాటర్ నిహారిక కొణిదెల నిర్మించిన ఈ సినిమా... ఏప్రిల్ 3న ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్‌గా నిలిచింది. వరల్డ్ వైడ్‌గా బాక్సాఫీస్ వద్ద రూ.30 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించింది. ఆ తర్వాత ఓటీటీలోనూ అంతే స్థాయిలో సూపర్ రెస్పాన్స్ అందుకుని టాప్ ట్రెండింగ్‌లో నిలిచింది. ఇప్పుడు బుల్లితెరపై సందడి చేసేందుకు రెడీ అవుతోంది.

వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్‌గా...

'రాకాస' వరల్డ్ టెలివిజన్ ప్రీమయర్‌గా మీ 'జీ తెలుగు' (Zee Telugu) ఛానల్‌లో జులై 26 (ఆదివారం) సాయంత్రం 6 గంటలకు టెలికాస్ట్ కానుంది. దీనిపై సోషల్ మీడియా వేదికగా అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చింది. ఇప్పటికే ఇంటర్నేషనల్ ఓటీటీ 'నెట్ ఫ్లిక్స్' (Netflix)లో తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇప్పుడు బుల్లితెరపైనా సందడి చేయనుంది.

ఈ మూవీకి మానస శర్మ దర్శకత్వం వహించగా... సంగీత్ శోభన్ సరసన నయన్ సారిక హీరోయిన్‌గా నటించారు. అలాగే, తనికెళ్ల భరణి, వెన్నెల కిశోర్, గెటప్ శ్రీను, బ్రహ్మాజీ, ఆశిష్ విద్యార్థి, అన్నపూర్ణ, అమన్, అనూప్ సింగ్ ఠాకూర్, జబర్దస్త్ ఫేం రోహిణి, 90s ఫేం రోహన్, వాసు యింటూరి తదితరులు కీలకపాత్రలు పోషించారు. జీ స్టూడియోస్ సమర్పణలో పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్‌పై ఉమేష్ కుమార్ బన్సల్‌తో కలిసి నిహారిక కొణిదెల నిర్మించారు.

Just 3 Days To Go 🔥

Don't miss World Television Premiere #RaaKaasa On 26th July, Sunday @ 6PM on #ZeeTelugu#RaakaasaOnZeeTelugu #ZeeTeluguSpotlight @UrsNayan @PinkElephant_P #SangeethShoban pic.twitter.com/MGHCqCS678

— ZEE TELUGU (@ZeeTVTelugu) July 23, 2026

Also Read : Jana Nayakudu Review - 'జన నాయకుడు' రివ్యూ: 'భగవంత్ కేసరి' రీమేకేనా? విజయ్ సినిమా ఎలా ఉందంటే?