Digital Asset Management Planning: నేటి డిజిటల్ ప్రపంచంలో సోషల్ మీడియా ఖాతాలు, ఆన్‌లైన్ బ్యాంక్ ఖాతాలు వంటి డిజిటల్ ఆస్తులు చాలా కీలకంగా మారాయి. టెక్నాలజీ ఎంత అందుబాటులోకి వచ్చినా & ఆర్థిక అక్ష్యరాస్యత పెంచడానికి ఎన్ని ప్రయత్నాలు జరుగుతున్నా, చాలా మంది వ్యక్తులు ఆస్తి నిర్వహణ ప్రణాళిక (Property Management Plan)ను పట్టించుకోవడం లేదు. ఫలితంగా, ఆ వ్యక్తి మరణించిన తర్వాత కుటుంబ సభ్యులు & సన్నిహితులు కీలక సమాచారం పొందడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

డిజిటల్ ఆస్తుల ప్రణాళిక ఎందకు అవసరం?
డబ్బు, భూములు, భవనాలు, బంగారం తరహాలోనే డిజిటల్ ఆస్తుల కోసం కూడా వీలునామా రాయాల్సిన అవసరం ఉంది. తద్వారా, ఆ వ్యక్తి మరణం తర్వాత వాటి బదిలీ విషయంలో ఎటువంటి సమస్య ఉండదు. ఏదైనా ముఖ్యమైన డేటా ఉంటే, అది కూడా ధ్వంసం కాదు, కుటుంబ సభ్యులకు తెలుస్తుంది. ఎన్‌క్రిప్షన్, బలమైన పాస్‌వర్డ్‌లు, టు-ఫ్యాక్టర్‌ అథెంటికేషన్‌ (రెండు-దశల ధృవీకరణ) వంటి అధునాతన సాంకేతిక కవచాలతో డిజిటల్ ఆస్తులకు రక్షణ కల్పించవచ్చు.

ఆన్‌లైన్ ఖాతాలు, క్రిప్టో కరెన్సీలు, నాన్-ఫంజిబుల్ టోకెన్‌లు (NFTs) నుంచి ఫేస్‌బుక్ & ఇన్‌స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా ఖాతాల వరకు.. డిజిటల్ ఆస్తుల పూర్తి జాబితాను రూపొందించి, వ్యక్తి మరణించిన తర్వాత వాటిని ఎవరికి బదిలీ చేయాలనే విషయాలను వివరిస్తూ వీలునామా రాయాలి. దీనివల్ల, వ్యక్తి మరణానంతరం వాటిని నిర్వహించే బాధ్యత ఎవరికి ఇవ్వాలనేది చట్టబద్ధంగా నిర్ణయం అవుతుంది కాబట్టి, అసెట్‌ ప్లానింగ్‌ సమయంలో ఆ వ్యక్తులను బాధ్యతలు అప్పగించడం సులభమవుతుంది. అంతేకాదు, బాధ్యతల నుంచి ఆ వ్యక్తులను దూరంగా పెట్టడం కూడా జరగదు.

మరో ఆసక్తికర కథనం: కొత్త సంవత్సరంలో 20 సెలవులతో 60 హాలిడేస్‌ - అద్భుతమైన ప్లానింగ్‌ ఇదిగో!

ఎగ్జిక్యూటర్‌గా నమ్మకమైన వ్యక్తి
వార్మండ్ ఫిడ్యూషియరీ సర్వీసెస్ లిమిటెడ్ (Warmond Fiduciary Services Limited) CEO & మేనేజింగ్ డైరెక్టర్ అనురాధ షా చెబుతున్న ప్రకారం, "ఆస్తి నిర్వహణ కోసం వీలునామా రాసే సమయంలో ఒక ఎగ్జిక్యూటర్‌ను నామినేట్ చేయవచ్చు. ఎగ్జిక్యూటర్‌, ఆ వ్యక్తి మరణాంతరం ఆస్తుల నిర్వహణ బాధ్యతను తీసుకుంటారు. ఎగ్జిక్యూటర్ విశ్వసనీయంగా ఉండాలి & డిజిటల్ అసెట్ మేనేజ్‌మెంట్‌లోని చిక్కులను అర్థం చేసుకోవాలి. పాస్‌వర్డ్‌ల నుంచి రికవరీ వరకు ఈ వ్యక్తి తెలిసి ఉండాలి. తద్వారా, కీలకమైన డేటా ఎక్కడికీ పోదు, అవసరమైనప్పుడు సమయానికి అందుబాటులోకి వస్తుంది.

డిజిటల్ ఆస్తులను ట్రస్ట్ నిర్వహణ కింద ఉంచినప్పుడు, ట్రస్ట్ డీడ్‌లో పేర్కొన్న విధంగా ట్రస్టీ దానిని నిర్వహించాలి & రక్షించాలి. డిజిటల్ ఆస్తుల కోసం వీలునామా చేయడం చాలా ముఖ్యం, తద్వారా విలువైన సమాచారం తప్పుడు వ్యక్తుల చేతుల్లోకి వెళ్లకుండా రాకుండా ఉంటుంది. ఆ డేటా అవాంఛనీయ వ్యక్తులకు చిక్కితే దాని పర్యవసానాలను కుటుంబ సభ్యులు, సన్నిహితులు అనుభవించవలసి ఉంటుంది.

మరో ఆసక్తికర కథనం: తెలుగు రాష్ట్రాల్లో స్థిరంగా నగల రేట్లు - ఈ రోజు బంగారం, వెండి ధరలు ఇవి