Prema Entha Madhuram Serial Today Episode: శంకర్‌ ఒక్కడే కారులో ఆఫీసుకు వెళ్తుంటే రౌడీలు అడ్డగిస్తారు. శంకర్‌ కారు ఆపి రోడ్డు మధ్యలో కార్లు ఆపారు సెన్స్‌ లేదా అని అడుగుతాడు. మాకు లైసెన్సే లేదు సెన్స్‌ ఎక్కడి నుంచి వస్తుంది అంటారు. అయితే గొడవ పెట్టుకోవడానికే వచ్చారు. రండిరా అనగానే రౌడీలు అందరూ శంకర్‌ మీదకు వెళతారు. రౌడీలను పిచ్చకొట్టుడు కొడుతుంటాడు శంకర్‌. మరోవైపు శంకర్‌ కోసం జెండే, అభయ్‌, మాయ, రవి వస్తుంటారు. రౌడీలు పెద్ద కర్ర తీసుకుని శంకర్‌ తల మీద కొడతారు. ఇంతలో అభయ్‌ వాళ్లు వస్తారు. ఎవరు శంకర్‌ గారు వాళ్లు అని అభయ్‌ అడుగుతాడు.

శంకర్‌: ఎవరో తెలియదు అభయ్‌. రోడ్డులో సడెన్‌గా కారు ఆపి కొట్టడానికి వచ్చారు.

జెండే: ఇంకెవరు ఉంటారు ఆ రాకేష్‌ గాడే ఇలా చేసి ఉంటాడు

అభయ్‌: రాస్కెల్ చంపేయాలి వాణ్ని.

జెండే: అభయ్‌, శంకర్‌ను ఇంటికి తీసుకెళ్దాం పద..

శంకర్‌: వద్దు సార్‌ అభయ్‌కు ఆఫీసులో వర్క్‌ ఉంది కదా..? నేను వెళ్తాను. మీరు ఆఫీసుకు వెళ్లండి.

అభయ్‌: శంకర్‌ గారు మీకన్నా ఆఫీసు ఎక్కువ కాదు. ఫ్రెండ్‌ కారు తీయండి వెల్దాం.

రవి: అభయ్‌ మీరు ఆ కారులో వెళ్లండి మేము ఈ కారు తీసుకొస్తాం.

అభయ్‌: అలాగే రవి..

శంకర్‌ను తీసుకుని జెండే, అభయ్‌ వెళ్లిపోతారు.

రవి: చా మీ అన్నయ్య ఎందుకు ఇలా చేశాడు.

మాయ: యూస్‌లెస్‌ ఆలోచనలు చేస్తాడు కాబట్టే యూస్‌లెస్‌ రిజల్ట్‌ వస్తాయి.

రవి: ముందు కాల్‌ చేసి అడుగు మనం చూసుకుంటాం అని చెప్పాము కదా..?

మాయ: అయిపోయాడు ఇవాళ నా చేతిలో…

రాకేష్‌: హలో సిస్టర్‌ ఎనీ గుడ్‌ న్యూస్‌..

మాయ: షటప్‌.. శంకర్‌ సంగతి నేను చూసుకుంటానని చెప్పాను కదా..? నువ్వెందుకు అనవసరమైన ప్లాన్లు వేస్తున్నావు.

అని మాయ తిట్టగానే.. నేనే ప్లాన్లు చేయలేదు. ఏ రౌడీలను నేను పంపలేదు అంటాడు రాకేష్‌. నువ్వు డీల్‌ చేస్తా అన్న తర్వాత నేనెందుకు ప్లాన్‌ చేస్తాను. వాడే వంద మంది రౌడీలను పంపే రకం అని చెప్తాడు. ఇదంతా ఆ శంకర్‌ ప్లాన్‌ అని నీకు ఇంకా అర్థం కాలేదా..? ఆర్యవర్థన్‌ అంటేనే అంచనాలకు అందడు.. శంకర్‌ అంచనాలను తారుమారు చేస్తాడు. జాగ్రత్తగా ఉండండి అని చెప్తాడు రాకేష్‌. మరోవైపు ఇంటికి వచ్చిన శంకర్‌ ను చూసి గౌరి కంగారు పడుతుంది. హాస్పిటల్‌కు తీసుకెళ్లకుండా ఇంటికి ఎందుకు వచ్చారని అభయ్‌, జెండేల మీద అరుస్తుంది. దీంతో అసలు మీరు గౌరి గారేనా అని శంకర్‌ అనుమానంగా అడుగుతాడు. గౌరి, అభయ్‌, జెండే, అకి, యాదగిరి షాక్‌ అవుతారు. అందరూ కలిసి శంకర్‌ను రూంకి తీసుకెళ్తారు.

గౌరి: సార్‌ ఇప్పుడు మీకు కంఫర్ట్‌ గానే ఉంది కదా…

శంకర్‌: నా కంఫర్ట్‌ గురించి మీరు ఎందుకు ఇంత టెన్షన్‌ పడుతున్నారో నాకు అర్థం అయిపోయింది. నేను మిమ్మల్ని కిడ్నాప్‌ చేసిన వాళ్ల నుంచి కాపాడాను కాబట్టి. అంతే కదా..?

గౌరి: ఏం లేదు సార్‌ నేను వెళ్లి మీకు జ్యూస్‌ తీసుకొస్తాను.

శంకర్‌: జెండే సార్‌ గౌరి గారు చాలా మారిపోయారు. కారణం ఏమై ఉంటుంది.

జెండే: కొన్ని మార్పులకు కారణం ఉండదు శంకర్‌. కాలమే అన్నింటినీ మారుస్తుంది. అకి, అభయ్‌ జాగ్రత్తగా చూసుకోండి.

అని చెప్తూ.. కిచెన్‌ లోకి వెళ్లగానే.. అక్కడ గౌరి ఏడుస్తుంది. జెండే, యాదగిరి.. గౌరిని ఓదారుస్తారు. తర్వాత మాయ, రవి వచ్చి శంకర్‌ను తిడతారు. ఇంతలో జెండే వచ్చి మాయను తిడతాడు. దీంతో ఆ రౌడీలను సెట్‌ చేసింది ఈ శంకరే అంటుంది. జెండే అడగ్గానే ఈ హోల్‌ సీన్‌కు శంకరే డైరెక్టర్‌ అంటాడు. దీంతో అందరూ షాక్‌ అవుతారు. ఇంతలో కొండదేవర వచ్చి జోస్యం చెప్తుంటాడు. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!