Prema Entha Madhuram Serial Today Episode: ఎలా ఉన్నావు మాయ అని అడిగిన రాకేష్‌ చెంప పగులగొడుతుంది మాయ. నాన్న పగ తీరే టైం వచ్చిందని నేను ప్లాన్‌ చేసి నిన్ను ఇక్కడకు పంపిస్తే నువ్వు ఏం చేశావు అంటూ తిడుతుంది. తెలివిగా డీల్‌ చేస్తున్నాను అనుకుని దొరికిపోయావు. పెళ్లిలో కిడ్నాప్‌ ప్లాన్‌ ఫెయిల్‌ చేశావు. చివరికి నిన్ను కాపాడుకోవడానికి ఆ ఆర్యవర్ధన్‌ చేతిలో ఓడిపోయావు. నువ్వు తక్కువ అంచనా వేయడానికి అక్కడున్నది ఆర్డినరీ శంకర్‌ కాదు. ది గ్రేట్‌ ఆర్యవర్ధన్‌. అతన్ని తక్కు వ అంచనా వేయడం నీ తప్పు అంటుంది. తప్పు నాదే సారీ అని చెప్తాడు రాకేష్‌. మరోవైపు గౌరి తన చెల్లెళ్లతో మాట్లాడుతుంది.

గౌరి: నేను ఇక చనిపోయాను అనుకున్నాను. కానీ శంకర్‌ గారు కనిపించగానే పోయిన ప్రాణం లేచి వచ్చిందనుకోండి.. శంకర్‌ గారు లేకపోతే అసలు నేను లేను.

శ్రావణి: అక్కా నిజం చెప్పు.. నీకు శంకర్‌ గారు అంటే ఇష్టం కదా..?

సంధ్య: ఇష్టం అంటే ఇష్టం కాదు ప్రాణం..

శ్రావణి: అవునా అక్కా… మాకు అర్తం అయిపోయిందిలే.. అందుకే శంకర్‌ జపం చేస్తున్నావు.

గౌరి: చాల్లే ఊరుకోండి నన్ను ఆట పట్టించడం అలవాటై పోయింది మీకు.

సంధ్య: ఆట పట్టించడం కాదు అక్కా ఈ విషయం వెంటనే శంకర్‌ గారికి చెప్పు. లేదంటే మళ్లీ ఎవరైనా ఆ శంకర్‌ను తలుక్కుంటారు.

అని చెప్పగానే అలా ఏం లేదు మాది జన్మజన్మల బంధం అంటుంది. దీంతో శ్రావణి, సంధ్య ఏం మాట్లాడుతున్నావు అక్కా అని అడుగుతారు. దీంతో గౌరి వాళ్లకు నిజం చెప్తుంది. మాది జన్మజన్మల బంధం గత జన్మలో మేము అకి, అభయ్‌ లకు అమ్మానాన్నలం అని చెప్తుంది. అను, ఆర్య ఫోటోలు తీసుకొచ్చి వాళ్లకు చూపిస్తుంది. జరిగిన కథ మొత్తం చెప్తుంది. అందుకే అకి, అభయ్ మాకోసం అంతగా తపించారు నిజంగా ఈ జన్మ మాకో వరం అని చెప్తుంది. శంకర్‌ను బయటకు తీసుకెళ్లిన జెండే ఇక్కడ జరుగుతున్న విషయాలు ఎవరో మాయకు చెప్తున్నారు. అని వాళ్లు ఎవరో తెలుసుకోవాలని ప్లాన్‌ చేస్తారు జెండే, యాదగిరి, శంకర్‌. మరోవైపు మాయకు ఎవరో మెసేజ్‌ చేయగానే..

రాకేష్‌: నేను కాకుండా.. ఆ ఇంట్లో నీకు సపోర్టు చేసేవాళ్లను ఆల్‌ రెడీ సెట్‌ చేశావా…? ఎవరా పర్సన్‌.. అక్కడ అందరూ జెన్యూన్‌గా ఉంటారు. శంకర్‌ బ్రదర్సా..?

మాయ: నో..

రాకేష్‌: యాదగిరి ఆ ఇంటికి నమ్మిన బంటు.. జెండే పేరు అసలు ఆలోచించలేము.. గౌరి సిస్టర్సా..

మాయ: నో..

రాకేష్‌: మరి ఎవరు మాయ ఏకంగా శంకర్‌ నే ట్రాప్‌ చేశావా ఏంటి..? మాయ చెప్పు

మాయ: మీరెవరూ గెస్‌ చేయలేరు. నీ సుఖమే నే కోరుకున్నా నిను వీడి అందుకే వెళ్తున్నా అనే లెవల్‌ లో యాక్ట్‌ చేస్తాడు. వర్ధన్‌ ఫ్యామిలీ కోసం ఎంతవరకైనా త్యాగం చేసేలా నటించి ఆ ఇంటి అల్లుడైన రవి

రాకేష్‌: రవినా..?

మయ: నువ్వు ఎంత షాకైనా అదే నిజం బ్రదర్‌.

రాకేష్‌: ఓ మై గాడ్‌ ఇదంతా నిజమా..?

మాయ: అవును అతను ఆ ఇంటి అల్లుడు కాదు.. ఆ వర్ధన్‌ ఫ్యామిలీని నాశనం చేయడానికి నేను పంపిన ఆటంబాంబు. అభయ్‌ దగ్గర అవమానం ఎదుర్కోంటూనే తన తెలివైన నాటకం కొనసాగిస్తున్నాడు.

రాకేష్‌: కానీ అతన్ని ఎలా ట్రాప్‌ చేశావు.

మాయ: అతనికి ఫారిన్‌లో సెట్‌ అవ్వాలనే కోరిక ఉంది. అదే ఎరగా వేశా

రాకేష్‌: అంటే అతనికి అకి అంటే ప్రేమ లేదా..?

మాయ: అసలు లేదు. ఇప్పటికి ఇప్పుడు వదిలేయమన్నా వదిలేసి వస్తాడు. ఏంటి నమ్మకం లేదా..? జస్ట్‌ వెయిట్‌..

అంటూ రవికి ఫోన్‌ చేస్తుంది. రవి ఇంకెన్ని రోజులు నాకు ఈ డ్రామా నా క్యారెక్టర్‌ కు పులిస్టాప్‌ పెడితే నేను ప్యారిన్‌ వెళ్లి సెట్‌ అవుతాను అంటాడు. నెక్ట్స్‌ ఏం చేయాలో రవికి చెప్తుంది మాయ. ఫోన్‌ కట్‌ చేసిన తర్వాత రాకేష్‌ షాక్‌ అవుతాడు. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!