Prashant Kishor Donating All Assets: బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో జన్ సురాజ్ పార్టీ ఘోరంగా ఓడిపోవడతో ప్రశాంత్ కిషోర్ కలత చెందారు. మాజీ రాజకీయ వ్యూహకర్త అయిన ప్రశాంత్ కిషోర్ తన అన్ని ఆస్తులు దానం చేస్తానని భారీ ప్రకటన చేశారు. ఢిల్లీలోని తన కుటుంబ ఇల్లు తప్ప, గత 20 సంవత్సరాల్లో సంపాదించిన అన్ని ఆస్తులు పార్టీకి దానం చేస్తానని, తదుపరి 5 సంవత్సరాల్లో తన 90 శాతం ఆదాయం జన్ సురాజ్ పార్టీకే కేటాయిస్తానని ప్రకటించారు. గాంధీ ఆశ్రమంలో దీక్ష చేసిన తర్వాత మీడియాతో మాట్లాడిన కిషోర్, బిహార్ ప్రజలు ప్రతి సంవత్సరం రూ. 1,000 దానం చేయాలని పిలుపునిచ్చారు.

నవంబర్ 21న బిహార్‌లోని వెస్ట్ చంపారన్‌లోని భీతిహర్వా గాంధీ ఆశ్రమంలో రోజు మౌన వ్రతం నిర్వహించిన కిషోర్, ఆ తర్వాత ప్రెస్‌మీట్‌లో మాట్లాడారు. "బిహార్ నవనిర్మాణ్ సంకల్ప్ యాత్ర"ను జనవరి 15న ప్రారంభిస్తామని ప్రకటించారు. ఈ యాత్రలో పార్టీ కార్యకర్తలు, తాను కలిసి 15-18 నెలల్లో రాష్ట్రంలోని ప్రతి ఇంటికి చేరుకుని, ప్రభుత్వ నిర్వాకాలపై గురించి అవగాహన కల్పిస్తామని చెప్పారు. "జన్ సురాజ్ పార్టీ ఇకపై డబ్బు కొరతతో ఆగదు. తదుపరి 5 సంవత్సరాల్లో నా 90 శాతం ఆదాయం పార్టీకి దానం చేస్తాను. ఇల్లు తప్ప, గత 20 సంవత్సరాల్లో సంపాదించిన అన్ని ఆస్తులు పార్టీకి అందిస్తాను" అని కిషోర్ పేర్కొన్నారు.

జనసురాజ్ పార్టీ 238 సీట్లకు అభ్యర్థులను ప్రకటించినప్పటికీ ఒక్క సీట్ కూడా గెలవలేదు. కిషోర్ ఈ ఓటమికి పూర్తి బాధ్యత తీసుకున్నారు. నితీష్ కుమార్ క్యాబినెట్‌లో అవినీతి, క్రిమినల్స్ ఎక్కువగా ఉన్నారని, ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షా, సీఎం కుమార్ బిహార్‌పై ఆసక్తి లేదని విమర్శించారు. ఎన్నికల్లో ప్రశాంత్ కిషోర్ ఎనర్జిటిక్ క్యాంపెయిన్ నడిపినప్పటికీ, ఎన్‌డీఏ విజయం సాధించింది. ప్రశాంత్ కిషోర్ పార్టీ 243 సీట్లలో 238కు అభ్యర్థులు ఎదుర్కొన్నా, ఒక్క సీట్ కూడా గెలవలేకపోయింది. ఈ ఓటమి తర్వాత ఆయన గాంధీ ఆశ్రమంలో మౌన వ్రతం చేసి, పార్టీని మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తాని ప్రతిజ్ఞ చేశారు.

బిహార్ ప్రజలు ప్రతి సంవత్సరం రూ. 1,000 పార్టీకి దానం చేయాలని కోరారు. ఈ మొత్తం పార్టీ ఆర్థిక బలోపేతానికి ఉపయోగపడుతుందని, ఇది "మార్క్సిస్ట్-లెనినిస్ట్-మావోయిస్ట్" ఐడియాలజీలా కాకుండా, గాంధీవాద సహకార ఆధారంగా ఉంటుందని చెప్పారు. పార్టీ కార్యకర్తలు ప్రతి వార్డుకు చేరుకుని, స్థానిక సమస్యలు పరిష్కరిస్తారన్నారు.

Prashant Kishor : The Man of Legend

When a single man dedicates 90% of his lifetime earnings to a cause, it is not just a donation—it is a lifetime of sacrifice, hope, and vision. Prashant Kishor has done exactly this for Bihar. He gave up the comfort and security of his… pic.twitter.com/k09h7YDeZY

— EWS ARMY (@ews_army) November 22, 2025

ఈ ప్రకటన బిహార్ రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారి తీసింది. మాజీ పొలిటికల్ స్ట్రాటజిస్ట్‌గా ప్రసిద్ధి చెందిన కిషోర్, పార్టీని 2025 ఎన్నికల్లో లాంచ్ చేసి ఓటమి చవిచూపినా, తన వ్యక్తిగత ఆస్తులు దానం చేసే నిర్ణయం అతని కమిట్‌మెంట్‌ను చూపిస్తోందని అంటున్నారు.