Benefits of Empty Stomach and Post-Meal Walks : వాకింగ్ చేస్తే ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు అందుతాయి. ఈ విషయం అందరికీ తెలుసు. అయితే తినకముందు.. మార్నింగ్ వాకింగ్ చేస్తే మంచిదని కొందరు చెప్తుంటే.. లేదు లేదు తిన్న తర్వాత వాకింగ్ చేస్తే మంచిదని మరికొందరు చెప్తారు. మరి ఈ రెండిటీలో ఏది నిజం. తినకుండా పరగడుపున వాకింగ్ చేస్తే కలిగే లాభాలు ఏంటి? తిన్న తర్వాత వాకింగ్ చేస్తే కలిగే ప్రయోజనాలు ఏంటి?

రోజుకు కనీసం 30 నిమిషాలు వాకింగే చేస్తే చాలామంచిదని తాజా అధ్యయనం తెలిపింది. అయితే ఒకేసారి కాకపోయినా.. గ్యాప్ ఇచ్చి కూడా ఈ వాకింగ్ చేయవచ్చని సూచించింది. టైమ్ కాకుండా అడుగులను ట్రాక్ చేస్తుంటే కనీసం రోజుకు 2,000 నుంచి 8,000 అడుగులు వేయాలని సూచిస్తుంది. ఇలా రోజు నడవడం వల్ల గుండె జబ్బులు దూరమై, క్యాన్సర్ వంటి సమస్యలు పది శాతం తగ్గుతాయని తెలిపింది.

తినకుండా వాకింగ్ చేస్తే..

మెటబాలీజం పెరుగుతుంది : ఉదయాన్నే తినకుండా వాకింగ్ చేస్తే మెటబాలీజం పెరుగుతుంది. ఇది కొవ్వును కరిగించడంలో హెల్ప్ చేస్తుంది. మెటబాలీజం స్లోగా ఉంటే.. బరువు తగ్గడం కష్టమవుతుంది. అలాగే శరీరం పోషకాలను సమర్థవంతంగా ఉపయోగించుకోవడంలో హెల్ప్ చేస్తుంది.

ఎనర్జీని ఇస్తుంది : జీవక్రియ మెరుగైతే.. రోజంతా ఎనర్జీటిక్గా ఉంటారు. ఇది మీ సామర్థ్యాన్ని పెంచడంలో హెల్ప్ చేస్తుంది. దీనివల్ల మీరు వర్క్ని తొందరగా చేసుకోగలుగుతారు. నడక వల్ల శరీరంలో రక్తప్రసరణను పెంచుతుంది. దీనివల్ల మీరు రిఫ్రెష్గా ఉంటారు. అలసట దూరమవుతుంది.

బరువు తగ్గడంలో : ఉదయాన్నే వేగంగా వాకింగ్ చేస్తే.. బరువు, కొవ్వు వేగంగా కరుగుతుంది. ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ ఒబెసిటీ ప్రకారం.. మార్నింగ్ వాకింగ్ కొవ్వు కణజాలాన్ని తగ్గిస్తుందని.. పొట్టను తగ్గించడంలో హెల్ప్ చేస్తుంది. 12-16 వారాలు కంటిన్యూగా చేస్తే శరీరంలో మార్పులు మీరే చూడొచ్చని చెప్తున్నారు. ఖాళీ కడుపుతో వాకింగ్ చేస్తే 70 శాతం కొవ్వు తగ్గిపోతుందట. దీనివల్ల గుండె ఆరోగ్యం కూడా మెరుగవుతుంది. ఉదయాన్నే ఎండలో నడుస్తే శరీరానికి విటమిన్ డి అందుతుంది. దీనివల్ల బోన్స్కి కూడా హెల్ప్ అవుతుంది.

తిన్న తర్వాత వాకింగ్ చేస్తే..

జీర్ణక్రియ మెరుగవుతుంది : తిన్న తర్వాత వాకింగ్ చేస్తే.. జీర్ణక్రియ మెరుగవుతుంది. కడుపు ఉబ్బరం, మలబద్ధకం వంటి సమస్యలు తగ్గుతాయి. ఎసిడిటీ సమస్యలు దూరమవుతాయి.

గుండె సమస్యలు దూరం : రక్తపోటు తగ్గుతుంది. శ్వాసకోశ సమస్యలు కంట్రోల్లో ఉంటాయి. టైప్ 2 డయాబెటిస్ సమస్యలను తగ్గించుకోవడంలో హెల్ప్ చేస్తుంది. బ్లడ్లో షుగర్ లెవల్స్ని కంట్రోల్ చేస్తాయి. ముఖ్యంగా గుండె సమస్యలు వంటి దీర్ఘకాలిక వ్యాధులను దూరం చేస్తాయి.

కాబట్టి తిని నడిచినా.. తినకుండా నడిచినా ఆరోగ్య ప్రయోజనాలు శరీరానికి అందుతాయి. అయితే మీరు నడవాలి అనుకుంటే తినకుండా కొంత సేపు నడిచి.. తిన్న తర్వాత కూడా కాసేపు నడుస్తూ ఉంటే మంచి ఫలితాలను పొందవచ్చు.

Also Read : మూడేళ్లలో 32 కిలోలు తగ్గిన సీనియర్ హీరోయిన్.. కుష్బూ వెయిట్ లాస్ జర్నీ ఇదే

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.