Ponguleti Srinivas Reddy on 22A Lands: రబ్బరు చెప్పులతో వచ్చి వేల కోట్లు సంపాదించలేదు.. 22ఏ భూముల వివాదంపై పొంగులేటి కీలక వ్యాఖ్యలు
2 months ago 3
ARTICLE AD
22A Land Registrations | హైదరాబాద్: 22ఏ నిషేధిత భూముల జాబితాలో అధికారుల పొరపాట్ల వల్ల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారని, అయితే ఈ సమస్యను ప్రభుత్వం ఇప్పటికే పరిష్కరిస్తోందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఈ జాబితాలోని 5కి పైగా భూముల రిజిస్ట్రేషన్లు నిన్న పూర్తయ్యాయని తెలిపారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని పలు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలను స్వయంగా సందర్శించి క్షేత్రస్థాయిలో సమస్యలను అర్థం చేసుకుంటామన్నారు. ఈ అంశంపై అధికారులతో ప్రత్యేక కమిటీ వేశామని, ఈ నెలాఖరు నాటికి 22ఏ సమస్యను పూర్తిగా పరిష్కరిస్తామని, ప్రజలు ఎలాంటి ఆందోళన చెందవద్దని హామీ ఇచ్చారు.
రబ్బరు చెప్పులతో వచ్చి సంపాదించినవాడ్ని కాదు
పదేళ్లు అధికారంలో ఉన్న హరీష్ రావు 30% కమిషన్ల వ్యవహారాన్ని ఇంకా మర్చిపోలేదని, కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయినప్పుడు ఆయన ఎందుకు బాధ్యత తీసుకోలేదని మంత్రి పొంగులేటి ప్రశ్నించారు. అబద్ధాలతో అధికారంలోకి రావాలనుకుంటున్న అగ్గిపెట్టె రావు కల ఎప్పటికీ పగటికలగానే మిగిలిపోవడం ఖాయమంటూ ఎద్దేవా చేశారు. తాను బాధ్యతగల మంత్రిగా సమస్యలను పరిష్కరిస్తున్నానని స్పష్టం చేశారు. బీజేపీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి తాటాకు చప్పుళ్లకు భయపడేది లేదని, ఆయన వద్ద ఏవైనా ఆధారాలు ఉంటే బయటపెట్టాలని ఛాలెంజ్ చేశారు. ఫీనిక్స్, రాఘవ కంపెనీల మధ్య వ్యాపార లావాదేవీలు సాధారణంగానే జరుగుతాయని పేర్కొన్నారు. తాను 20 ఏళ్లుగా వ్యాపార రంగంలో ఉంటూ అంచలంచెలుగా ఎదుగుతూ మంత్రి స్థాయికి వచ్చానని, రబ్బరు చెప్పులతో వచ్చి వేల కోట్లు సంపాదించలేదని వ్యాఖ్యానించారు.
ఒక చిన్నఅప్లికేషన్ ఇస్తే చాలు న్యాయబద్దంగా ఉంటే, 
ప్రైవేటు ఆస్తి 22Aలో ఉంటే క్లియర్ చేపించే బాధ్యత మాది.. 
-నిషేధిత భూముల అంశంపై సమీక్ష అనంతరం మీడియా సమావేశంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు#Adminpost@TelanganaCMO pic.twitter.com/csIySvUn3q
 — Ponguleti Srinivasa Reddy (@INC_Ponguleti) August 17, 2026
22 ఏ భూముల వివాదం ఏంటీ..
రిజిస్ట్రేషన్ చట్టం 1908 లోని సెక్షన్ 22A ప్రకారం ప్రభుత్వం, దేవాదాయ, వక్ఫ్, ప్రభుత్వ పోరంబోకు, అసైన్డ్ భూముల క్రయవిక్రయాలను నిషేధిత జాబితాలో ఉంచుతారు. అయితే, తెలంగాణలో ధరణి పోర్టల్, అధికారుల రికార్డుల నమోదు పొరపాట్ల కారణంగా వేలాది మంది రైతులు, పట్టణ యజమానుల పట్టా భూములు, ప్రైవేటు ఆస్తులు కూడా పొరపాటున ఈ 22A నిషేధిత జాబితాలోకి వెళ్లాయి. దీనివల్ల బాధితులు తమ ఆస్తులను అమ్ముకోలేక, బ్యాంకు రుణాలు పొందలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసి, నిషేధిత జాబితాను సమీక్షిస్తూ అర్హులైన ప్రైవేటు భూములను 22A నుండి తొలగించి రిజిస్ట్రేషన్లకు అనుమతిస్తోంది. ప్రజలు ఆందోళన చెందవద్దని, సాధ్యమైనంత త్వరగా వీటికి పరిష్కారం చూపిస్తామని ప్రభుత్వం చెబుతోంది.
Read Entire Article