Podharillu Serial Today January 8th: ప్రతాప్‌ మనుషులకు మహా,చక్రి దొరికిపోయారా..? మహా వెళ్లిపోవడంతో ఇప్పుడు భూషణ్ పరిస్థితి ఏంటి..?

3 months ago 8
ARTICLE AD
<p><strong>Podharillu Serial Today Episode</strong>: మహా ఇంట్లో నుంచి వెళ్లిపోవడంతో కుటుంబ సభ్యులంతాఎంతో కంగారుపడుతుంటారు. చక్రి కూడా లేకపోవడంతో వాడే మహాను తీసుకెళ్లి ఉంటాడని అనుకుంటారు. ఇంతలో ప్రతాప్&zwnj;,ఆది ఫోన్లు లిప్ట్ చేయకపోయేసరికి భూషణ్&zwnj; నేరుగా ప్రతాప్&zwnj; వాళ్ల ఇంటికి వచ్చేస్తాడు. మహా ఎక్కడని నిలదీస్తాడు.అసలు ఇంట్లో ఉందా లేక ఎవరితోనో వెళ్లిపోయిందా అంటూ ప్రశ్నిస్తాడు. భూషణ్ మాటలకు నిహారికకు కోపం వస్తుంది..నోరు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని హెచ్చరిస్తుంది.అసలు నీ టార్చర్&zwnj; భరించలేకే మహా ఇల్లు వదిలి వెళ్లిపోయిందని....చదవుకున్న అమ్మాయతో ఎలా బిహేవ్&zwnj; చేయాలో కూడా నీకు తెలియదని అంటుంది. ఎవరైనా ఫోన్ లిప్ట్&zwnj; చేయకపోతే అర్థరాత్రి 200సార్లు మిస్&zwnj;కాల్&zwnj; ఇస్తారా అంటూ నిలదీస్తుంది. దీనికి భూషణ్&zwnj; మరింత మండిపడిపోతాడు. రేపు పెళ్లిపెట్టుకుని ఇవాళ ఇల్లు వదిలిపెట్టి వెళ్లిన దానిని వెనకేసుకుని వస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తాడు. మీరు ఏం చేస్తారా నాకు తెలియదని...తెల్లారేసరికి అమ్మాయి పెళ్లిమండపంలో ఉండాలని భూషణ్ అంటాడు. దీనికి ప్రతాప్&zwnj; కూడా సమాధానమిస్తాడు. పెళ్లి ఆగిపోయిందంటే నా ఇంటిపరువు కూడా పోతుందని....కాబట్టి ఎట్టిపరిస్థితుల్లో తెల్లారేసరికి మహాను ఇంటికి తీసుకొస్తామంటూ బయలుదేరతారు.వారి వెంట భూషణ్&zwnj; కూడా వెళ్తాడు.<br />&nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; కారులో వెళ్తూ మరోసారి ఫోన్&zwnj;లో సీసీకెమెరా ఫుటేజ్&zwnj; చూస్తారు ప్రతాప్&zwnj;. కెమెరాలు ఆపకముందు ఉన్న వీడీయోచూసి ఆశ్చర్యపోతారు. మహా ఇంట్లో నుంచి సూటుకేసు తీసుకుని వచ్చి చక్రికి ఇవ్వడం చూసి భూషణ్ మరింత రెచ్చిపోతాడు. మీ అమ్మాయి డ్రైవర్&zwnj;తో లేచిపోయిందని అనడంతో ప్రతాప్&zwnj;కు కోపం వస్తుంది. మర్యాదగా మాట్లాడకుంటే ఏం చేస్తానో నాకే తెలియదని అంటాడు. నీతో పెళ్లి ఇష్టం లేదని నా కూతురు మొదటి నుంచి చెబుతూనే ఉందని...మేమే బలవంతంగా ఆమెను పెళ్లికి ఒప్పించామని అంటాడు. పెళ్లి ఇష్టం లేక డ్రైవర్&zwnj; హెల్ఫ్&zwnj; తీసుకుని వెళ్లిపోయిందని...నువ్వు నోటికొచ్చినట్లు &nbsp;మాట్లాడితే సహించేది లేదని చెబుతాడు. దీంతో భూషణ్ మరింత వాదిస్తాడు. డ్రైవర్&zwnj;తో లవ్&zwnj;లో ఉందని తెలసి..తొందరపడి నాకు ఇచ్చి పెళ్లి చేస్తున్నారా అని అంటాడు. అసలు ఎప్పటి నుంచి ఈ వ్యవహారం సాగుతోందని అంటాడు. ఇంతలో ప్రతాప్&zwnj; వాళ్ల మనుషులకు ఫోన్ చేసి మహాను వెతకమని చెబుతాడు. దారిలో ఉన్న వాళ్ల దుకాణాల ముందు ఉండే సెక్యూరిటీని రోడ్డుమీదకు పంపి అన్ని కార్లు చెక్&zwnj; చేయమని చెబుతాడు. ఇంతలో కారులో భూషణ్&zwnj; ఆది, ప్రతాప్&zwnj;ను విసిగిస్తూనే ఉంటాడు. చక్రి మహా కోసమే మన ఇంట్లో చేరాడని..కావాలనే నా కారు ఢీకొట్టి ఇంట్లో చోటు సంపాదించాడని అంటాడు. అంతకు ముందు నుంచే మహాకు, చక్రికి పరిచయం ఉందంటూ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంటాడు. భూషణ్&zwnj; మాటలకు ప్రతాప్&zwnj;, ఆదికి విసుగొస్తుంటుంది. అసలు నీప్రవర్తన నచ్చకే వెళ్లిపోయిందని...ఇలా విసిగిస్తుంటే &nbsp;ఏ ఆడపిల్ల మాత్రం నీతో పెళ్లికి ఒప్పుకుంటుందని ప్రతాప్&zwnj; తీవ్రస్థాయిలో మండిపడతాడు. ఇంకోసారి నా కూతురు గురించి తప్పుగా మాట్లాడితే సహించేది లేదని అంటాడు. ఒకవేళ నువ్వు చెప్పిందే నిజమైతే...కన్న కూతురు అని కూడా చూడనని ఇద్దరినీ చంపేస్తానని అంటాడు. ఇంతలో తన మనుషులకు ఫోన్ చేసి వాళ్లిద్దరూ ఎక్కడ కనిపించినా ఆ డ్రైవర్&zwnj;ను చంపేసి నా కూతురుని తీసుకుని రమ్మని తన మనుషులను పురమాయిస్తాడు. ఇంతలో ప్రతాప్&zwnj; మనుషులు మహా వాళ్లను అడ్డగిస్తారు. కానీ చక్రి వాళ్లను తప్పించుకుని కారు ముందుకు తీసుకెళ్లిపోతాడు. దీంతో రౌడీలు మహాను తరుముతుంటారు.</p> <p>&nbsp;</p>
Read Entire Article