Podarillu Serial Today Episode: స్టార్ మా ఛానెల్‌లో అత్యంత ప్రేక్షక ఆదరణతో దూసుకుపోతున్న పొదరిల్లు సీరియల్‌లో ఈరోజు ఎపిసోడ్ ఆసక్తిగా సాగుతుంది.గోపిక బర్త్‌డే పార్టీకి వెళ్లిన చక్రి చిక్కుల్లో పడతాడు.అక్కడ గోపికకు చక్రి గులాబీపువ్వు ఇవ్వడంతో అందరూ చక్రి ప్రపోజల్‌ చేశాడంటూ గోలచేయడంతో అక్కడి నుంచి వచ్చేస్తాడు. ఇంటికి వచ్చిన తర్వాత చాలా ఢల్‌గా ఉండటంతో అందరూ చక్రిని ఏం జరిగిందని అడుగుతారు.కానీ చక్రి ఎవరికీ ఏం చెప్పడు.కానీ గోపిక పదేపదే ఫోన్లు చేస్తుండటంతో కట్‌ చేస్తాడు.
గోపికకు లవ్‌ ప్రపొజల్
మహాను ఉడికించడానికి గోపిక బర్త్‌డే పార్టీకి వెళ్లిన చక్రి అక్కడ చిక్కుల్లోపడతాడు.చక్రిని పీకల్లోతు ప్రేమిస్తున్న గోపిక..అతని రాక కోసం ఎదురుచూస్తుంటుంది.చక్రి రాగానే అతనికి కేక్ కట్‌చేస్తుంది.ముందు చక్రికే కేక్ తినిపిస్తుంది.ఇప్పుడు చక్రి కూడా తినిపించాలని స్నేహుతులంతా గోల చేయడంతో చక్రి కూడా తప్పనిసరి పరిస్థితుల్లో ఆమెకు కేక్ తినిపిస్తాడు.అందరూ గిఫ్ట్‌ ఏదని అడిగితే కళ్లుమూసుకోమని చెప్పి..బొకేలో ఉన్న గులాబీపువ్వు తీసి గోపికకు ఇస్తాడు. దీంతో అందరూ చక్రి గోపికకు ప్రపొజ్‌ చేశాడంటూ గోల చేస్తారు.ఇదేమీ అర్థంగాక చక్రి తెల్లముఖం వేస్తాడు. గులాబీపువ్వు ఇస్తే ప్రపొజ్‌ చేయడమేంటని అనుకుంటాడు.గోపిక కూడా చక్రినే తన లవర్‌ అని...భవిష్యత్‌లో మేం పెళ్లిచేసుకుంటామని అందరి ముందు ప్రకటించడంతో చక్రి ఖంగుతింటాడు. వెంటనే అక్కడి నుంచి బయటపడిపోతాడు.
ఏడిపించిన మహా
భోజనాల దగ్గర కూర్చున్న తర్వాత ఆమ్లేట్‌ కోసం కన్నా గొడవ చేస్తుంటే..అది చక్రికోసమని మాధవ్ అంటాడు. ఆయన బర్త్‌డే పార్టీకి వెళ్లాడని అక్కడ ఆయన గోపిక కొసరికొసరి వడ్డించిపెట్టి ఉంటుందిలేనని మహా పెద్దితో అంటుంది. ఇంతలో కన్నా గోపిక వాళ్ల ఫ్రెండ్‌ ఇన్‌స్ట్రాగ్రామ్‌ ఓపెన్ చేసి ఇదిగో అప్పుడే బర్త్‌డే పార్టీ వీడియోలు వచ్చేశాయని చూపిస్తాడు. గోపికకు అన్నయ్య కేక్‌ కూడా తినిపించాడని చూపిస్తాడు. అది చూసిన మహాలక్ష్మీ కోపంతో రగిలిపోతుండగా చక్రి అక్కడికి వస్తాడు. బాగా ఆకలిగా ఉందని అన్నం పెట్టమని అంటాడు.అందేంటి బర్త్‌డే పార్టీకి వెళ్లినవాడివి అక్కడ బాగా మెక్కి రాకుండా వచ్చావని మహా అడుగుతుంది. కనీసం ఫుడ్‌ కూడా పెట్టలేదా అని కేశవ్ అడుగుతాడు. ఫుడ్‌ పెట్టకపోవడానికేం పార్టీ ఫైవ్‌స్టార్‌ హోటల్లో ఇచ్చారని...కానీ నేను మా అన్నయ్య చేతివంట తినడానికే ఇక్కడికి వచ్చానని చక్రి అంటాడు.అసలు ఏం జరిగిందిరా చెప్పు అని మాధవ్‌ అంటాడు. ఏం లేదులే అని చక్రి సర్దిచెప్పి భోజనం చేస్తాడు.అప్పుడే గోపిక కంటిన్యూగా ఫోన్లు చేస్తూనే ఉంటుంది. మాట్లాడమని చక్రి అనగా...ఇంట్లో మాట్లాడితే మేడంగారు కొడుతుంది కదా అని అంటాడు. మేం చెప్పింది తూచా తప్పకుండా పాటిస్తున్నట్లు ఎందుకు ఈ నాటకమని మహా అంటుంది. ఏదైనా అవసరం ఉందో ఏంటో మాట్లాడమని కేశవ్‌ అంటాడు. నేను తర్వాత మాట్లాడతానని చక్రి ఫోన్ కట్‌ చేస్తాడు.
చక్రికి వార్నింగ్ ఇచ్చిన మాధవ్‌
తెల్లారిన తర్వాత నారాయణకు బాగా జ్వరం ఉండటంతో మహా సెలవుపెట్టి ఇంటి దగ్గరే ఉంటానని అంటుంది. అవసరం లేదని ఇదేమీ పెద్ద జ్వరం కాదని నారాయణ అంటాడు.మాధవ్‌ నేను టాబ్లెట్లు వేస్తానులేనని చెప్పి పంపిస్తాడు.నిన్నటి నుంచి చక్రి ఎందులో చాలా ఢల్‌గా ఉన్నాడని ఎవరితోనూ మాట్లాడటంలేదని కేశవ్‌ చెప్పడంతో చక్రిని పిలిచి మాధవ్ అడుగుతాడు. ఏంలేదని చక్రి చెబుతాడు. గోపికతో ఏమైనా గొడవ జరిగిందా అని కేశవ్ నిలదీస్తాడు.అలాంటిదేమీ లేదని చక్రి చెబుతాడు.దీంతో మాధవ్‌ చక్రిని గట్టిగా మందలిస్తాడు. నువ్వు దేనికోసం మొదలుపెట్టినా ఇప్పటితో ఇదంతా వదిలేయమని చెబుతాడు.అనవసరంగా ఓ అమ్మాయి మనసులో లేనిపోని ఆశలు పెంచొద్దని అంటాడు. ఇంతలో గోపిక పదేపదే ఫోన్ చేస్తుంటే చివరికి ఫోన్ లిప్ట్‌ చేస్తాడు. ఎందుకు పార్టీ మధ్యలోనే వెళ్లిపోయారని గోపిక అడిగితే ఏం లేదని చెప్పి తప్పించుకుంటాడు.