Podarillu Serial Today Episode: స్టార్ మా ఛానెల్‌లో అత్యంత ప్రేక్షక ఆదరణతో దూసుకుపోతున్న పొదరిల్లు సీరియల్‌లో ఈరోజు ఎపిసోడ్ ఆసక్తిగా సాగుతుంది. తల్లి కనిపించక కన్నా తల్లడిల్లిపోతాడు.నారాయణ ఏదో చేసి పంపించి ఉంటాడని చొక్కాపట్టుకుని నిలదీస్తాడు. ఇందులో మీనాన్నగారి తప్పు ఏంలేదని చెప్పి కన్నాకు మహా నచ్చజెబుతుంది. రాత్రి జరిగిన విషయం మొత్తం మహాలక్ష్మీ చక్రికి చెబుతుంది. దీంతో వాళ్లిద్దరూ జమునను వెతుక్కుంటూ ఆవిడ ఇంటికి వెళ్లగా అప్పటికే వాళ్లు ఇంటికి తాళం వేసి పారిపోతారు.
నారాయణను నిలదీసిన కన్నా
తెల్లారి లేచిన దగ్గర నుంచి తల్లి కనిపించకపోవడంతో కన్నా పిచ్చోడిలా వెతుకుతూ అంతా తిరుగుతాడు. అప్పుడే నారాయణ అక్కడికి వచ్చి ఏం జరిగిందని అడుగుతాడు.కన్నా వాళ్ల అమ్మ కనిపించడంలేదని మాధవ్ చెబుతాడు.దరిద్రం పోయిందని ఇంట్లో అన్నీ ఉన్నాయో లేదో ఓసారి చూసుకోండని అంటాడు. కేశవ్‌ను పిలిచి నీ డబ్బులు ఉన్నాయో లేదో ఓసారి చూసుకోమని చెబుతాడు. ఆమాటలకు కన్నాకు కోపం వస్తుంది.అది వెళ్లిపోయినందుకు అందరూ సంతోషించండని...మళ్లీ తీసుకొచ్చే ప్రయత్నాలు ఏమీ చేయవద్దని చెబుతాడు.దీంతో కన్నా వాళ్ల నాన్న చొక్కా పట్టుకుని నిలదీస్తాడు. నువ్వే మా అమ్మను ఏదో చేసి ఉంటావని అంటాడు. మీఆవిడను చంపినట్లే మా అమ్మను కూడా చంపేసిఉంటావని తిడతాడు.దీంతో మహాలక్ష్మీ వచ్చి కన్నాను విడదీస్తుంది.మీ అమ్మ వెళ్లిపోవడానికి ఆయనకు ఎలాంటి సంబంధం లేదని చెబుతుంది. నీకు తెలియదు వదినా నిన్న నాకళ్లముందే మా అమ్మ గొంతుపట్టుకున్నాడని అంటాడు. ఈతాగుబోతోడే ఏదో చేసి ఉంటాడని అందుకే మా అమ్మ ఎవరికీ చెప్పకుండా వెళ్లిపోయిందని ఏడుస్తాడు.
చక్రికి నిజం చెప్పిన మహా
చక్రిని కాలేజీలో దింపడానికి చక్రి,మహా ఇద్దరూ కారులో వెళ్తారు. కన్నాకు నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నా వాడు మాత్రం ఏడుస్తూనే ఉంటాడు. మా అమ్మ ఇకతిరిగి రాదా అని అడుగుతాడు. మీ అమ్మ ఎక్కడికి వెళ్లలేదురా...ఏదోఅర్జెంట్ పని ఉండి వెళ్లిపోయిం ఉంటుందని..అక్కడే ఇరుక్కుపోయి ఉంటుందని మహాలక్ష్మీ చెబుతుంది.నువ్వు ఏం భయపడొద్దని ఆవిడ తప్పకుండా మళ్లీ తిరిగి వస్తుందని నచ్చచెబుతుంది.మీకు మా అమ్మ ఇంటి అడ్రెస్‌ తెలుసుకదా వదిన ఓసారి వెళ్లి చూసి వద్దామని అంటాడు.నాకు పెద్దగా గుర్తులేదురా ఒక్కసారే చూశాను కదా అని అంటుంది.అయితే చక్రి అన్నయ్యకు తెలుసుకదా అని అంటాడు. వెంటనే కలుగజేసుకున్న మహాలక్ష్మీ నాకే తెలియనప్పుడు మీ అన్నయ్యకు మాత్రం ఎలా తెలుస్తుందిరా అని అంటుంది.అదేంటి నేనే కదా ఆవిడను తీసుకుని వచ్చిందని చక్రి అనుకుంటాడు.అంటే కన్నాకు ఏదో విషయం తెలియకూడదని మహా అనుకుంటుందని అనుకుంటాడు.కన్నాను కాలేజీలో దింపిన తర్వాత చక్రి మహాలక్ష్మీని అడుగుతాడు.ఎందుకు కన్నాకు వాళ్ల అమ్మ అడ్రెస్ తెలియకుండా అడ్డుకున్నారని నిలదీస్తాడు.
కన్నాఇప్పటికే వాళ్ల అమ్మ వెళ్లిపోయినందుకు చాలా బాధపడుతున్నాడని..వాడికి వాళ్ల అమ్మ గురించి నిజం తెలిస్తే తట్టుకోలేడని అంటుంది. ఏంటి ఆ నిజమని అడిగితే...కన్నా వాళ్ల అమ్మ ఓ దొంగ అని చెబుతుంది.రాత్రి మన ఇంట్లో డబ్బులు కొట్టేసేందుకు ప్రయత్నిస్తుండగా నేను పట్టుకున్నానని..దీంతో నన్ను నెట్టి పారిపోయిందని చెబుతుంది.దీంతో చక్రి షాక్ తిని నన్ను ఎందుకు పిలవలేదని అంటాడు.మిమ్మల్ని పిలిస్తే అందరూ నిద్రలేచి కన్నాను కూడా లేపేవారని...అప్పుడు వాళ్ల అమ్మ గురించి తెలుసుకునికన్నా చాలా బాధపడేవాడని మహాలక్ష్మీ అంటుంది.
జమున కోసం వెతుకులాట
జమునను వెతుక్కుంటూ చక్రి,మహా ఇద్దరూ కలిసి ఆమె ఉంటున్న పాత ఇంటికి వెళ్తారు.అప్పుడు అక్కడ ఇంటికి తాళం వేసి ఉండటం చూసి ఉసూరుమంటారు. మీకు నిజం తెలిసిపోయిందని ఆవిడ ఇల్లు ఖాళీ చేసి వెళ్లిపోయినట్లు ఉందని చక్రి అంటాడు.పోనీలేండి డబ్బులు మాత్రం పోలేదని సంతోషిస్తాడు.