Podarillu Serial Today Episode: స్టార్ మా ఛానెల్‌లో అత్యంత ప్రేక్షక ఆదరణతో దూసుకుపోతున్న పొదరిల్లు సీరియల్‌లో ఈరోజు ఎపిసోడ్ ఆసక్తిగా సాగుతుంది.తాగి వచ్చి చక్రి చేసిన రచ్చతో మహా ఇంట్లో నుంచి వెళ్లిపోవడానికి సిద్ధమవుతుంది. దివ్యతో కలిసి వాళ్ల హాస్టల్‌లోనే రూమ్‌కు అడ్వాన్స్‌ ఇచ్చి వస్తుంది.ఇంటికి వచ్చి బ్యాగ్ సర్దుకుని వెళ్లిపోతుండగా...మాధవ్‌ అడ్డుచెప్పడు. చక్రి,కేశవ్‌ అడ్డుపడినా వద్దని చెప్పి మహాను తీసుకుని మాధవ్‌ హాస్టల్‌కు వెళ్లడంతో ఈరోజు ఎపిసోడ్ ముగిసిపోతుంది
హాస్టల్‌లో రూమ్‌ చూసుకున్న మహా
రాత్రి తాగివచ్చి చక్రి చేసిన రచ్చ తలచుకుని మహా చాలా బాధపడుతుంది. ఆఫీసులో వర్క్ కూడా చేయలేకపోతుంది. ఇదంతా గమనించిన దివ్య ఏం జరిగిందని అడగ్గా...రాత్రి నిద్రపోలేదని అబద్ధం చెబుతుంది. అలాగే ఇప్పుడు నేను ఉంటున్న వాళ్ల ఇంట్లో కొంచెం ఇబ్బందిగా ఉందని నాకు హాస్టల్ చూసి పెడతావా అని అడగుతుంది.నేను ఉండే హాస్టల్‌లో ఖాళీ ఉందని చెప్పడంతో ఇద్దరూ కలిసి అక్కడి వెళ్లి వార్డెన్‌తో మాట్లాడతారు. మహాకు దివ్య రూమ్‌లోనే బెడ్‌ ఇవ్వడంతో సాయంత్రి వచ్చి జాయిన్ అవుతానంటూ అడ్వాన్స్ ఇచ్చి వెళ్లిపోతుంది
ఇంట్లో నుంచి వెళ్లపోవడానికి పెద్ది పర్మిషన్
నీరసంగా ఇంటికి వచ్చిన మహాలక్ష్మీ తన గదిలోకి వెళ్లి సూటుకేస్ సర్దుకుంటుంది. బయటకు వచ్చి మాధవ్‌ను పిలుస్తుంది.ఎప్పుడొచ్చావమ్మా...చూసుకోలేదు టీ తీసుకుని వస్తానని వెళ్లబోతుండగా మీతో కొంచెం మాట్లాడాలని అంటుంది. ఈ ఇంట్లో నేను ఉండలేనని అంటుంది.దయచేసి మీరు నన్ను ఉండిపొమ్మని బలవంతం పెట్టొద్దని ముందే చెబుతుంది.ఎవరు ఏ ఉద్దేశంతో ఉన్నా నేను మాత్రం తొలి నుంచి నా పరిదిలోనే ఉన్నానని అంటుంది. నేను మీతమ్ముడిని ఇష్టపడి పెళ్లిచేసుకోలేదని...ఇంట్లో నుంచి పారిపోయే వచ్చేక్రమంలో నన్ను నేను రక్షించుకోవడానికి తప్పినిసరి పరిస్థితుల్లో తాళి కట్టించుకోవాల్సి వచ్చిందని అంటుంది. అప్పటి నుంచి నా హద్దుల్లోనే నేను ఉన్నానని...ఎలా వచ్చానో అలాగే వెళ్లాలని మొదటి నుంచి నిర్ణయించుకుని ఉన్నానని అంటుంది. ఇప్పుడు కూడా అలాగే వెళ్తున్నానని చెబుతుంది. దయచేసి మీరు అడ్డుపడొద్దని అంటుంది. నిన్ను ఉండమని చెప్పే అర్హత నేను కోల్పోయానని మాధవ్ అంటాడు. ఇక నీ ఇష్టమని చెబుతాడు.
అప్పుడే బయట నుంచి వచ్చి కన్నా,కేశవ్‌ మహాలక్ష్మీ బయలుదేరి వెళ్లిపోవడం చూసి అడ్డుకుంటారు. దయచేసి ఇంట్లో నుంచి వెళ్లిపోవద్దని కన్నా ఏడుస్తాడు. కేశవ్‌ కూడా ఉండమని ప్రాధేయపడతాడు. నువ్వు చెబితే వింటుంది అన్నా ఉండమని చెప్పు అన్నా అంటూ మాధవ్‌ను కూడా అడగుతారు. కానీ మాధవ్‌ ఏం మాట్లాడడు. దయచేసి మహాలక్ష్మీ అడ్డుపడకండని చెప్పడంతో అందరూ షాక్‌ తింటారు. ఆమె ఏం చేయాలనకుంటే అది చేయనివ్వండని చెప్పడంతో కన్నీళ్లు పెట్టుకుంటారు.
బ్రతిమలాడిని చక్రి..కోపంతో మండిపడిన మహా
మహా వెళ్లిపోతుండటం చూసి చక్రి అక్కడికి వస్తాడు. నా వల్లే తప్పు ఉంటే నన్ను శిక్షించండి కానీ ఇలా ఇంట్లో నుంచి వెళ్లిపోవద్దని అంటాడు.మీరు ఇంట్లో ఉండగా నేను కనీసం ఇంట్లోఅడుగుపెట్టనని నారాయణలాగా బయటే పడుకుంటానని చెబుతాడు. తాగిన మైకంలో నేను చేసిన తప్పును క్షమించమని వేడుకుంటాడు. మీ గదిలోకి వచ్చాను తప్ప...మీతో ఎటువంటి అసభ్యంగా ప్రవర్తించలేదని అంటాడు. దీంతో మాధవ్‌ కోపంతో చక్రిని తిడతాడు. ప్రతిరోజూ భయంగా ఈ ఇంట్లో ఆ అమ్మాయి ఎలా ఉంటుందిరా అని నిలదీస్తాడు. రాత్రంతా తలుపు గడియ వైపు చూస్తూ మేల్కొని ఉండాలా అని అంటాడు. ఎవరూ మహాకు అడ్డుపడొద్దని చెప్పి తానే స్వయంగా వెళ్లి హాస్టల్‌లో దిగబెట్టి వస్తాడు.