Podarillu Serial Today Episode: స్టార్ మా ఛానెల్‌లో అత్యంత ప్రేక్షక ఆదరణతో దూసుకుపోతున్న పొదరిల్లు సీరియల్‌లో ఈరోజు ఏపీసోడ్ ఆసక్తిగా సాగుతుంది. మహాలక్ష్మీ ఆఫీసుకు వచ్చి రచ్చ చేసిన చక్రిపై ఆమె మండిపడి ఇంటికి పంపిస్తుంది. ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత చక్రిని గట్టిగా మందలిస్తుంది. దీంతో చక్రి అలిగి ఇంట్లో నుంచి వెళ్లిపోయి రాత్రంతా రోడ్డుపై కారులోనే పడుకుంటాడు. దీంతో మార్నింగ్ ఫోన్‌ చేసి ఇంటికి రమ్మనగా....తిరిగి వస్తుండగా ఏం జరిగిందో ఈరోజు ఏపిసోడ్‌లో సస్పెన్స్‌తో అదిరిపోతుంది.
చక్రిపై అరిచిన మహా
మహాలక్ష్మీ ఆఫీసుకు వచ్చిన చక్రి రచ్చరచ్చచేస్తాడు. తనకు ఎవరూ లేరనుకుంటున్నారా నేను ఉన్నానంటూ ఎంప్లాయిస్‌ను బెదిరిస్తాడు.దీంతో మహాకు ఏం చేయాలో అర్థం కాదు. మర్యాదగా ఇక్కడ నుంచి వెళ్లిపోండని ఎంత చెప్పినా వినకుండా చక్రి అందరి ముందు అరుస్తూనే ఉంటాడు.వీళ్లకు ఎందుకు మీరు భయపడుతున్నారంటూ ఇష్టం వచ్చినట్లు మాట్లాడతాడు. ఇంతలో బాస్‌ వచ్చి ఎవరని అడగ్గా....నేను తర్వాత చెబుతానంటూ చక్రి చేయిపట్టుకుని లాక్కుని మహా తీసుకెళ్తుంది. ఎవరు నిన్ను ఇక్కడికి రమ్మన్నారంటూ నిలదీస్తుంది. ఇంట్లో ఎలా ఉంటారు మీరు ఇక్కడ ఎందుకు భయపడుతున్నారని చక్రి అంటాడు. మర్యాదగా ఇక్కడ నుంచి మీరు వెళ్లాలని వార్నింగ్ ఇస్తుంది. ఈ ముష్టి జీతం కోసం వాళ్లు అన్న మాటలన్నీ మీరు పడాలా అని చక్రి అంటాడు. మీరు మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్లకుంటే నేను సాయంత్రం ఇంటికి కూడా రానని తెగేసి చెప్పడంతో చక్రి ఇంటికి వెళ్లిపోతాడు.
చక్రి బిల్డప్‌లు...తాట తీసిన మహా
ఆఫీసు నుంచి ఇంటికి వచ్చిన మహాలక్ష్మీని చూసి పెద్ది ఏమైందని అడుగుతాడు. ఏం లేదని చెప్పి తాను ఇంట్లోకి వెళ్లిపోతుంది. ఇంతలో చక్రి ఇంటికి వచ్చి చాలా గొప్పలుపోతాడు.ఇవాళ మహాలక్ష్మీ ఆఫీసులో మనం ఇచ్చిన బిల్డప్‌కు ఇక ఎవరూ తన జోలికి రారని అంటాడు. మహాలక్ష్మీని చూసి అందరూ భయపడిపోతారని...తనను ఎవరూ ఒక్కమాట కూడా అనరని అంటూ గొప్పలుపోతాడు. చక్రి మాటలు వింటూ కోపంతో రగిలిపోయిన మహా....మీకు కొంచెం కూడా బుద్ధిలేదా అని నిలదీస్తుంది.అసలు ఎవరు రమ్మన్నారు నిన్ను ఆఫీసుకు అని మండిపడుతుంది.కొంచెం కూడా సభ్యత, సంస్కారం లేకుండా ఓ వీధి రౌడీలా ఆఫీసుకు వచ్చి గొడవపడతావా అని అరుస్తుంది.మీకోసమే కదా వచ్చానని అంటే...నేను నిన్ను అడిగానా రమ్మని అనిం అంటుంది. అసలు నా ఆఫీసు విషయాల గురించి నీకు ఏం సంబంధం అని అడుగుతుంది. ఏం జరిగిందో తెలుసుకోకుండా నీ ఇష్టం వచ్చినట్లు ఊహించుకుని నా పరువు తీస్తావా అని మండిపడుతుంది. నీవల్ల నాకు ఎంత అవమానం జరిగిందంటే...ప్రతి ఒక్కరి ద‌గ్గరికి వెళ్లి నేను సారీ చెప్పాల్సి వచ్చిందని అంటుంది. నాకు ఆఫీసులో ఏదైనా ప్రాబ్లం ఉంటే నేను చూసుకోగలనని...మధ్యలో నీ జోక్యం ఎందుకని నిలదీస్తుంది. పైగా చేసిన పనికి కొంచెం కూడా పశ్చాత్తాపం లేకుండా ఏదో గొప్ప విషయం చేసినట్లు అందరి ముందు బిల్డప్‌లు ఇస్తున్నావని అరుస్తుంది. పెద్ది, కన్నా కూడా చక్రిని తిడతారు. అసలు నువ్వు ఎందుకు వెళ్లావని అరుస్తారు.దీంతో చక్రి అలిగి ఇంట్లో నుంచి వెళ్లిపోతాడు.
చక్రి కోసం మహా ఎదురుచూపులు
రాత్రయినా చక్రి ఇంటికి రాకపోవడంతో మహా చాలాసేపు ఎదురుచూస్తుంది. వాడు ఇంట్లో వాళ్లపై అలిగివెళ్లిపోతే ఇంటికి రాడని మాకు ఇది మామూలేనని కేశవ్ అంటాడు.కోపం తగ్గిపోయిన వెంటనే వాడే వస్తాడని మాధవ్‌ చెప్పడంతో అందరూ భోజనం చేసి నిద్రపోతారు. కానీ మహామాత్రం చక్రికోసం ఎదురుచూస్తూనే ఉంటుంది. తెల్లవార్లు దోమలతో నిద్రపోకుండా చక్రి రోడ్డుపక్కనే కారు పెట్టుకుని కూర్చుకుని ఉంటాడు. తెల్లారిన తర్వాత మహా ఫోన్ చేసి ఇంటికి రాకుండా ఏంచేస్తున్నారని నిలదీస్తుంది. మీరందరూ కలిసి నన్ను తిట్టారు కదా ఇంటికి రానని అంటాడు.మీరు చేసిన ఘనకార్యానికి తిట్టకుండా ఉంటారా మర్యాదగా ఇంటికి రమ్మని వార్నింగ్ ఇస్తుంది. దీంతో చక్రి ఇంటికి బయలుదేరతాడు.