Podarillu Serial Today Episode: స్టార్ మా ఛానెల్‌లో అత్యంత ప్రేక్షక ఆదరణతో దూసుకుపోతున్న పొదరిల్లు సీరియల్‌లో ఈరోజు ఎపిసోడ్ ఆసక్తిగా సాగుతుంది. మాధవ్‌ అన్నయ్య పెళ్లి చేసుకోకుండా నేను పెళ్లి చేసుకోవడం కరెక్ట్‌ కాదని శైలుకు నచ్చజెప్పి కేశవ్‌ ఆమెను వాళ్ల ఇంట్లో దిగబెట్టి వస్తాడు. అలా చేసినందుకు చక్రి,నారాయణ ఇద్దరూ కలిసి కేశవ్‌ను గట్టిగా తిడతారు.అన్నయ్య గురించి కేశవ్ చాలా బాధ్యతగా ఆలోచించాడని మహాలక్ష్మీ అతన్ని మెచ్చుకుంటుంది.
శైలుకు నచ్చజెప్పిన కేశవ్‌
శైలును బయటకు తీసుకెళ్లిన కేశవ్‌...ఆమెను పెళ్లిచేసుకోవడానికి ఇప్పుడు ఉన్న ఇబ్బందులను వివరిస్తాడు. మా అందరికోసం త్యాగం చేసిన మా అన్నయ్యను అలా వదిలేసి మా స్వార్థం మేం చూసుకోలేమని అంటాడు. ఇప్పుడు నేను పెళ్లిచేసుకుంటే మా అన్నయ్యలో ఏదో లోపం ఉందని పిల్లను ఇవ్వడానికి ఎవరూ ముందుకు రారని అంటాడు. నువ్వు చెప్పింది కూడా నిజమేనని శైలు అంటుంది. కావాలంటే నిన్ను హాస్టల్‌లో ఉంచి నేను చదివిస్తానని కేశవ్‌ చెప్పినప్పటికీ ....అవసరం లేదని నేను ఇంటికి వెళ్లిపోతానని అంటుంది. నువ్వు ఉన్నావన్న ధైర్యంతో నేను అక్కడ ఉండగలనని చెబుతుంది. దీంతో కేశవ్ శైలుకు కొత్త ఫోన్ కొనిచ్చి అక్కడ ఏం అవసరం ఉన్నా నాకు ఫోన్ చేసి చెప్పమని చెబుతాడు.
చక్రి కంగారు
ఉదయం అనగా అమ్మాయిని బయటకు తీసుకెళ్లిన వాడు ఇప్పటికీ ఇంటికి రాకపోవడంతో చక్రి చాలా కంగారుపడుతుంటాడు. అక్కడ వాళ్లిద్దరూ ఏమైనా గొడవపడి ఉంటారా అని ఆలోచిస్తుంటాడు. లేకపోతే శైలు వాళ్ల అన్నయ్య వచ్చి ఏమైనా గొడవ చేసి ఉంటాడా అని అంటాడు. అలా ఏం జరగదులేరా అని మాధవ్‌ సర్దిచెబుతాడు. అయినాగానీ ఇంతసేపు ఏం మాట్లాడుకుంటారని చక్రి అంటాడు. ఎందుకైనా మంచిదని కేశవ్‌కు ఫోన్ చేయమని కన్నాగాడికి చెప్పగా....వాడు ఫోన్ చేసి అడుగుతాడు. పది నిమిషాల్లో ఇంటికి వస్తానని అంటాడు. మీరు ఏమైనా గొడవపడుతున్నారా అని చక్రి అన్నయ్య అడగమన్నాడని చెబుతాడు. అలాంటిదేమీ లేదని కేశవ్ అంటాడు. అరే నా పేరు ఎందుకు చెప్పావురా అని చక్రి కన్నాను తిడతాడు.
శైలును వాళ్ల ఇంట్లో వదిలిపెట్టిన కేశవ్
శైలును తీసుకుని నేరుగా అత్తారింటికి వస్తాడు కేశవ్‌.అప్పటికే శైలు లేచిపోయిందంటూ అందరూ వాళ్ల ఇంటి దగ్గరకు వచ్చి ఆరా తీస్తుంటే శంకర్‌, వరాలకు తలతీసేసినట్లు అనిపిస్తుంది. ఈ శైలు చేసిన పనికి పరువుపోయిందని బాధపడుతుంటారు. అప్పుడే అక్కడికి వచ్చిన శైలు వాళ్లందరినీ తిట్టి వీడే నా బాయ్‌ఫ్రెండ్‌ అని చెప్పి పంపించేస్తుంది. కేశవ్‌ సురేశ్‌కు మళ్లీ గట్టి వార్నింగ్ ఇచ్చి ఇంకోసారి ఇంట్లో ఎవరైనా తనను ఏమైనా అంటే నేను ఊరుకోననిచెప్పి వెళ్లిపోతాడు. బయటకు వెళ్లిపోయిన దానివి మళ్లీ ఎందుకు వచ్చావని వరాలు కూతురుని తిడుతుంది. వాడు కట్నం తీసుకురాకుండా వచ్చినందుకు బయటకు గెంటేశాడా అని అంటుంది.వాళ్ల గురించి తప్పుగా మాట్లాడొద్దని శైలు అరుస్తుంది. వాడు మన ఇంటి పరువు గురించి ఆలోచించాడు కాబట్టే తీసుకుని వచ్చాడని చెబుతుంది. ఊళ్లో జనాలు అనే మాటలకు మీరు ఎక్కడ ఉరివేసుకుని చస్తారని భయపడే నాకు నచ్చజెప్పి తీసుకొచ్చాడని చెబుతుంది. నీ కొడుకు మాటలు విని ఎగేసుకుని వాళ్ల ఇంటి మీదకు తగువుకు వెళ్లావు కానీ...వాళ‌్లు మాత్రం నీ కొడుకుపై ఎలాంటి కేసులు పెట్టలేదని...అలాంటి వాళ్లను అంటే నీకు కళ్లుపోతాయని చెప్పి ఇంట్లోకి వెళ్లిపోతుంది.
కేశవ్‌పై చక్రి మండిపాటు
ఒంటరిగా ఇంటికి వచ్చిన కొడుకును చూసి నారాయణ నిలదీస్తాడు. ఆ అమ్మాయిని వాళ్ల ఇంట్లో వదిలిపెట్టి వచ్చానని చెప్పగానే కసురుకుంటాడు.లోపలికి వెళ్లిన తర్వాత చక్రి కూడా కేశవ్‌ను తిడతాడు. ఇంట్లో త్యాగమూర్తులు ఎక్కువైపోయారని అంటాడు. దీంతో చక్రిని మహా అరుస్తుంది. బయటకు వెళ్లిపోయిన తర్వాత కేశవ్‌ను పిలిచి ఎందుకు ఇలాంటి పనిచేశావని చక్రి నిలదీయగా...పెద్దన్నయ్య కోసమే చేశానని అంటాడు. నేను పెళ్లిచేసుకుంటే అన్నయ్యకు ఇక ఎప్పటికీ పెళ్లికాదని అంటాడు.అందుకే అన్నయ్య పెళ్లి అయ్యేవరకు చేసుకోనని చెప్పి వెళ్లిపోతాడు. అప్పుడే అక్కడికి వచ్చిన మహా...ఏమంటున్నాడు మీ తమ్ముడు అని అడగ్గా..చక్రి ఏదో చెబుతాడు. మీ అన్నయ్య గురించి ఆలోచించే చేసుకోలేదని చెప్పాడా అని అంటుంది.నీకు ఎలా తెలిసిందని అంటే...బాధ్యత ఉన్నవాడు ఎవడైనా అలాగే ఆలోచిస్తాడని చక్రికి చురకలు అంటిస్తుంది.