Podarillu Serial Today Episode: స్టార్ మా ఛానెల్‌లో అత్యంత ప్రేక్షక ఆదరణతో దూసుకుపోతున్న పొదరిల్లు సీరియల్‌లో ఈరోజు ఎపిసోడ్ ఆసక్తిగా సాగుతుంది. పెళ్లిచూపులు చెడగొట్టుకోవడంతో వరాలు కూతురిని ఇంట్లో నుంచి వెళ్లిపొమ్మని చెబుతుంది. దీంతో బ్యాగ్‌ సర్దుకుని శైలు కేశవ్‌ ఇంటికి వచ్చేస్తుంది.ఇప్పుడే వాళ్లిద్దరికీ పెళ్లిచేద్దామని చక్రి అంటాడు. మేం బయటకు వెళ్లి మాట్లాడుకుని వస్తామని కేశవ్‌ ఆమెను తీసుకుని వెళ్లిపోతాడు. ఇంటికి మాత్రం ఒంటరిగానే తిరిగి వస్తాడు.అమ్మాయి ఏమైందిరా అని అడిగిన మాధవ్‌కు కేశవ్ ఏం చెప్పాడన్నది ఈరోజు ఎపిసోడ్‌లో ఆసక్తిగా మారుతుంది.
ఇల్లు వదిలిన శైలు
పెళ్లిచూపుల్లో పెళ్లికొడుకుని బెదరగొట్టి ఆ సంబంధం చెడగొట్టినందుకు వరాలు కూతురిపై చేయిచేసుకుని తిడుతుంది. మేం చూసిన వాడిని పెళ్లిచేసుకోవడం ఇష్టం లేనప్పుడు నాకు కూతురే లేదనుకుంటానని మర్యాదగా బయటకు వెళ్లిపొమ్మని అంటుంది.దీంతో శైలు బ్యాగ్‌ సర్దుకుని బయలుదేరుతుండగా అన్న సురేశ్‌ ఆపుతాడు. మా అమ్మే నేను చచ్చిపోయాననుకుని వెళ్లిపోయిన తర్వాత నువ్వు ఎవడ్రా ఆపడానికి అని చెప్పి వెళ్లబోతుండగా వాళ్ల నాన్న ఆపుతాడు.మీ అమ్మ కోపంలో అన్న మాటలు కూడా పట్టించుకుంటావా అని అంటాడు. అమ్మ మనసులో మాటే బయటకు చెప్పేసిందని శైలు అంటుంది. మీరు చదివించారు కాబట్టి నా కాళ్లపై నేను నిలబడి బతుకుతానని చెప్పి శైలు ఇంట్లో నుంచి వెళ్లిపోతుంది.
శైలు రాకతో కేశవ్ కుటుంబం షాక్‌
బ్యాగ్ తీసుకుని సరాసరి శైలు కేశవ్ ఇంటికి వచ్చేస్తుంది. ఆమెను చూసి ఇంట్లో అందరూ షాక్‌ తింటారు. ఇక కేశవ్‌కు ఏం అర్థంకాదు. ఏమైందని అడగ్గా...మీ అన్నయ్యను పెళ్లిచూపులు చెడగొట్టమంటే చేతకాలేదు. అందుకే నా పెళ్లిచూపులు నేనే చెడగొట్టుకున్నానని అంటుంది. దీంతో మాఇంట్లోవాళ్లు బయటకు పొమ్మన్నారు.అందుకే బ్యాగ్ సర్దుకుని వచ్చేశానని అంటుంది.ఇక నువ్వు పెళ్లిచేసుకుంటావో,ఏం చేసుకుంటావో నీ ఇష్టమని అంటుంది. నేను మాత్రం ఇక నుంచి ఇక్కడే ఉంటానని చెబుతుంది. ఆమె మాటలకు మాధవ్‌కు ఏం చేయాలో అర్థంకాదు. దీంతో అమ్మాయిని గదిలోకి తీసుకెళ్లమని మహాకు చెప్పి అందరితో మాట్లాడతాడు. ఇంకేముంది ఆ అమ్మాయి కేశవ్‌ను ఇష్టపడి వచ్చింది కాబట్టి పెళ్లిచేద్దామని చక్రి అంటాడు. మళ్లీ వాళ్ల అమ్మానాన్నలు పోలీసులతో వచ్చేసరికి మనం పెళ్లి చేసేద్దామని చెబుతాడు. ఆ ఆమ్మాయి ఆవేశంలో వచ్చిందని ఇప్పడు ఇలాంటి నిర్ణయం తీసుకోవడం కరెక్ట్‌ కాదని మాధవ్ అంటాడు. ఆ అమ్మాయి అంత ధైర్యంగా వీడిని నమ్ముకుని వస్తే ఇంటికి తిరిగి పంపించడం కూడా కరెక్ట్ కాదని చక్రి అంటాడు.
కేశవ్‌ ఏమనుకుంటున్నాడు
కేశవ్‌,చక్రిని పక్కకు తీసుకెళ్లి మాట్లాడతాడు.నువ్వు నిజంగానే నీ అభిప్రాయాలు అన్నయ్యపై రుద్ది ఒప్పించేలా ఉన్నావని అంటాడు.ఇందులో తప్పేముందిరా అ అమ్మాయి,నువ్వు ఇష్టపడ్డారు కాబట్టి పెళ్లిచేసుకోమని అంటున్నామని అంటాడు. ఇప్పటికే పెద్దన్నయ్యకు పెళ్లికాకుండా నువ్వు పెళ్లిచేసుకున్నందుకే అందరూ నానా రకాలుగా అనుకుంటున్నారని...ఇప్పుడు నేను కూడా పెళ్లిచేసుకుంటే ఇక అన్నయ్యకు పిల్లను ఇవ్వడానికి ఎవరూ ముందుకు రారాని అంటాడు. కాబట్టి మాధవ్‌ అన్నయ్య పెళ్లి అయ్యే వరకు నేను పెళ్లిచేసుకోలేనని అంటాడు. నువ్వు ఆలోచించేది బాగానే ఉంది కానీ...అప్పటి వరకు శైలు మన ఇంట్లో ఉన్నా నలుగురు నానా రకాలుగా అనుకుంటారని అంటాడు. నేను తనతో మాట్లాడి ఏదో ఒకటి చేస్తానని కేశవ్ చెబుతాడు.
శైలుకు పరిస్థితి వివరించిన కేశవ్
నేను శైలును బయటకు తీసుకెళ్లి మాట్లాడి ఓ నిర్ణయానికి వస్తామని కేశవ్ అంటాడు. ఆమెను బ్యాగ్‌తో సహా బయటకు తీసుకెళ్లి తన ప్రేమను చెబుతాడు.దీంతో శైలు చాలా అనందపడిపోతుంది.కానీ ఇప్పటికిప్పుడు నేను నిన్ను పెళ్లిచేసుకోలేనని...మా అన్నయ్య మాకోసం చిన్నప్పటి నుంచి చాలా బాధలు పడ్డాడని ఇప్పటికే చక్రికి పెళ్లి జరగడంతో అన్నయ్యకు వచ్చే సంబంధాలు కూడా చాలా కష్టంగా మారిందని...కాబట్టి ఇప్పుడే మన పెళ్లి వద్దని చెబుతాడు.నువ్వు ఎలా చెబితే అలా అని అంటుంది.నువ్వు హాస్టల్‌లో ఉండి చదువుకోమని కావాల్సిన డబ్బులు నేనే కడతానని చెబుతాడు.దీనికి శైలు ఓకే చెబుతుంది.