Podarillu Serial Today Episode: స్టార్ మా ఛానెల్‌లో అత్యంత ప్రేక్షక ఆదరణతో దూసుకుపోతున్న పొదరిల్లు సీరియల్‌లో ఈరోజు ఎపిసోడ్ ఆసక్తిగా సాగుతుంది. డ్రైవింగ్ లైసెన్స్‌కోసం మహా ఆర్టీవో ఆఫీసుకు వెళ్లగా...ముందురోజు డ్రైవింగ్ చేస్తూ మహా స్కూటీతో గుద్దితో ముక్కుపగిలినవాడే ఆర్టీవో ఆఫీసర్ కావడంతో మహా భయపడి వెనక్కి వచ్చేస్తుంది. దీంతో చక్రి మాయ చేసి మహాకు లైసెన్స్ వచ్చేలా చేస్తాడు.అటు శైలూ ఇంట్లో ఆమెకు పెళ్లిచూపులు చూడటంతో పెద్ద గొడవ జరగడంతో ఈ రోజు ఎపిసోడ్ ఆసక్తిగా మారుతుంది.
మహాకు డ్రైవింగ్ లైసెన్స్‌
డ్రైవింగ్ లైసెన్స్‌ తీసుకోవడం కోసం మహా బయలుదేరుతుంది.మీకు అప్పుడే లైసెన్స్‌ రాదని...అక్కడ పెట్టే పరీక్షలు పాస్ అవ్వలేరని చక్రి చెబుతాడు. నిన్నే ఓ వ్యక్తిని స్కూటీతో గుద్దితే ముక్కు పచ్చడి అయ్యిందని చెబుతాడు. నేను బాగానే వెళ్లానని అతనే అడ్డు వచ్చాడని మహా చెబుతుంది. ఏదీ ఏమైనా ఇవాళ డ్రైవింగ్ స్లాట్‌కు వెళ్లాల్సిందేనని అంటుంది. ఎందుకైనా మంచిదని ఆ పేపర్ దేవుడి ఫొటో దగ్గర పెట్టమని మాధవ్ చెబుతాడు. స్లాట్‌ బుకింగ్ పేపర్ దేవుడి దగ్గర పెట్టి దణ్ణం పెట్టుకుంటుంటే....అది కాస్తా గాలికి ఎగిరిపోతుంది. ఇదేదో అపశకునంలా ఉంది వద్దని అంటారు. అయినా సరే మహా వెళ్లాల్సిందేనని అంటుంది. బయటకు రాగానే నారాయణ గట్టిగా తుమ్ముతాడు. నేను శుభమా అని లైసెన్స్‌ కోసం వెళ్తుంటే తుమ్ముతారా అని మహా అరుస్తుంది.నాకు లైసెన్స్‌ రాలేదంటే ఇవాల్టి నుంచి మీకు మందు బంద్ అని హెచ్చరించి వెళ్లిపోతుంది.
శైలూకు ఇంట్లో తప్పని తిప్పలు
శైలూ కేశవ్‌కు ఫోన్ చేసి మాట్లాడుతుంది. పెళ్లి ఎప్పుడు చేసుకుందాం, పిల్లలను ఎంతమందిని కనాలి అని మాట్లాడుకుంటుండగా....వాళ్ల అన్న సురేశ్ వింటాడు. ఆమెతో గొడవ పెట్టుకుంటాడు. నా పర్మిషన్‌ లేకుండా నా రూమ్‌లోకి ఎందుకు వచ్చావంటూ వాళ్ల అన్నను తిట్టి బయటకు పంపిస్తుంది.దీంతో అతను గట్టిగా అరిచి వాళ్ల అమ్మను పిలిచి తిడతాడు. అది ఇంట్లో ఆ మెకానిక్‌గాడితో ఫోన్‌లో మాట్లాడుతుంటే నువ్వు ఏం చేస్తున్నావని నిలదీస్తాడు.నేను ఏం చేయనురా తిట్టాను, కొట్టాను అయినా మారడం లేదని అంటుంది.అయితే పెళ్లిచేసి పంపించేయండని అంటాడు. దీంతో వరాలు వాళ్ల అయన్ను పిలిచి అమ్మాయికి ఆ బ్రోకర్‌ పెళ్లి సంబంధం తెచ్చాడు కదా వాడిని పిలిచి అమ్మాయి పెళ్లి చూపులకు రమ్మని చెప్పండని చెబుతుంది.
మహాకు లైసెన్స్‌ తిప్పలు
డ్రైవింగ్‌ లైసెన్స్‌ కోసం మహా ఆర్టీవో ఆఫీసుకు వెళ్లగా అక్కడ ఆర్టీవో తాను నిన్న స్కూటీతో గుద్దిన వాడే ఉండటం చూసి మహా భయపడి వెనక్కి వచ్చేస్తుంది. దీంతో చక్రి ఆమెకు హెల్మెట్‌ పెట్టి పంపిస్తాడు.అయినా సరే ఆర్టీవో హెల్మెట్‌ తీసి ముఖం చూపించాలని అడుగుతాడు. మహాను చూడగానే చిర్రెత్తుకొచ్చి నీకు లైసెన్స్‌ ఇచ్చేది లేదని తెగేసి చెబుతాడు. అప్పుడే అక్కడికి వచ్చిన చక్రిని చూసి నిన్న నువ్వు నన్ను ఎన్ని మాటలు అన్నావని మండిపడతాడు. దీంతో చక్రి మాయ చేసి ఆ ఆర్టీవోను బుజ్జగిస్తాడు. ఈ అమ్మాయి చాలా పేద అమ్మాయని...నేనే స్కూటీ కొనిపెట్టానని మీరు దయ తలిస్తే ఉద్యోగంలో చేరుతుందని బ్రతిమలాడతాడు.దీంతో ఆర్టీవో మెత్తబడి పరీక్షలకు ఒప్పుకుంటాడు. ఆర్టీవో పరీక్షల్లో మహా దిగ్విజయంగా పాసవ్వడంతో లైసెన్స్‌ ఇస్తారు.
అటు శైలూ ఇంట్లో ఆమెకు పెళ్లిచూపులు చూస్తుండటంతో ఆమె వద్దంటే వద్దని గొడవ చేస్తుంది.కేశవ్‌ను తప్ప ఇంకెవ్వరినీ పెళ్లి చేసుకోనని తెగేసి చెబుతుంది. మీకు అంతగా నాకు పెళ్లిచేయాలని ఉంటే కేశవ్‌కు ఇచ్చి పెళ్లి చేయమని అడుగుతుంది. దీంతో వాళ్ల అమ్మకు కోపం వచ్చి అసలు ఈ గొడవ అంతా ఈ ఫోన్ వల్లే వచ్చిందని శైలూ ఫోన్ తీసుకుని నేలకేసి కొడుతుంది. దీంతో శైలూ పగిలిపోయిన ఫోన్ తీసుకుని ఏడుస్తూ లోపలికి వెళ్లిపోతుంది.