Podarillu Serial Today Episode: స్టార్ మా ఛానెల్‌లో అత్యంత ప్రేక్షక ఆదరణతో దూసుకుపోతున్న పొదరిల్లు సీరియల్‌లో ఈరోజు ఎపిసోడ్ ఆసక్తిగా సాగుతుంది. పార్కులో తన మనసులో మాట మహాకు చెప్పే ప్రయత్నంలో చక్రి మళ్లీ చిక్కుల్లోపడుతుంటాడు. అలాగే కేశవ్‌ను పార్కులో చూసిన కన్నా వెళ్లి ఇంట్లో వాళ్లందరినీ పిలుచుకుని వస్తాడు. శైలూ దగ్గర తన పరపతి పెంచుకోవడం కోసం కేశవ్‌ ఇంట్లోవాళ్లందరినీ అనరాని మాటలు అనడంతో వాళ్లకు కోపం వస్తుంది. అంతే కన్నా పళ్లీలు అమ్మేవాడి వేషంలో వెళ్లి కేశవ్‌కు షాక్‌ ఇస్తాడు.
మహాకోసం చక్రి తిప్పలు
సరదాగా గడిపడంతోపాటు మహాను ఒంటరిగా కలిసి తన మనసులో మాట ఆమెతో చెప్పేందుకు చక్రి అందరికీ ప్లాన్ వేసి మరీ పార్కుకు తీసుకెళ్తాడు. కానీ అక్కడ అందరూ ఉండటంతో తన ప్లాన్ పారడం లేదని....కన్నా ద్వారా ఐస్‌క్రీమ్‌ కొనితెస్తానంటూ నాటకం ఆడతాడు. దీంతో మహా నేను వెళ్లి ఐస్‌క్రీమ్ కొనుక్కుని వస్తానని చెబుతుంది. ఇదే మంచి సమయమని కన్నా చెప్పడంతో చక్రి కూడా ఆమె వెనకే వెళ్తాడు.
కానీ మహా చక్రిని ఏమాత్రం పట్టించుకోకుండా వెళ్లిపోతుంది. ఒకచోట ఒంటరిగా ఉండటం చూసి చక్రి ఆమె దగ్గరకు వెళ్తాడు. ఇంతలో వ్యూవ్‌ బాగుందని చెప్పి మహా చక్రి ఫోన్ తీసుకుని వీడియోలు తీస్తుంటుంది. ఇదే మంచి సమయమని చక్రి తన మనసులో మాట చెప్పడానికి ప్రయత్నిస్తాడు.
ఆంటీ వలలో చిక్కిన చక్రి
చక్రి ఏదో పిచ్చిపిచ్చిగా వాగుతుంటాని తెలిసి మహా అక్కడి నుంచి దూరంగా వెళ్లిపోతుంది. ఆమె వెళ్లిన విషయం తెలియక చక్రి అటు తిరిగి మాట్లాడుతుంటాడు.ఇంతలో టిక్కెట్‌ కౌంటర్‌ దగ్గర చక్రికి డాష్‌ ఇచ్చిన ఆంటీ మళ్లీ వస్తుంది. చక్రి మహా కోసం మాట్లాడుతున్న మాటలన్నీ వింటుంది. ఆమెను వెతుక్కుంటూ ఆంటీ భర్త కూడా అక్కడికి వస్తాడు.ఇవన్నీ చూడకుండా ఐలయూ అంటూ అటు తిరగ్గానే అక్కడ మహా కనిపించదు. ఆంటీ మొగుడు కనిపించేసరికి చక్రి షాక్ తింటాడు. నా పెళ్లానికే లైన్ వేస్తున్నావురా అని అంటే ఆమె నీ పెళ్లాం ఏంటి నా పెళ్లాం అంటాడు చక్రి..మాకు 4 నెలల క్రితమే పెళ్లి అయ్యిందని చెబుతాడు. దీంతో వాళ్లిద్దరూ పడే గొడవ చాలా ఫన్నీగా ఉంటుంది.
అమ్మాయికి లైన్‌ వేసి అబాసుపాలైన కన్నా
చక్రి,మహాతో వెళ్లడంతో....మాధవ్‌ మనీషాను తీసుకుని పార్కు చూపించడానికి వెళ్లిపోవడంతో నారాయణ, కన్నా మాత్రమే మిగిలిపోతారు. చివరికి మనద్దరమే ఒకరికొకరు తోడుగా ఉంటామని నారాయణ కన్నాగాడిని ఏడిపిస్తాడు. నేను మీ పెద్దకొడుకుల్లా చచ్చు దద్దమని కాదని....నిమిషంలో అమ్మాయిని పడేస్తానని చెబుతాడు. వాళ్లు ఉన్నారని ఇన్నాళ్లు ఆగుతున్నానని లేకపోతే ఎప్పుడో నీకు చిన్న కోడలిని తీసుకొచ్చేవాడినని అంటాడు.అయితే ఒక అమ్మాయిని ఇప్పుడే పడేయరా చూస్తానని నారాయణ రెచ్చగొడతాడు. దీంతో కన్నా పార్కులో ఓ అమ్మాయిని చూసి తనని పడేస్తానని స్ట్లైల్‌గా వెళ్తాడు.ఆ అమ్మాయి కూడా నవ్వుతూ రిప్లై ఇస్తుంది.అది చూసి నారాయణ షాక్ తింటాడు. వీడు మామూలోడు కాదని అనుకుంటాడు. దీంతో కన్నా మరింత రెచ్చిపోతుంటాడు. ఇంతలో ఆ అమ్మాయి దగ్గరకు వచ్చి అన్నయ్యా మంచినీళ్లు ఇస్తావా అని అడుగుతుంది.అంతే కన్నాగాడి ఫీజులు ఎగిరిపోతాయి.
కేశవ్‌ను చూసిన కన్నా
ఐస్‌క్రీమ్ మీదపడటంతో కడుక్కోవడానికి వెళ్తూ...పొదల చాటు నుంచి కేశవ్ మాటలు వినిపించడంతో వెళ్లి చూస్తాడు కన్నా..శైలూను తీసుకుని పార్కుకు వచ్చిన కేశవ్‌ను చూసి వెంటనే వెళ్లి అందరినీ తీసుకుని వస్తాడు. వాళ్లు అక్కడ ఉండగానే చక్రిని పనీపాట లేని బేవర్సని...కన్నాగాడు చదువుకోకుండా డిగ్రీ ఏళ్లతరబడి చేస్తున్నాడని చెబుతాడు. అలాగే పెద్దన్న తన మంచితనంతో ప్రేమించిన అమ్మాయిని వదులుకున్న పిచ్చోడని..ఇక మా నారాయణకు వేస్ట్‌ఫెల్ కాంపిటేషన్‌ పెడితే ఫస్ట్‌ ప్రైజ్‌ వస్తుందని చెబుతాడు. ఇక మా చక్రిగాడి భార్య అయితే గయ్యాలిగంపేనని అంటాడు. మహాంకాళి నోరు తెరిస్తే భరించలేమని అందిర గురించి చెప్పడంతో వాళ్లు కోపంతో మండిపోతుంటారు. వీడి పని ఇంటికి వచ్చిన తర్వాత చెబుదామని తిరిగి వెళ్లిపోతారు. కానీ కన్నాగాడు మాత్రం ఇప్పుడే వాళ్ల సంగతి తేలుస్తానంటూ వెళ్తాడు. పళ్లీలు అమ్ముకుని వాడి దగ్గరకు వెళ్లి వాడి పళ్లీల బుట్ట తీసుుకని పళ్లీలు అమ్మేవాడిలా కేశవ్ వద్దకు వెళ్తాడు.వాడిని చూసిన కేశవ్‌ షాక్‌ తింటాడు.