PMFME Scheme: కొత్తగా ఫుడ్ బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా? లేదా ఉన్న బిజినెస్‌ను మరింత విస్తరించాలనుకుంటున్నారా? అయితే కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న ఈ బంపర్ ఆఫర్ మీ కోసమే. MSME పథకం కింద ఫుడ్ బిజినెస్, కేటరింగ్ లేదా ప్రాసెసింగ్ రంగంలో ఉన్నవారికి రూ. 10 లక్షల వరకు సబ్సిడీ లోన్స్ లభిస్తున్నాయి. అంతేకాదు, ఇందులో ఏకంగా 35% వరకు ప్రభుత్వం సబ్సిడీ అందిస్తోంది.

ఈ లోన్ పొందడానికి సరైన బిజినెస్ ప్లాన్, GST, ప్రాజెక్ట్ రిపోర్టు సిద్ధం చేసుకుంటే ప్రాసెస్ చాలా ఈజీ అవుతుంది. పన్నులు తగ్గించుకోవడమే కాకుండా ఆర్థికంగా స్థిరపడటానికి ఇది ఒక గొప్ప అవకాశం.

కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో PMFME పథకం ఫుడ్ బిజినెస్ చేసేవారికి భారీ ఆర్థిక సబ్సిడీ లభిస్తోంది. కొత్తగా ఫుడ్ బిజినెస్ ప్రారంభించేవారితో పాటు, ఇప్పటికే ఉన్న వ్యాపారాన్ని విస్తరించుకోవాలనుకునే వారికి ఈ పథకం ఎంతగానో ఉపయోగపడుతుంది.

అర్హతలు & సబ్సిడీ వివరాలు

ప్రాజెక్ట్ ఖర్చుపై 35% వరకు సబ్సిడీ పొందే అవకాశం ఉంటుంది. గరిష్టంగా రూ. 10 లక్షల వరకు క్రెడిట్ లింక్డ్ క్యాపిటల్ సబ్సిడీ ఉంటుంది. దరఖాస్తుదారుడు ప్రాజెక్ట్ విలువలో కేవలం 10% మాత్రమే సొంతంగా పెట్టుబడి పెట్టాలి. మిగిలిన 90% మొత్తాన్ని బ్యాంకులు రుణంగా మంజూరు చేస్తాయి.

అర్హులు

18 ఏళ్లు పైబడిన వ్యక్తులు, కొత్త ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు పెట్టేవారు, మహిళా స్వయం సహాయక బృందాలు (SHGs), రైతు ఉత్పత్తిదారుల సంఘాలు (FPOs) ఈ సబ్సిడీకి అర్హులు.

వ్యాపారాలు

బేకరీలు, పికిల్స్ తయారీ, మిల్లెట్స్ అండ్ స్నాక్స్ తయారీ, మసాలా పొడుల తయారీ, డెయిరీ ఉత్పత్తులు, పండ్ల రసాలు, ఇతర ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు.

Also Read: తెలంగాణలో కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ ఉన్నా, ప్రజలకు ఇబ్బందులే... షాక్ ఇచ్చిన టీఎస్‌హెచ్‌ఏ!

లోన్

మొత్తం ప్రాజెక్ట్ వ్యయం - రూ. 10,000,00

దరఖాస్తుదారు వాటా (10%) - రూ. 1,00,000

బ్యాంకు రుణం (90%) - రూ. 9,00,000

ప్రభుత్వ సబ్సిడీ (35%) - రూ. 3,50,000

కావాల్సిన పత్రాలు

ఆధార్ కార్డు, పాన్ కార్డ్, పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో

కనీసం 8వ తరగతి పాస్ లేదా పదో తరగతి సర్టిఫికెట్

డిటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్

కుల ధ్రువీకరణ పత్రం, బ్యాంక్ పాస్‌బుక్, షాపు రెంటల్ అగ్రిమెంట్

Also Read: 20 రోజులైనా PF క్లెయిమ్ అమౌంట్ రాకపోతే ఏం చేయాలి ? ఈ విషయాలు తెలుసుకుంటే బెటర్

అప్లై చేయడం ఎలా?

PMFME పోర్టల్ https://pmfme.mofpi.gov.in/ ఓపెన్ చేయండి.
మీ మొబైల్ నంబర్, ఆధార్ వివరాలతో అప్లికెంట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.
మీ పర్సనల్ డీటైల్స్, ఫుడ్ బిజినెస్ రకం, అంచనా ప్రాజెక్ట్ ఖర్చు వివరాలను నమోదు చేయాలి.
అవసరమైన డాక్యుమెంట్స్ అప్‌లోడ్ చేయాలి.
అప్లికేషన్ సమర్పించిన తర్వాత నోడల్ ఏజెన్సీ లేదా జిల్లా పరిశ్రమల కేంద్రం (DIC) అధికారులు పరిశీలించి, అనుమతి కోసం సంబంధిత బ్యాంకులకు పంపుతారు.

Also Read: ప్రీపెయిడ్ కస్టమర్లకు సైతం స్పాటిఫై ప్రీమియం సహా 3 సేవలు అందిస్తున్న Vi