PM Modi Meeting With Chief Ministers: శుక్రవారం సీఎంలతో మోదీ వర్చువల్ మీటింగ్ - ఇంధన సంక్షోభంపై జాతీయ అత్యవసర ప్రణాళిక!

2 weeks ago 3
ARTICLE AD

Iran War PM Modi Meeting With Chief Ministers: పశ్చిమాసియా   లో ఇరాన్, ఇజ్రాయెల్ మరియు అమెరికా మధ్య ఉద్రిక్తతలు పతాక స్థాయికి చేరడంతో  భారత ప్రభుత్వం అత్యంత అప్రమత్తమైంది. ఈ సంక్షోభం భారత ఇంధన భద్రతపై , ఆర్థిక వ్యవస్థపై చూపబోయే ప్రభావాన్ని ఎదుర్కోవడానికి ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో వ్యూహాత్మక అడుగులు పడుతున్నాయి.

పశ్చిమాసియాలో ముదురుతున్న యుద్ధ మేఘాలు భారత ఆర్థిక మూలాలను దెబ్బతీసే ప్రమాదం పొంచి ఉంది. ముఖ్యంగా ముడిచమురు సరఫరాకు అత్యంత కీలకమైన స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ మార్గం పాక్షికంగా మూతపడటంతో, భారత చమురు దిగుమతులకు ఆటంకం ఏర్పడే అవకాశం కనిపిస్తోంది. ఈ ముప్పును ఎదుర్కోవడానికి ప్రధాని మోదీ ఇప్పటికే కేంద్ర క్యాబినెట్ భద్రతా కమిటీ తో వరుస భేటీలు నిర్వహించారు. ఈ క్రమంలోనే, క్షేత్రస్థాయిలో రాష్ట్రాల సహకారం అత్యవసరమని భావించి, శుక్రవారం అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని మోదీ అత్యవసర వర్చువల్ సమావేశాన్ని ఏర్పాటు చేశారు.

ప్రస్తుతం దేశవ్యాప్తంగా పెట్రోల్ బంకుల వద్ద కనిపిస్తున్న రద్దీ  ,  నో స్టాక్ బోర్డులపై కేంద్రం స్పష్టతనిచ్చింది. దేశంలో దాదాపు 60 రోజులకు సరిపడా ఇంధన నిల్వలు  ఉన్నాయని, ప్రజలు సోషల్ మీడియాలో వస్తున్న వదంతులు నమ్మి పానిక్ బయింగ్  చేయవద్దని కేంద్ర పెట్రోలియం శాఖ విజ్ఞప్తి చేసింది. అయితే, యుద్ధం దీర్ఘకాలం కొనసాగితే తలెత్తే ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని, రాష్ట్రాల్లోని పౌరసరఫరాల విభాగం అప్రమత్తంగా ఉండాలని, కృత్రిమ కొరత సృష్టించే బ్లాక్ మార్కెట్ ముఠాలపై ఉక్కుపాదం మోపాలని ముఖ్యమంత్రులకు ప్రధాని సూచించనున్నారు.

ఈ సమావేశంలో ఇంధన పొదుపు కోసం కేంద్రం ఒక నేషనల్ ఎమర్జెన్సీ డిమాండ్ రిడక్షన్ ప్లాన్ ను ప్రతిపాదించనుంది. ఇందులో భాగంగా.. వీలైనంత వరకు వర్క్ ఫ్రమ్ హోమ్  ప్రోత్సహించడం, నగరాల్లో వాహనాల రాకపోకలపై  ఆడ్-ఈవెన్ పద్ధతిని అమలు చేయడం, ప్రజారవాణా వ్యవస్థను గరిష్టంగా వినియోగించుకోవడం వంటి అంశాలపై రాష్ట్రాల అభిప్రాయాలను తీసుకోనున్నారు. రవాణా రంగంపై భారం పడకుండా ఉండటానికి డీజిల్ వినియోగాన్ని క్రమబద్ధీకరించడం ,  వ్యవసాయ అవసరాలకు ఇంధనం లోటు లేకుండా చూడటం ఈ భేటీ ప్రధాన ఎజెండా.

PM Narendra Modi will interact with CMs tomorrow evening through video conferencing on the West Asia conflict to review preparedness and plans of states. Meeting to focus on ensuring synergy of efforts in the spirit of ‘Team India’. pic.twitter.com/CxOKdk2HcV
— ANI (@ANI) March 26, 2026

ఆర్థికంగా చూస్తే, యుద్ధం వల్ల పెరుగుతున్న వార్ ప్రీమియం  కారణంగా ముడిచమురు ధరలు భారీగా పెరిగే అవకాశం ఉంది. ఇది నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలకు   దారితీస్తుంది. దీనిని అరికట్టడానికి రాష్ట్రాలు తమ పరిధిలోని వ్యాట్ పన్నుల విషయంలో అనుసరించాల్సిన విధానాలపై చర్చించనున్నారు. అలాగే, ఎరువులు, ఫార్మా రంగానికి అవసరమైన ముడి పదార్థాల దిగుమతులకు అంతరాయం కలగకుండా రష్యా, పశ్చిమ ఆఫ్రికా వంటి ప్రత్యామ్నాయ దేశాల నుండి దిగుమతులను వేగవంతం చేసేలా కేంద్రం ప్రణాళికలు సిద్ధం చేసింది.

పశ్చిమాసియాలో చిక్కుకున్న సుమారు కోటి మంది భారతీయుల భద్రత కేంద్రానికి అతిపెద్ద సవాలుగా మారింది. యుద్ధం తీవ్రమైతే వారిని సురక్షితంగా వెనక్కి తీసుకురావడానికి అయ్యే ఖర్చు, వారు తిరిగి వచ్చాక రాష్ట్రాల్లో కల్పించాల్సిన ఉపాధి అవకాశాలపై కూడా ప్రధాని ముఖ్యమంత్రులతో చర్చించనున్నారు. గల్ఫ్ దేశాల నుండి వచ్చే రెమిటెన్స్  తగ్గితే దేశ కరెన్సీ విలువ పడిపోయే ప్రమాదం ఉన్నందున, రాష్ట్ర ప్రభుత్వాలు తమ ఆర్థిక స్థితిగతులను ఎలా సమన్వయం చేసుకోవాలో ఈ సమావేశం దిశానిర్దేశం చేయనుంది. మొత్తానికి, ఈ వర్చువల్ భేటీ భారత ఇంధన మరియు ఆర్థిక భద్రతకు ఒక రక్షణ కవచంలా మారనుందని భావిస్తున్నారు.

Read Entire Article