ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Narendra Modi) భారత రాజకీయాలలో అత్యంత ప్రభావవంతమైన, ప్రజాదరణ పొందిన నాయకుడిగా పేరు సంపాదించుకున్నారు. ఈరోజు అంటే సెప్టెంబర్ 17వ తేదీన 2025లో ఆయన తన 75(Modi 75th Birthday)వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఒక సాధారణ కుటుంబం నుంచి వచ్చి దేశంలోని అత్యున్నత రాజకీయ పదవికి ఎదిగిన ఆయన ప్రయాణం ఎందరికో స్ఫూర్తిదాయకంగా నిలుస్తోంది. అందుకే ప్రజలు.. ముఖ్యంగా యూత్ మోదీని చాలా ఇష్టపడతారు. అందుకే ఆయన గురించిన విషయాలు తెలుసుకునేందుకు ఆసక్తి చూపిస్తారు. ఈరోజు మోదీ పుట్టినరోజు సందర్భంగా.. ఆయన జీతం, ఆస్తుల గురించి తెలుసుకుందాం.

ప్రధాని మోదీకి ఎంత జీతం వస్తుంది? (PM Modi Salary)

భారతదేశం ప్రధానమంత్రిగా పనిచేస్తున్న నరేంద్ర మోదీకి ప్రతి నెలా దాదాపు 1.66 లక్షల రూపాయల జీతం అందుతుంది. ఇందులో పార్లమెంటరీ అలవెన్స్, వ్యయ అలవెన్స్, రోజువారీ అలవెన్స్, ప్రాథమిక వేతనం కూడా ఉంటాయి. దీని ప్రకారం.. మోదీ 45,000 రూపాయలు పార్లమెంటరీ అలవెన్స్గా, 3,000 రూపాయలు వ్యయ అలవెన్స్గా, 2,000 రూపాయలు రోజువారీ అలవెన్స్గా, 50,000 రూపాయలు ప్రాథమిక వేతనంగా పొందుతున్నారు. అలా చూస్తే ప్రధాని మోదీ జీతం కేవలం 50,000 రూపాయలు మాత్రమే. అయితే మీకు తెలుసా? మోదీ తన పూర్తి జీతాన్ని వ్యక్తిగత ఖర్చుల కోసం ఉపయోగించకూడదని నిర్ణయించుకున్నారట. అందుకే నరేంద్ర మోదీ తన జీతాన్ని ప్రధానమంత్రి సహాయ నిధి (PM రిలీఫ్ ఫండ్)కి విరాళంగా ఇస్తారు. దీని లక్ష్యం దేశంలోని పేద ప్రజలకు సహాయం చేయడమే.

ప్రధాని మోదీ ఆస్తులు (PM Modi Assets)

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆస్తి గత 18 సంవత్సరాలలో చాలా పరిమితంగా పెరిగింది. 2007లో అతని ఆస్తి మొత్తం 42.56 లక్షల రూపాయలు. 2012లో ఇది 1.33 కోట్ల రూపాయలకు పెరిగింది. 2014లో 1.26 కోట్ల రూపాయల ఆస్తితో ఉన్నారు. 2017లో మోదీ ఆస్తి మొత్తం 2.00 కోట్ల రూపాయలకు చేరుకుంది. 2024లో అతని ఆస్తి 3.02 కోట్ల రూపాయలకు పెరిగింది.

ప్రధాని మోదీ దగ్గరున్న నగదు ఎంత?

ప్రధాని మోదీ వద్ద మొత్తం నగదు 52,920 రూపాయలు మాత్రమే ఉంది. దీనితో పాటు.. ఆయనకు భూమి లేదా ఇల్లు వంటి ఆస్తి లేదు. అలాగే, ఆయనపై ఎటువంటి రుణం లేదా బాధ్యత లేదు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తన ఆదాయానికి సంబంధించిన సమాచారాన్ని ఆదాయపు పన్ను రిటర్న్స్లో ఏ విధంగా నమోదు చేశారంటే...

2018-2019 సంవత్సరంలో అతని ఆదాయం 11.14 లక్షల రూపాయలు.

2019-2020 లో ఆదాయం 17.20 లక్షల రూపాయలకు పెరిగింది.

2020-2021 లో ఆదాయం 17.07 లక్షల రూపాయలుగా నమోదైంది.

2021-2022 లో ఆదాయం తగ్గి 15.41 లక్షల రూపాయలకు చేరుకుంది.

2022-2023 లో ఆదాయం మళ్లీ పెరిగి 23.56 లక్షల రూపాయలుగా నమోదైంది.

ఆస్తి పరంగా ప్రధాని మోదీకి ఇంకేమున్నాయి?

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వద్ద మొత్తం 50 వేలకు పైగా డబ్బు నగదు రూపంలో ఉన్నాయి. దీనితో పాటు ఆయన ఎస్‌బిఐలో ఫిక్స్‌డ్ డిపాజిట్లు, దానిపై వడ్డీతో కలిపి దాదాపు 2.85 కోట్ల రూపాయలు ఉన్నాయి. ఎస్బిఐలో అతని అదనపు డిపాజిట్ 80,304 రూపాయలు. నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్‌లో వడ్డీతో కలిపి మోదీ డిపాజిట్ 9.12 లక్షల రూపాయలు. ఆయన వద్ద ఉన్న ఆభరణాలలో బంగారు ఉంగరం విలువ 2.67 లక్షల రూపాయలు. దీనితో పాటు.. ఇతర ఆస్తులలో క్లెయిమ్స్, వడ్డీల విలువ 3.33 లక్షల రూపాయలుగా ఉందని నివేదికలు చెప్తున్నాయి.