Benefits of Plant-Based Foods : మొక్కల ఆధారిత ఆహారం (Plant Based Food) మొత్తం శ్రేయస్సును కాపాడుకోవడానికి హెల్ప్ చేస్తుంది. ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి అత్యంత సహజమైన, ప్రభావవంతమైన మార్గాలలో ప్లాంట్ బేస్డ్ ఫుడ్ కూడా ఒకటి. ప్రకృతి మనకు నేరుగా అందించే ఆహారాలు అంటే ధాన్యాలు, పండ్లు, కూరగాయలు, గింజలు, విత్తనాలతో కూడినవి. వీటితో కూడిన ఆహారం శరీరానికి ముఖ్యమైన పోషకాలను అందిస్తుంది. బాగా ప్రాసెస్ చేసిన ఆహారాలకు భిన్నంగా.. మొక్కల ఆధారిత ఆహారం స్వచ్ఛమైన, ఆరోగ్యకరమైన పోషణను అందిస్తుంది. ఇది శరీరానికి, మనసుకు కూడా హెల్ప్ చేస్తుందని పోషకాహార నిపుణులు శ్రీమతి ఆల్మా చోప్రా తెలిపారు.

ఆరోగ్యంతో పాటు.. మానసిక ఆరోగ్యానికి కూడా

మొక్కల ఆధారిత ఆహారాల్లో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది పేగు ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఆరోగ్యకరమైన పేగు మంచి జీర్ణక్రియకు మద్దతు ఇస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. మీ శరీరం పోషకాలను సమర్థవంతంగా గ్రహించేలా చేస్తుంది. జీర్ణ ఆరోగ్యానికి మద్దతు ఇచ్చి మానసిక స్పష్టతను పెంచుతుంది. ఎమోషనల్గా బ్యాలెన్స్గా ఉండేలా చేస్తుంది.

మొక్కల ఆధారిత ఆహారం ఎక్కువగా తీసుకోవడం వల్ల ఆందోళన, ఒత్తిడి స్థాయిలు తగ్గుతాయని... ప్రశాంతత లభిస్తుందని పరిశోధనలు చెప్తున్నాయి. పేగు సరిగ్గా పనిచేసినప్పుడు అది మెదడుకు సానుకూల సంకేతాలను పంపుతుంది. దీనివల్ల మానసిక స్థితి మెరుగై.. మూడ్ డిస్టర్బ్ కాకుండా ఉంటుంది. అభిజ్ఞా పనితీరుకు హెల్ప్ చేస్తుంది. మెదడు ఆరోగ్యానికి కూడా మంచిది కాబట్టే.. పిల్లలకు కూడా ఈ తరహా ఫుడ్ అలవాటు చేయాలంటున్నారు.

బ్యాలెన్స్డ్ డైట్

ఈ మధ్యకాలంలో ఆరోగ్యంపై శ్రద్దతో చాలామంది నాన్వెజ్కి దూరంగా ఉంటూ శాఖాహారులుగా మారుతున్నారు. లేదా మొక్కల ఆధారిత జీవనశైలిని స్వీకరిస్తున్నారు. అలా ఫాలో అయ్యేవారిలో శక్తి స్థాయిలు, మానసిక స్థితి, మొత్తం ఆరోగ్యంలో స్పష్టమైన మార్పులు, మెరుగుదలను చూస్తున్నారు. కాబట్టి మీరు కూడా మీ డైట్లో ప్లాంట్ బేస్డ్ ఫుడ్ ఉండేలా చూసుకునేందుకు ట్రై చేయాలని చెప్తున్నారు పోషకాహార నిపుణులు. భోజనాన్ని కేవలం ఆహారంగానే చూడకుండా.. అది మీ మనస్సు, శరీరానికి పోషణనిచ్చే ఫుడ్గా చూడాలంటున్నారు. ఆకుకూరలు, ధాన్యాలు మీ భోజనంలో ఉండేలా చూసుకోండి. ప్లేట్ ఎప్పుడూ బ్యాలెన్స్డ్గా ఉండేలా చూసుకోవాలి. అప్పుడే శరీరానికి కావాల్సిన పోషకాలు లోపలి నుంచి అందుతాయి.

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.