Jio BP Petrol Pump Dealership Apply Online | పెట్రోల్ బంక్ వ్యాపారం ద్వారా అధిక లాభాలు పొందవచ్చని చాలా మంది భావిస్తుంటారు. ఎందుకంటే పెట్రోల్, డీజిల్ ఎంత ఎక్కువగా అమ్మితే అంత ఎక్కువ కమీషన్ మీకు లభిస్తుంది. మన దేశంలో పెట్రోల్, డీజిల్‌లకు ఎప్పటికప్పుడు మంచి డిమాండ్ ఉంటుంది. మీరు కూడా పెట్రోల్ బంక్ ఏర్పాటు చేయాలనుకుంటే, ఇప్పుడు మంచి అవకాశం లభించింది. ప్రముఖ ప్రైవేట్ చమురు మార్కెటింగ్ సంస్థ రిలయన్స్ జియో-బీపీ కొత్త బంకుల ఏర్పాటుకు నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హులైన ఆసక్తి ఉన్న వారు దరఖాస్తు చేసుకోవడానికి అక్టోబర్ 31, 2025 చివరి తేదీగా ప్రకటించారు.

కొన్ని వ్యాపారాలు నిత్య కళ్యాణం పచ్చతోరణంలా ఎప్పటికప్పుడు ఆదాయాన్ని అందిస్తూనే ఉంటాయి. అలాంటి వ్యాపారాల్లో పెట్రోల్ పంప్ నిర్వహించడం ఒకటి. సరైన ప్రదేశంలో పెట్రోల్ బంక్ ఏర్పాటు చేస్తే 24 గంటలూ వినియోగదారులకు సేవలు అందింవచ్చు. ఒకసారి పెట్టుబడి పెడితే ఏడాది పొడవునా స్థిర ఆదాయం పొందవచ్చు. అయితే, ఈ వ్యాపారానికి ప్రారంభంలో పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. కొంత అనుభవం కూడా అవసరం. అన్ని అర్హతలు ఉన్నవారికి పెట్రోల్ బంక్ ఏర్పాటు తేలిక అవుతుంది.

జియో-బీపీ సంస్థ ప్రస్తుతం దేశవ్యాప్తంగా, మున్సిపాలిటీలు, గ్రామీణ ప్రాంతాల్లో కొత్త పెట్రోల్ బంకులను ఏర్పాటు చేయడానికి ఆసక్తి ఉన్న వారి నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. దరఖాస్తు ప్రక్రియ గురించి పూర్తి సమాచారం జియో బీపీ అధికారిక వెబ్‌సైట్ ద్వారా తెలుసుకోవచ్చు. దరఖాస్తు కోసం వెబ్‌సైట్ partners.jiobp.in పేజీని కూడా సందర్శించాలి.

Get Jio-bp dealership with quick, simplified processes and lesser investments.
Visit https://t.co/nmNBs9d6Ws today!#Jiobp #BeAJiobpDealer #FuelYourSuccess #ProfitablePartnership pic.twitter.com/sUJEOE1VS1

— Jio-bp Official (@Jiobpofficial) August 1, 2025

ఈ డీలర్‌షిప్ DODO (Dealer Owned Dealer Operated) మోడల్‌లో ఉంటుంది. జియో-బీపీ సంస్థ ఇందుకోసం ప్రత్యేక బ్రోచర్ విడుదల చేసింది. నేషనల్ లేదా స్టేట్ హైవేల పక్కన లేదా గ్రామీణ ప్రాంతాలకు వెళ్లే ప్రధాన రహదారుల వెంట భూమి కలిగి ఉన్నవారు, పెట్టుబడి పెట్టగల సామర్థ్యం ఉన్నవారు దరఖాస్తు చేయవచ్చు. దరఖాస్తుదారులు వారి సంస్థ రకానికి అనుగుణంగా ప్రత్యేక ఫారమ్ నింపాలి – వ్యక్తిగతంగా ఉంటే యజమాని ఫారమ్, భాగస్వామ్య సంస్థ అయితే ప్రతి భాగస్వామి ఫారమ్, ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ అయితే సంస్థ పేరు మీద ఫారమ్, పబ్లిక్ లిమిటెడ్ సంస్థ అయితే అందుకు అనుగుణంగా ఫారమ్ నింపాలి.

అదనంగా, CA ద్వారా తాజా నెట్‌వర్త్ స్టేట్మెంట్ తీసుకురావాలి. పాన్ కార్డు, ఆధార్ కార్డు, ఎడ్యుకేషన్ సర్టిఫికెట్, అఫిడవిట్, భూమికి సంబంధించిన డాక్యుమెంట్లు అందించాలి. అయితే, ఇతర ఆయిల్ కంపెనీలతో సంబంధాలున్నవారు, దివ్యాంగులు, కేసుల్లో ఇరుక్కుని నేరాలు రుజువైన వారు, NRIలు అర్హులు కాదు. దరఖాస్తు ఫీజుగా రూ.5,000 నాన్-రిఫండబుల్ చెల్లించాలి.

భూమి, పెట్టుబడి ప్రాంతాన్ని బట్టి ఇలా ఉంటాయి
నేషనల్ హైవే పక్కన: 1225 - 4422 చదరపు అడుగుల భూమి అవసరం, పెట్టుబడి రూ.1.51 లక్షల నుంచి రూ.2.80 లక్షల వరకు.

మెట్రోపాలిటన్ లేదా మున్సిపాలిటీ పరిధిలో: 400 - 2021 చదరపు అడుగుల భూమి, పెట్టుబడి రూ.1.16 లక్షల నుంచి రూ.2.24 లక్షల వరకు.

గ్రామీణ లేదా వ్యవసాయ రోడ్ల పక్కన: 1200 - 1600 చదరపు అడుగుల భూమి, పెట్టుబడి రూ.82 లక్షల నుంచి రూ.1.40 కోట్ల వరకు అవసరం అవుతుంది.